బీసీ చేతిలో బాబు ఓటమి ఖాయం: మంత్రి జోగి రమేష్

34

– బీసీల దెబ్బేంటో బాబుకు రుచి చూపిస్తాం..
– పవన్ పెట్టుకోవాల్సింది వారాహి కాదు…నారాహి

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ ఇంకా ఏం మాట్లాడారంటే:
రాష్ట్రంలో త్రీ సైకోస్‌ (చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, లోకేష్‌) కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయహో బీసీ ట్రైలర్‌ చూసే తడుపుకుంటున్నారు. బెంబేలెత్తిపోతూ బీపీలు, షుగర్లు పెంచుకుంటున్నారు. వారికి గుండెలు జారిపోతున్నాయి. ట్రైలర్‌ కే ఇలా బెంబెలేత్తిపోతే రేపటి ఎన్నికల్లో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు చూపించే సినిమాకి చంద్రబాబు మూర్చవచ్చి పడిపోతాడు. బలహీనవర్గాలు అంతా ఒకే తాటిపైకి వచ్చి 85 వేల మంది ప్రజాప్రతినిధులు ఒకచోట చేరి, ఒక సెలబ్రేషన్‌ చేసుకుంటే దాన్ని చూసి కళ్లు కుట్టి, అసూయ ద్వేషాలతో రగిపోతున్న చంద్రబాబు- బీసీల ఆత్మ గౌరవంపై దెబ్బకొట్టే విధంగా మాట్లాడుతున్నాడు.

ఎంత మంది బీసీ నేతలను తయారు చేశావో చర్చకు సిద్ధమా బాబూ…?
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన బాబు హయాంలో.. ఎప్పుడైనా ఇన్ని వేలమంది బీసీలకు ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ భాగస్వామ్యం చేయగలిగావా.. సూటిగా సమాధానం చెప్పు. నీ లెక్కలు తీసుకురా… జగన్ గారు, కేవలం మూడున్నరేళ్ళలోనే ఎంతమంది బీసీ నాయకత్వాన్ని తయారు చేశారో మేం చెప్తాం…చర్చకు నువ్వు సిద్ధమా చంద్రబాబూ..? సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం నీకు కానీ, నిన్ను మోస్తున్న నీ బినామీలు అచ్చెన్న, యనమలకు గానీ ఉందా..? నీ హయాంలో ఒక్క బీసీకైనా రాజ్యసభ సీటు ఇవ్వగలిగావా సమాధానం చెప్పాలి. వర్ల రామయ్యకు రాజ్యసభ ఇస్తానని ప్రకటన చేసి, ప్రకాశం బ్యారేజీ దాటకముందే ఆయన పేరు ఎత్తేసి తనకు కావాల్సిన కనకమేడలకు ఇచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు. మా ఫథకాలను కొనసాగిస్తానంటూ చంద్రబాబు చెబుతున్న మాటల్లోనే జగనన్న గొప్పతనం కనిపిస్తుంది. ఆ విధంగా.. చంద్రబాబు సైతం జై జగన్‌ అంటున్నాడు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా నువ్వు చేయలేనివి మా నాయకుడు జగన్మోహన్‌రెడ్డి గారు చేస్తున్నారని ఒప్పుకున్నట్లే కదా.. ఇంతకన్నా ఎవరికైనా ఏం కావాలి.

సామాజిక న్యాయం జగన్మోహన్‌రెడ్డి గారితోనే సాధ్యమైందని రాష్ట్రం నలుమూలల నుంచి ఒక రోజు ముందే కేరింతలు కొట్టుకుంటూ జయహో బీసీ సభకు వచ్చారు. దీన్ని చూడలేక చంద్రబాబు, ఆయన ఎల్లో గ్యాంగ్, ఎల్లో మీడియా, జనం రాలేదంటూ తప్పుడు రాతలు రాశారు. జగన్మోహన్‌ రెడ్డి గారు బీసీలను గుండెల్లో పెట్టుకున్నారు. మా పిల్లల చదువులకు తోడ్పడుతున్నాడు. సామాజిక సంఘ సంస్కర్తగా జగన్ గారు బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేస్తున్నారని ఈ వర్గాల ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చచ్చిపోయే వరకూ జగన్‌ గారిని గుండెల్లో పెట్టుకుని 2024లో ఆయన అడుగులో అడుగు వేస్తామని మా వర్గాలన్నీ శపథం చేస్తున్నారు. మాకు కావాల్సింది ఆత్మగౌరవం..దాన్ని జగన్మోహన్‌ రెడ్డి గారు ఇచ్చారని బీసీలు ముక్తకంఠంతో చెప్తున్నారు.

– 2019లో బీసీల ప్రభంజనం వీస్తే.. 2024లో బీసీల సునామీ ధాటికి కుప్పంలో చంద్రబాబు సైతం ఘోరాతిఘోరంగా ఓడిపోబోతున్నాడు. అది కూడా వైఎస్సార్సీపీ బీసీ అభ్యర్థి చేతిలో ఓడిపోబోతున్నాడు. బీసీల దెబ్బేంటో చంద్రబాబుకు రుచిచూపిస్తాం. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకూ బలహీనవర్గాల సైన్యాన్ని ఏర్పాటు చేసిన ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్‌ రెడ్డి. 2024 ఎన్నికల లగ్నం..బాబుకి, ఆయన దత్తపుత్రుడికి, సొంత పుత్రుడికి, ఆయన సొంత పార్టీకి చావు లగ్నం అవుతుంది. టీడీపీకి, పవన్‌ కళ్యాణ్‌కి శాశ్వతంగా కర్మకాండలు చేసే లగ్నం అవుతుంది.

పవన్ పెట్టుకోవాల్సింది వారాహి కాదు…నారాహి
పవన్ పెట్టుకోవాల్సింది వారాహి కాదు…నారాహి అని పేరు పెట్టుకో. ఎందుకంటే నీవు ఇంకా చంద్రబాబు చంకలోనే ఉన్నావు కాబట్టి. ఇప్పటికైనా, చంద్రబాబు తొత్తులా, ఆయనకు సాగిల పడకుండా జనసేన పార్టీ 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెడుతుంది… నేనే సిఎం అభ్యర్థిని అని పవన్‌ కళ్యాణ్‌ చెప్పగలడా..? వీళ్లంతా పగటి వేషగాళ్లు…వీళ్లని నమ్ముకున్న వాళ్లంతా నట్టేటా మునిగిపోతారు. 160 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని అచ్చెన్న అంటున్నాడు. అసలు 160 స్థానాల్లో టీడీపీ నిలబడుతుందా అనేది చెప్పాలి. చరిత్ర హీనుడు పవన్‌ కళ్యాణ్‌.. రాజకీయాల్లో ఓనమాలు రాని వ్యక్తి లోకేష్‌. వీళ్లెవ్వరూ జగన్మోహన్‌ రెడ్డి గారికి సాటి రారు. పవన్‌ కళ్యాణ్‌ ను చూసి ఎవరు భయపడతాడు..? పిరికి సన్యాసి పవన్‌కళ్యాణ్‌.. అతన్ని చూసి మేం భయపడే పరిస్థితి లేదు. చంద్రబాబు మాటల్లో బీసీ అంటే బాబు క్యాస్ట్‌..ఎస్సీ అంటే సేమ్‌ క్యాస్ట్‌…బీసీల మీద ప్రేముంటే చంద్రబాబు ఎందుకు ఒక్క రాజ్యసభ సీటుకూడా ఇవ్వలేదో చెప్పాలి. మా నాయకుడు వైఎస్‌జగన్‌ జనరల్‌ స్థానాల్లో సైతం బీసీలను మేయర్లు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లుగా, ఇతర పదవుల్లో కూర్చోబెట్టారు.