-విజయవాడలో జరిగింది బీసీల సాధికారత సభ- బీసీ ప్రతినిధుల సెలబ్రేషన్
-దేశ చరిత్రలోనే ఇటువంటి సభ ఎక్కడా, ఎప్పుడూ జరగలేదు
-బస్సుల్లో వచ్చినవారంతా పార్టీ నుంచి ఎన్నికైన బీసీ ప్రజా ప్రతినిధులే.
-తన 45 ఏళ్ళ కెరీర్ లో చంద్రబాబు ఇంతమంది బీసీలకు ఏనాడైనా పదవులు ఇచ్చాడా?
-రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా జగన్ హయాంలో బీసీలకు పదవులు
-రియల్ లీడర్, సామాజిక సంస్కర్త జగన్
-తనను గెలిపిస్తే.. జగన్ గారి పథకాలను అమలు చేస్తానని చెప్పుకుని తిరుగుతున్న బాబు ఒక లీడరా..?
-మంత్రులు చెల్లుబోయిన వేణు, సీదిరి అప్పలరాజు
మొదటిగా చంద్రబాబు తెలుసుకోవాల్సింది- విజయవాడలో నిర్వహించింది.. పార్టీ నుంచి ఎన్నికైన బీసీ ప్రతినిధుల బహిరంగ సభ – ప్రచార సభ కాదు. అది బీసీల సాధికారత సభ. రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలోనే ఇటువంటి సభ ఎప్పుడూ జరగలేదు. ఎక్కడా జరగలేదు. చంద్రబాబు నాయుడు హయాంలో ఇంతమంది బీసీలకు తన 45 ఏళ్ళ కెరీర్ లో ఎప్పుడూ, ఎక్కడా పదవులు ఇవ్వలేదు.
మూడున్నరేళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో.. అవలంభించిన సామాజిక న్యాయం వల్ల, రాజకీయంగా, ప్రభుత్వపరంగా పదవులు పొందినవారంతా(84 వేల మంది) ఒక వేదిక మీదకు వచ్చిన బీసీ ప్రజా ప్రతినిధుల సమ్మేళనం అది. బీసీల పండుగ. మా పార్టీలోని బీసీ ప్రజాప్రతినిధులు చేసుకున్న సెలబ్రేషన్. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడనంతగా బీసీలు అత్యధికంగా జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వంలో పదవులు పొందారు. అలాంటి ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవులు పొందిన బీసీ వర్గాలకు చెందిన వారు ఒక దగ్గర చేరి జయహో బీసీ అని తమ శక్తిని చాటారు.
మా నాయకుడు జగన్ మాట్లాడుతుంటే.. అక్కడ ఉన్నవారంతా ముందుకు తోసుకువచ్చారు. దాన్ని పచ్చ మీడియా బూతద్దంలో చూపాలని ప్రయత్నం చేసింది. రియల్ లీడర్, సామాజిక సంస్కర్తలా ఆలోచించే నాయకుడు జగన్ మోహన్ రెడ్డిగారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారని అందరికీ తెలిసేలా జయహో బీసీ సభ సెలబ్రేట్ చేసుకున్నాం. 84 వేల మందికి పైగా బీసీ ప్రతినిధులు జయహో సభకు వచ్చింది అందరూ చూశారు. కానీ ఎవరూ రాలేదని, అక్కడ జనం లేరని చూపాలని, విషం కక్కాలని ఎల్లో మీడియా ప్రయత్నం చేసింది. మరోసారి చెబుతున్నాం, విజయవాడలో జరిగింది పక్కాగా జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని బీసీల సాధికారకత సభ. బీసీ ప్రజాప్రతినిధుల సభ. ఎన్నికైన బీసీ లీడర్ షిప్ ఆ సభలో ఉంది. వాళ్లే జయహో సభను నిర్వహించారు. మిగిలిన వర్గాల నాయకులు సాంకేతికంగా సహకారం అందించిన వాళ్లు మాత్రమే.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని గతంలో చంద్రబాబు సభలకు తరలించినట్టు మేం జనాన్నిగానీ, డ్వాక్రా మహిళల్ని గానీ ఎక్కడా తరలించలేదు. బస్సుల్లో వచ్చింది బీసీ ప్రజా ప్రతినిధులే. కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం ఇది. ఏ పార్టీకి ఓటు వేశారన్నది మేం చూడటం లేదు. ఏ పార్టీ అయినా, కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హత ఉంటే చాలు, సంక్షేమ పథకాలను లబ్ధిదారుల గడప వద్దకే తెచ్చి వాలంటీర్ల ద్వారా అందిస్తున్నాం.
చంద్రబాబు, తన 45 ఇయర్స్ రాజకీయ జీవితంలోగానీ, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో గానీ… తన బ్రాండ్ ఇదీ.. అని చెప్పుకునే ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకపోగా, ఈరోజు జగన్ మోహన్ రెడ్డిగారు అమలు చేస్తున్న పథకాలనే, తాను అధికారంలోకి వస్తే.. అమలు చేస్తానని చెప్పుకుంటూ తిరుగుతున్నాడంటే, ఇతను ఒక నాయకుడా..?
బీసీ మహా సభకు హాజరైన బీసీ ప్రజా ప్రతినిధులు 84 వేల మంది జాబితా ఇదిః
1. పార్టీ జిల్లా అధ్యక్షులు
2. రాజ్యసభ ఎంపీలు
3. లోక్ సభ ఎంపీలు
4. ఎమ్మెల్సీలు
5. మంత్రులు
6. ఎమ్మెల్యేలు
7. అసెంబ్లీ కో-ఆర్డినేటర్స్
8. రాష్ట్ర అధికార ప్రతినిధులు
9. రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు
10. జనరల్ కార్పొరేషన్ ఛైర్మన్/ ఛైర్ పర్సన్స్
11. క్యాస్ట్ కార్పొరేషన్ ఛైర్మన్/ ఛైర్ పర్సన్స్
12. జిల్లా పరిషత్ ఛైర్మన్/ ఛైర్ పర్సన్స్
13. జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్/ వైస్- ఛైర్ పర్సన్స్
14. మేయర్లు
15. డిప్యూటీ మేయర్లు
16. డీసీసీబీ & డీసీఎమ్ఎస్ ఛైర్మన్/ ఛైర్ పర్సన్స్
17. గ్రంధాలయ ఛైర్మన్/ ఛైర్ పర్సన్స్
18. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు
19. జనరల్ కార్పొరేషన్ డైరెక్టర్స్
20. బీసీ కార్పొరేషన్ డైరెక్టర్స్
21. కార్పొరేటర్స్
22. జెడ్పీటీసీలు
23. మున్సిపల్ ఛైర్మన్/ చైర్ పర్సన్స్
24. మున్సిపల్ వైస్ ఛైర్మన్/ వైస్-చైర్ పర్సన్స్
25. కౌన్సిలర్లు
26. ఎంపీపీలు
27. వైస్-ఎంపీపీలు
28. ఎంపీటీసీలు
29. సర్పంచ్ లు
30. పంచాయతీ వార్డు మెంబర్లు
31. ఏఎమ్ సీ ఛైర్మన్లు/ ఛైర్ పర్సన్స్/ డైరెక్టర్స్
32. పీఏసీఎస్ ఛైర్మన్లు/ఛైర్ పర్సన్స్/ డైరెక్టర్స్
33. డీసీసీబీ డైరెక్టర్స్
34. డీసీఎమ్ఎస్ డైరెక్టర్స్
35. ట్రస్టీస్
36. బీసీ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు
37. బీసీ కమిటీల మాజీ సభ్యులు (స్టేట్ లెవల్ టూ మండల్ లెవల్)