అట్టహాసంగా సిటీ కేబుల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు

సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతి సందర్భంగా సిటీ కేబుల్ ఆధ్వర్యంలో విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాల లో క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైయ్యాయి. మూడు రోజులపాటు జరిగే క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు లాంఛనంగా ప్రారంభించారు.

విజయవాడ ఆంధ్రా లయోల కళాశాల క్రీడా మైదానం సిటికేబుల్ క్రికెట్ టోర్నమెంట్ పోటిల సంబరాలకు వేదికైంది. సిటికేబుల్ వ్యవస్ధాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా ఏర్పాటుcity1 చేసిన డిగ్ర కళాశాల విద్యార్ధుల క్రికెట్ టోర్నమెంట్ పోటిలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్్ ఎస్ ఢిల్లీరావు లాంఛనంగా ప్రారంభించారు.టోర్నమెంట్ లో పాల్గొన్న వివిధ కళాశాలల జట్లను పరిచయం చేసుకొని క్రీడల్లో బాగా రాణించాలని వారిని ప్రోత్సహించారు.

అంతకుముందు లయోల కళాశాలకు చేరుకున్న కలెక్టర్ ఢిల్లీరావు సిటీ కేబుల్ ఎండి పొట్లూరి సాయిబాబు పలువురితో కలిసి స్వర్గీయ పొట్లూరి రామకృష్ణగారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.city2 స్వయంగా బౌలింగ్ చేసి వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్ చేసి భారీ షాట్లు ఆడుతూ అందర్నీ ఉత్సాహ పరిచారు. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడా పోటీలు దోహదపడతాయిని కలెక్టర్ అన్నారు.

విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో టోర్నమెంట్ ఆడాలని సూచించారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ప్రతి యేట స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతి ప్రతి యేట ఘనంగా క్రికెట్ టోర్నమెంట్ పోటిలను నిర్వహిస్తున్నామని ఈ ఏడాది క్రీడల్లో విద్యార్ధులను ప్రోత్సాహించాలని తొలి ప్రయత్నంగా డిగ్రీ కళాశాల విద్యార్ధులకు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశామని సిటికేబుల్ ఎండి సాయిబాబు తెలిపారు.టోర్నమెంట్ మొదటి మ్యాచ్ గవర్నమెంట్ ఐటిఐ , గౌతమ్ డిగ్రీ కళాశాలల మధ్య ప్రారంభమైంది.

Leave a Reply