-తారుమారు చేద్దామనుకున్న సాక్ష్యాలను బయటపెట్టినందుకే “వకీల్ సాబ్” పై కేసు
-డిసిపి డేవిడ్.. సిపి cv ఆనంద్ స్టేట్ మెంట్ లలో వ్యత్యాసం గమనించండి
-రఘునందన్ పోరాటంతోనే ఎఫ్ఐఆర్ లో ఎమ్మెల్యే కొడుకు పేరు
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవి ఆనంద్ 7వ తేదీన చెప్పిన మాట… 4వ తేదీనే ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు. అయితే అంతకుముందు 4వ తేదీన డి సి పి డేవిడ్ జోయల్ మాట్లాడుతూ “అమ్నేషియా రేప్ ఘటనలో నలుగురు మాత్రమే ఉన్నారు.. అందులో ముగ్గురిని అరెస్ట్ చేశాము. ఇంకొకరిని మాత్రమే పట్టుకోవాల్సి ఉంది” అని ప్రెస్ మీట్ లో మాట్లాడారు. అంటే వాస్తవానికి అధికార పార్టీ టిఆర్ఎస్ మిత్రపక్షమైన మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే కుమారుడి పేరును తీసివేయడానికి పోలీసు యంత్రాంగం శతవిధాలా ప్రయత్నం చేసిన మాట వాస్తవమే. నిందితులను కాపాడే క్రమంలో మజ్లిస్ పార్టీ ఒత్తిడికి పోలీసులు తలొగ్గడంతో నిందితుల ఆధారాలను రఘునందన్ రావు బయటపెట్టారు. దాంతోనే నాలుగు రోజులపాటు పత్రికలు.. ఛానల్స్.. సోషల్ మీడియాలో కథనాలు ప్రసారం చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి ఎమ్మెల్యే కుమారుడిని అమ్నేషియా ఘటనలో చేర్చిన విషయం ప్రపంచానికి తెలిసిందే.
అయితే అత్యాచారానికి గురైన బాలిక పేరు చెప్పారని.. అసలు ఆ వీడియోలు ఏ విధంగా వచ్చాయని రఘునందన్ రావును భయ పెట్టే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మరి ఘటనలో రఘునందన్ రావు చొరవ తీసుకుని, ఆధారాలు బయటపెట్టక పోయినట్లయితే .. అత్యాచారం చేసిన నిందితులు నీళ్లు తాగినంత సులభంగా తప్పించుకునే వారు. పోలీసులు తప్పించే వారు.!
తమ తప్పులు బయటపడతాయని, తాము దాచిన నేరస్తుల వివరాలు వెలుగుచూశాయి కదా అనే ఒకేఒక అక్కసుతో రఘునందన్ రావు పై రాజకీయ దురుద్దేశంతో కేసు నమోదు చేశారు అనే విషయం ప్రపంచానికి తెలిసిపోయింది. “బాధితురాలి వివరాలు తాను చెప్పలేదని.. చెప్పినట్లు ఆధారాలు చూపిస్తే ఎంతటి చర్యకైనా సిద్ధం ” అని రఘునందన్ రావు చెబుతున్న కూడా పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో సంచలనం సృష్టించిన “దిశ” ఘటనలో ఐపీఎస్ అధికారులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలియజేసినా ఎటువంటి తప్పు లేదు.. అదేవిధంగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిశ కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం పోలీసులకు తెలియదా..? తెలిస్తే మరి 228-A కింద ఎందుకు కేసు నమోదు చేయలేదు, పోలీసులే చెప్పాలి. అధికారం చేతిలో ఉంది.. పోలీసు యంత్రాంగం మనది అయినప్పుడు ఏం చేసినాచెల్లుతుంది అనే ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిది. చట్టం విషయంలో అందరినీ సమానంగా చూడడం పోలీసు యంత్రాంగం నేర్చుకోవాల్సిన ప్రథమ కర్తవ్యం.
ఇంకా నయం రఘునందన్ రావు పై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు… జాతీయ మహిళా కమిషన్ పై కేసు నమోదు చేయలేదు.
ఎందుకంటే.. “తెలంగాణ రాష్ట్రం..ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మైనర్ బాలికలపై అత్యాచార పరంపర కొనసాగుతోందని.. వారం రోజుల వ్యవధిలోనే భాగ్యనగర్ లో అయిదు సంఘటనలు చోటుచేసుకోవడం దారుణం” అని ఢిల్లీలో ఉన్న జాతీయ మహిళా కమిషన్ తెలంగాణ డీజీపీ ని వివరణ కోరడం జరిగింది. ఈ ఘటనపై మమ్మల్నే ప్రశ్నిస్తారా..? అంటూ జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మపై కేసు నమోదు చేయలేదు సంతోషించాల్సిన అంశం.!!
అమ్నేశియ ఘటనలో ఎటువంటి విచారణ లేకుండానే నాలుగో తేదీ సాయంత్రం డిసిపి జో యల్ డేవిడ్ నిందితుల పేర్లను వెల్లడించడం చూస్తుంటే దొంగలను కాపాడడానికి పోలీసులు చేసిన ప్రయత్నం ఇంతా అంతా కాదు అని ప్రతి పౌరుడికి తేటతెల్లమైంది. అసలు రఘునందన్ చేసిన తప్పేంటి..? పోలీసులు చేయలేని పని అయన చేశారు కాబట్టే.. ఈరోజు దోషులు చట్టం నుంచి తప్పించుకోలేక పోయారు. లేదంటే రాజకీయ పెద్దల పిల్లలను కాపాడేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం వల్ల బాధితులకు అన్యాయం జరిగేది. ఏది ఏమైనా “వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు.. ఒక నిర్దోషికి శిక్ష పడవద్దు’ అనేది న్యాయవ్యవస్థలో ప్రధానాంశం. కానీ దోషులు అందరిని తప్పించి బాధితురాలికి శిక్ష పడేలా తెలంగాణ రాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరు సరైనది కాదు. రఘునందన్ రావు న్యాయం కోసం.. ధర్మం కోసం చేసే ప్రతి పోరాటంలో మేమంతా వారి వెంట ఉంటాం. రజాకార్లను తలపించే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రతి పౌరుడు ఖండించాల్సిందే. ఒక పోలీస్ స్టేషన్ ను సందర్శించే లేని స్థితిలో.. కనీసం ఒక కానిస్టేబుల్ ను ట్రాన్స్ఫర్ చేయలేని పరిస్థితిలో.. అన్నిటికంటే ముఖ్యంగా ప్రగతి భవన్ లోకి వెళ్లేందుకు కానిస్టేబుల్స్ హోంమంత్రి అడ్డగించే స్థాయిలో మన రాష్ట్ర హోంమంత్రికి “పవర్” ఉండటం విశేషం.
తప్పు చేసిన పెద్దలను కాపాడేందుకు రాష్ట్రప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్టులు చదవడంలో పోలీసులు రక్తి కట్టిస్తున్నారు. అక్కడ జరిగింది ఒకటైతే..ఇక్కడ చెబుతున్నది మరొకటి. గ్యాంగ్ రేప్ కథనం అట్టర్ ఫ్లాప్ అయి తమ ప్రతిష్ట మసకబారే విధంగా పోలీసులు వ్యవహరించడం ఆ వ్యవస్థకే మచ్చ. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య విషయంలో కూడా ఇదే హడావిడి చేసి అప్రతిష్ఠ మూట కట్టుకున్న విషయం తెలిసిందే. తమ కర్తవ్యాన్ని విస్మరించి ప్రభుత్వానికి జీహుజూర్ అనడం తమ స్థాయిని దిగజర్చుకోడమేనని ప్రజలు చర్చించుకోవడం గమనార్హం. 15 నిమిషాల్లో హిందువులను చంపేస్తా అని నిండు సభలో హెచ్చరించిన ఎంఐఎం నేత అక్బరద్దీన్ ఓవైసీ కేసు మూసేశారు. ఎమ్మెల్యే షకీల్ కొడుకు భాగ్యనగర్ లోని బంజారాహిల్స్ లో కార్ యాక్సిడెంట్ చేసి అమాయకుల ప్రాణాలు బలిగొన్న కేసు పక్కదోవ పట్టించారు. బైంసా అల్లర్లను నీరుగార్చారు. పాతబస్తీలో పోలీసుల పై దాడిని మరుగున వేశారు. బిల్లులు అడిగిన విద్యుత్ సిబ్బంది పై దాడిని అసలే పట్టించుకోలేదు.
ఇప్పుడు కూడా రఘునందన్ రావు స్పందించకపోతే ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకును అమ్నేశియ కేసులో తప్పించే వారు. మొత్తానికి రజాకార్ మద్దతుదారుల సంతుష్టీకరణ కార్యక్రమం రాష్ట్రంలో చురుగ్గా సాగుతోందని చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు చాలు.
భవదీయ
పగుడాకుల బాలస్వామి
రాష్ట్ర ప్రచార సహ ప్రముక్
(రాష్ట్ర అధికార ప్రతినిధి)
విశ్వహిందూ పరిషత్ (V H P)
తెలంగాణ రాష్ట్రం
9912975753
9182674010