మూడేళ్ల వైసీపీ పాలనలో కనీసం ముగ్గురికైనా ఎస్సీ కార్పొరేషన్ రుణాలిచ్చారా?

-జగన్ రెడ్డి తన ప్రచార ఆర్భాటాలకు ఖర్చు పెట్టినన్ని డబ్బులు కూడా దళితుల కోసం ఖర్చు చేయలేదు
-కార్పొరేషన్ బుణాలపై శ్వేతపత్రం విడుదల చేసే ధమ్ము, దైర్యం జగన్ రెడ్డికి ఉందా?
-టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్ రాజు

ఎన్నికలకు ముందు దళితులకు మేనమాscలా ఉంటానన్న జగన్ అధికారంలోకి వచ్చాక దొంగ మామలా తయారయ్యారు. జగన్ దళితులకు చేసిన న్యాయం కంటే అన్యాయమే ఎక్కువ. జగన్ రెడ్డి మూడేళ్లల్లో తన ప్రభుత్వ ప్రచార ఆర్భాటాలకు ఖర్చు పెట్టినన్ని డబ్బులు కూడా దళితులకు ఖర్చు చేయలేదు. మూడేళ్ల వైసీపీ పాలనలో కనీసం ఒక్కరికైనా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు గానీ స్వయం ఉపాధి యూనిట్లు గాని ఇవ్వలేదు. వై.ఎస్.ఆర్ యంత్రసేవా కార్యక్రమంలో సందర్భంగా మాదిగ కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని అడిగిన యువకుడికి ప్రశ్నకు జగన్ చెప్పిన సమాధానం చూస్తుంటే ఎస్సీ కార్పొరేషన్ అంటే జగన్ కు కనీస అవగాహన లేదని అర్ధమౌతోంది.

టిడిపి హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా….. భూమిలేని ఎస్సీలకు రూ.135 కోట్లు ఖర్చుపెట్టి 3,000 ఎకరాల భూములు కొని అందజేశాం. రైతులకు ట్రాక్టర్లు, నిరుద్యోగ ఎస్సీ యువతకు పవర్ ఆటోలు, జేసీబీలు, ప్రొక్లైన్లు ఇచ్చాం. డ్రైవింగ్ లైసెన్సు ఉన్నవారికి ఇన్నోవా, ఇటియోస్ కార్లు ఇచ్చాం. కులాంతర వివాహాలు చేసుకున్న 1888 మందికి రూ.75 వేలు చొప్పున ఆర్ధిక సాయం చేశాం.

మూడేళ్లల్లో దళితులకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేసే ధమ్ము, దైర్యం ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఉందా? ఎన్టీఆర్ విదేశీవిద్య, అంబేద్కర్ ఓవర్సీస్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వంటి పథకాలు రద్దు చేసి దళితుల విద్యార్థులు భవిష్యత్తు గండి కొట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఋణాలు కూడా రద్దు చేశారు. వేలాది ఎకరాల దళితుల అసైన్డ్ భూములు లాక్కున్నారు . వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ రాష్ట్రంలో దళితులపై దాడి జరిగని రోజు లేదు. దళితులకు అన్ని విధాలా అన్యాయం చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారు.