రంగనాయకమ్మ గారు 20-10-2021 నాడు కులగణనను సమర్థించే వారిని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రజ్యోతి లో రాసిన వ్యాసం ఆమే స్థాయిని దిగజార్చేలా వుంది.
కుల గణన కాదు ఆర్థిక (వర్గ) గణన కావాలని రాసిందాంట్లో హేతుబద్దతగాని, లోతైన పరిశీలన గాని లేదు.
భారతీయ సమాజ ప్రత్యేక లక్షణాలు గుర్తించడం లేదు. భారతీయ సమాజంలో కులం కేవలం ఉపరితలం అని అమాయకత్వం తో మాట్లాడుతుంది.
కులం పునాది లోనే కొనసాగుతుందనేది అనేక మంది మార్కిస్టు మేధావులు చెప్పింది ఆమె పరిగణలోకి తీసుకోవడం లేదు.వర్గ పోరాటం అంటే కేవలం ఆర్థిక రంగంలో పోరాటం లాగే భావిస్తుంది.
వర్గ పోరాటం అంటే ఆర్థిక రంగంలో పోరాటం తో పాటు రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సైద్ధాంతిక తదితరనేక రంగాలలో పోరాటం జరుగుతుందని గుర్తించ నిరాకరిస్తుంది.
బిజెపి సామాజిక, సాంస్కృతిక వైరుధ్యాల నాసరాచేసుకొని తమ ఆర్థిక దోపిడి ని కొనసాగిస్తున్నది. వారి వ్యూహాన్ని చేధించాలంటే సామాజిక వర్గపోరాటం ముందుకు తేవాలి. అందుకు కుల గణన ఒక మంచి ఆయుధమవుద్ది.ప్రస్తుత భారత రాజకీయాల్లో బిజెపి మతాల పేరిట చీలిక తెస్తుంది. మెజారిటీ మతస్తులకు తాము ప్రతినిధులమని చెప్పుకొని రాజకీయ లబ్ది పొందుతుంది.
ఒక వేళ బీసి కులగణన జరిగితే మెజారిటి మతంలో వున్న కులాలు తమ వాటా ను ,కొన్ని అగ్రకులాలే కాజేస్తున్నాయనే విషయాన్ని తెలుసుకుంటాయి.తామున్న మతంలోని ఆధిపత్య కులాలే తమను మోసం చేస్తున్నారని తెలుస్తోంది.
దానితో తామున్న మతంలోని ఆధిపత్య కులాల వలననే తాము నష్టపోతున్నామని బీసీలకు అర్థమయి ఎదురు తిరుగుతారు.
అప్పుడు సంఘ్పరివార్ శక్తులబూటకపు మాటల ను బీసీలు నమ్మలేని పరిస్థితి వస్తుంది.
దానిద్వారా ,మతన్నాసరా చేసుకొని రాజకీయంగా లబ్దిపొందే ఆధిపత్య కుల సంపన్నవర్గాలు తమ అవకాశం కోల్పోటమే కాకుండా, భవిష్యత్‌లో కోలుకోలేని దెబ్బతగులుతుందని వారికర్థమయే బీసి కుల గణన వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
కుల గణనవలన తరతరాలుగా అణచి వేయబడిన కులాలకు ప్రయోజన మవుద్దనే ఆధిపత్య కులాలు ఇంత కాలం అడ్డుపడుతూ వస్తున్నారు.
భారతీయ సమాజంలో ప్రతి మనిషికి ఏమున్నా లేకున్నా కులం మాత్రం గ్యారెంటీ. వర్గ స్వభావం తో పాటు కుల స్వభావం వుండటం సహజం.
రంగనాయకమ్మ గారు దీనికి అతీతంగా లేనందుకు చింతిస్తున్నాను.
జి .రాములు,
9490098006