– నోటిఫికేషన్ మీరు ఇస్తే మేము ఏమైనా కోర్టుకు పోయామా ?
– శాసన మండలిలో ఉద్యోగ నియామకాల పై ఎమ్మెల్సీ తాత మధుసుధన్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
హైదరాబాద్: 10 సంవత్సరాలు పరిపాలించారు. మేము 14 సంవత్సరాల క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ ల గురించి చెప్తున్నారు. నోటిఫికేషన్..రిక్యూట్మెంట్ ప్రసెస్ లు కావాలనే కోర్టుకు వెళ్లి ఆపేల చేసింది ఎవరు? నోటిఫికేషన్ లు వేసి పేపర్ లీక్ లు చేసి మళ్ళీ కోర్టు కేసులకు పోతే లాభం ఏముంది? మీకు ఉద్యోగాలు నింపాలి అని తెలంగాణ ఉద్యమంలో అదే ప్రధాన డిమాండ్ అంటే ఎందుకు చేయలేదు?
ఉద్యోగాలు పోతే ఆరు నెలల్లో రాజకీయ ఉద్యోగాలు పొందారు. ఉద్యోగ నియామకాల పై ఎందుకు శ్రద్ధ పెట్టలేదు? 10 ఏళ్లలో ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ అయినా పడిందా? 10 సంవత్సరాల్లో ఒకే ఒక్క డీఎస్సీ మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. వైస్ ఛాన్సలర్ లను ఎందుకు నియమించలేదు? 10 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ మొత్తం నిర్వీర్యం చేశారు. 2 లక్షల 32 వేల ఖాళీలు ఉన్నాయని చెప్పి 10 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు నియమించారు?
ప్రాసెస్ ఉంచి నోటిఫికేషన్ లు, కోర్టుల్లో ఎన్ని లిటిగేషన్ లో ఉన్నవి. అన్నిటినీ మేము సాల్వ్ చేశాం. కుటుంబాలతో సమేతంగా పిలిచి నియామక పత్రలు ఇచ్చాం. ఉద్యోగాలు ఇస్తుంటేము వద్దన్నమా? మీరు ఉద్యోగాలు ఇస్తుంటే జెఏసి చైర్మన్ కోదండరాం అడ్డంపద్దారా? ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే తలుపులు పగుల గొట్టి అరెస్టులు చేశారు.
తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం లో ఉద్యోగ నియామకాలు చేపట్టాం. నోటిఫికేషన్ లు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్టేనా? నియామకాలు చేపట్టినప్పుడా? నోటిఫికేషన్ మీరు ఇస్తే మేము ఏమైనా కోర్టుకు పోయామా ? ఇష్యూస్ క్రియేట్ చేస్తే మేము సాల్వ్ చేసి ఉద్యోగాలు ఇచ్చాం.