– తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం
– సీఎంతో వాట్సాప్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్, సివిక్ -ఎంగేజ్‌మెంట్స్ ప్రాంతీయ అధికారుల భేటీ
-భేటీలో పాల్గొన్న ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండీ
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వాట్సాప్ ప్రతినిధులు భేటీ అయ్యారు. వాట్సాప్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ శివనాథ్ థుక్రాల్, సివిక్ ఎంగేజ్‌మెంట్స్ ప్రాంతీయ అధికారి నిఖిల్ ఆప్టేలు సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారిద్దరూ సీఎం జగన్‌ను కలిశారు. ఈ భేటీలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా కొనసాగుతున్న చిన్న వాసుదేవరెడ్డి కూడా పాల్గొన్నారు.