చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టకలేకపోయాడు

– ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

ఉంగుటూరు: కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు సీఎం జగన్మోహన రెడ్డిని అభినందించాలి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ పేరు పెట్టకలేకపోయాడు. జిల్లాకు పేరు పెట్టిన జగన్మోహన్ రెడ్డిని కనీసం అభినందించటంలేదు. చంద్రబాబు

నాయుడు నుంచి ఈనాడు నాలాంటి ఎంతో మంది నాయకులు పదవులు అనుభవిస్తున్నారంటే అన్న ఎన్టీఆర్ పెట్టిన భిక్షే. గతంలో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ పేరు పెడతానంటే అమాట చంద్రబాబు నాయుడుకు చెబుతే ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆ వాస్తవాలు బయట నేను మాట్లాడితే రాజకీయంగా మాట్లాడారు అనుకుంటారు.

నిమ్మకూరు ఎన్టీఆర్ స్వగ్రామం కావటంతో అ గ్రామం మచిలీపట్నంకి దగ్గరగా ఉండటంతో మచిలీపట్నం ఎన్టీఆర్ పేరు పెట్టాలని కొందరు , విజయవాడ జిల్లా వంగవీటి మోహన జిల్లా పేరు పెట్టాలని మరికొందరు నన్ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం , సీఎం జగన్మోహన్ రెడ్డి తగు రీతిలో ఆలోచించి అందరికి అమోదంగా ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎన్టీఆర్ , వైయస్సార్ రాజకీయ శత్రువులవే తప్ప వారు మంచి మిత్రులు.ఇద్దరు రాష్ట్రంతో పాటు కృష్ణాజిల్లా అభివృద్ధి కోసం ఎంతో పాటు పడ్డారని ఎమ్మెల్యే వంశీ మోహన్ అన్నారు

Leave a Reply