కమ్యూనిస్టు పార్టీల చరిత్ర భారత్ కు వ్యతిరేకంగా రెండవ ప్రపంచ యుద్ధంలో విదేశీ పాలకులు అనుకూలంగా నిలవడం, 1962 యుద్ధంలో చైనాకు మద్దతు ఇవ్వడం, భారత్ ను వ్యతిరేకించడం.
ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీని సమర్థించడం, కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపురలలో వందలాది మందిని హతమార్చడం వంటి చర్యలు కమ్యూనిస్టు పార్టీలవి. ఎప్పుడూ ప్రజాస్వామ్య వ్యతిరేక మనస్తత్వంతో దేశ అభివృద్ధి నిరోధక ఆలోచనతో పని చేస్తాయి. ఈ చారిత్రక సత్యాలను తిరగరాయడం కమ్యూనిస్టులకు సాధ్యం కాదు.
మరోవైపు, 1925లో స్థాపితమైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్ ) కోట్ల మంది స్వయం సేవకులు కలిగి దేశంలో ఏ విపత్తు సంభవించినా ముందు ఉండి నిస్వార్థంగా పని చేసింది, చేస్తూనే ఉంది. ఆరెస్సెస్ ప్రేరణతో అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన నాయకులను తయారు చేసిన సంస్థగా దేశం ముందు ఒక గొప్ప చరిత్రతో సాక్షంగా నిలిచింది.
అదే సమయంలో 1925లో స్థాపితమైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) నేడు చెప్పడానికి ఏదైనా చరిత్ర ఉందా? నేడు ప్రజాదరణ కోల్పోయి 50 పార్టీలుగా చీలిపోయి నేడు వారి ఉనికిని కోసం పాటుపడుతున్న సంస్థలుగా మిగిలిపోయాయి. కమ్యూనిస్టు నాయకులు సీపీఐ నారాయణ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తమ పార్టీ వైఫల్యాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకు ప్రజలు ఈ దేశంలో మిమ్మల్ని తిరస్కరించారు ఆలోచించండి.
కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టు పార్టీలు, ఆరెస్సెస్ ని విమర్శించే నైతిక హక్కు లేవు. ఎందుకంటే ఆరెస్సెస్ దేశ సేవ, నాయకత్వ నిర్మాణంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రధాని ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సందర్భంలో ఆరెస్సెస్ సంఘం శుభాకాంక్షలు తెలియజేయడం గొప్ప విషయం, అభినందనీయం. ప్రధాని అభినందనలు తెలిపిన సంస్థ ఆయన ప్రేరణ పొందిన ఒక జాతీయ వాద సంస్థ. చారిత్రాత్మక సత్యాన్ని దేశానికి ఒక గొప్ప సంస్థను నేడు ఆ వేదికపై మాట్లాడం ఏ మాత్రం తప్పులేదు!
– ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి
(బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్)