– బన్సీలాల్ పేట లోని జబ్బార్ కాంప్లెక్స్ నుండి ఆటో డ్రైవింగ్ చేసి డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: ఎన్నికల ముందు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల ను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఏడాదికి 12 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లు అయింది 24 వేలు వెంటనే ఇవ్వాలి. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం లక్ష ఆటోలతో ఆందోళన చేపడతాం. ఆటో డ్రైవర్లు తలచుకుంటే ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తారు. ఆటో డ్రైవర్ల కుటుంబాల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుంది.