Suryaa.co.in

Andhra Pradesh

ఎవరు డమ్మీ అయ్యారు?

– వైసీపీ నేతలకు విప్, ఎమ్మెల్యే సౌమ్య సూటి ప్రశ్న

నందిగామ: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, మంత్రులు నారా లోకేష్, నారాయణ నిర్ణయమే మా అందరి నిర్ణయం… అధిష్ఠానం, అందరి ఆమోదంతోనే మండవ కృష్ణకుమారి మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నిక జరిగిందని విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు.

ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ ఎన్నికకు సహకరించిన కౌన్సిలర్లకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘డమ్మీ’ అంటూ.. కొన్ని కోయిలలు ముందే కుశాయి.. ఈ రోజు ఎవరు డమ్మీ అయ్యారు? ఈ రోజు ఏం సమాధానం చెప్తారు? నోటికి ఏది వస్తే అది మాట్లాడటం కాదు.. వైసీపీ బోర్డును పక్కకు నెట్టి.. 15 మంది కౌన్సిలర్ల బలంతో నందిగామ మున్సిపాలిటీ పై కూటమి జెండా ఎగురవేశామని ఆమె తెలిపారు. ఇంకా, ఆమె ఏమన్నారంటే..

గతంలో వైసీపీ కౌన్సిలర్లు ఆ పార్టీని వీడి దూరంగా వెళ్లి ఆ తర్వాత మీపై ఏం మాట్లాడారో రాష్ట్రం అంతా చూసింది.. కానీ గత రెండు రోజులుగా మా కౌన్సిలర్లు నేను వేసే ప్రతి అడుగులోనూ మద్దతుగా ఉంటూ కలిసి ముందుకు సాగారు… గత ఐదేళ్లు కమిషన్ల కక్కుర్తి తో నందిగామ మున్సిపాలిటీని వైసీపీ భ్రష్టు పట్టించింది.. రాబోయే కాలంలో కూటమి నేతృత్వంలో నందిగామ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం.

మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి మాట్లాడుతూ అధిష్ఠానం, ఎమ్మెల్యే సౌమ్యకి ధన్యవాదాలు… నాకు సహకరించిన నా తోటి కౌన్సిలర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నందిగామ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE