ఏ ఒక్క ఆరోపణ ఋజువు కాక పోయినా, చంద్రబాబు ఈ దుస్థితి కి ఎవరు బాధ్యత వహిస్తారు?
5 సం॥లు శోధించినా ఒక్క ఆధారమూ లేదు. అయినా జైలు లో ఉంచండి అంటున్న పోలీసులా?
ఆయన దోషి అని నిరూపించే ఆధారాలు లేవు అని పోలీసు రాత పూర్వకం గా చెప్పినా రిమాండ్ విధించి, పొడిగించిన న్యాయ వ్యవస్ధా ?
చట్టం అనేది సామాన్యునికి కూడ అర్ధమయితేనే పాటించటానికి వీలవుతుంది. చట్టం లో సాధారణ మానవునికి కనుపించని నిఝాడ అర్ధాలుంటే చట్టానికి సవరణ చేయాలి. అంతేగాని ఏ కోర్టుకు తోచిన భాష్యం వారు చెప్పుకుంటూ పోతే పార్లమెంట్ చేసిన చట్టానికి విలువేముంది?
దుస్ధితి ఏమిటంటే అత్యున్నత న్యాయస్ధానంలో కూడ, ఒక బెంచి చెప్పిన బాష్యాన్ని ఇంకో బెంచి అంగీకరించటంలేదు. బాబు గారి కేసుకు సంబందించి, ఇదివరకు 3 సభ్యుల బెంచి శోధించి ఒక వివరణ ఇచ్చింది. ఇప్పుడు 2 సభ్యుల బెంచి వారికి సరైనదనిపించే అర్ధం కోసం వెతుకుతోంది. ఈ వెతుకులాట లో నలిగిపోతుా, జుడీషియల్ రిమాండ్ అనేపేరుతో 33 రోజులుగా అనుభవిస్తున్న జైలు శిక్ష కి ఎవరిది బాధ్యత?
ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్ధితి క్షీణించింది. ఎవరిది బాధ్యత. జైలులో ఉంటేగాని విచారించటం కుదరదా? అంటే హింసతో తప్పితే ఋజువులు సేకరించలేని దుస్థితిలో మన విచారణ సంస్థలు ఉన్నాయా? ఒక మనిషి తప్పు ఒప్పుకుంటేనే నేరాన్ని ఋజువు చేయగలరా? ఆధారాలు సేకరించి అరెస్టు చేస్తారా లేక అరెస్టు చేసి ఆధారాలు సేకరిస్తారా? మనం ఏ యుగంలో ఉన్నాం?
రోజూ వైద్య పరీక్ష లు చేస్తున్నా, ఆయన 4 కిలోలు బరువు తగ్గారంటే ఏ రకమైన సహాయం అందిస్తున్నారో అర్ధం అవుతుంది. మరి దీనికి జైలరు బాధ్యత వహిస్తారా? అసలు మన ఖర్మ గాలి ఆయనకు ఏమయినా అయితే, CID వారు, న్యాయవ్యవస్ధ, జైలు అధికారులు, జైలు వైద్యులు – వీరిలో ఎవరు బాధ్యత వహిస్తారు?
– రమాదేవి
విజయవాడ