రాజధాని ఎక్కడ ఉండాలనే అంశంపై విచారణ జరపడంలేదని.. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల చట్టబద్దతపైనే విచారణ జరుపుతున్నామని హైకోర్టు తెలిపింది. రాజధానికి అమరావతి వ్యాజ్యాలపై నాలుగవ రోజు విచారణ జరిపింది.
ప్రతిపక్షం నేతగా జగన్.. అమరావతి నిర్ణయాన్ని స్వాగతించారని రైతుల తరపున వాదనలు వినిపించారు. రాజధాని ఎక్కడ ఉండాలనే అంశంపై విచారణ జరపడంలేదని.. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల చట్టబద్దతపైనే విచారణ జరుపుతున్నామని హైకోర్టు తెలిపింది.రాజధానికి అమరావతికి సంబంధించిన వ్యాజ్యాలపై హైకోర్టులో నాలుగవ రోజు విచారణ జరిపింది. సీనియర్ న్యాయవాదులు ఆదినారాయనరావు, ఉన్నం మురళీదర్.. రైతుల తరపున వాదనలు వినిపించారు.
అమరావతిలో రాజధాని ఏర్పాటు నిర్ణయంపై అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైకాపా వ్యతిరేకించలేదని న్యాయవాది మురళీధర్ వాదించారు. “ప్రతిపక్షం నేతగా ఉన్న జగన్ అమరావతి నిర్ణయాన్ని స్వాగతించారు. దానికి సంబంధించిన వీడీయోలు సైతం అవసరమైతే ప్రదర్శిస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్.. 3 రాజధానుల నిర్ణయాన్ని వెల్లడించారు. భూమి, నీరు, భౌగోళికంగా రాష్ట్రం మధ్యలో ఉండటం, అన్నిటికి అనుకూలమైన ప్రాంతమనే అమరావతిని ఎంపిక చేశారు. శివరామకృష్ణ కమిటీ నివేదికలో కూడా వివిధ రకాల సూచనలు చేశారు. మెజారిటీ ప్రజలు రాజధానిని అమరావతిలోనే ఏర్పాటు చేయాలని కోరారు.” అని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.ఒకసారి ఆమోదించిన మాస్టర్ ప్లాన్ మార్చేందుకు వీలులేదన్నారు.
అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తుంది..
గతంలో అమరావతి రాజధాని నిర్ణయాన్ని ఎవరూ కోర్టులో సవాలు చేయలేదని సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.అన్ని ప్రాంతాల అభివృద్ధి అని చెబుతున్న వారు..ఆ రోజు ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు 3 రాజధానుల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.
చరిత్రలో ఒక్కచోట మాత్రమే రాజధాని ఉందన్నారు. పునర్విభజన చట్టంలో ఒక క్యాపిటల్ అని మాత్రమే ఉందని తెలిపారు. అడ్వకేట్ జనరల్ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును రైతుల తరపు న్యాయవాది ఆదినారాయణ రావు వినిపించారు. సీఆర్‌డీఏ ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తుందన్నారు. ఇప్పుడు పునరాలోచన చేయడం అనేది అభివృద్ది విఘాతమే అవుతుందని తెలిపారు.