Suryaa.co.in

Padayatra News

అమరావతి మహా పాదయాత్ర డైరీ- 18 వ రోజు

బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఈరోజు మహా పాదయాత్రకు విరామం. అయితే, ఈరోజు మహా పాదయాత్ర లో పాల్గొని, రైతులతో కలిసి నడవాలని, నిన్ననే నిర్ణయించుకున్న కార్యక్రమం ప్రకారం… ప్రముఖ సినీ హీరో, గత పదేళ్లుగా, కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు సినిమాలు వదిలేసి, సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా కోసం జరిగిన ఉద్యమాలలో ముందు వరుసలో నిలబడి… ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణ ఏకైక లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడుతున్న… శివాజీ గారు ఈరోజు గుండ్లురు లో రైతుల వద్దకు వచ్చి, దాదాపు రెండు గంటల సేపు వారితో మాట్లాడి, అమరావతి ఉద్యమానికి తన సంఘీభావం ప్రకటిస్తూ… తాను మొదటి నుంచి చెబుతున్నట్టు… జగన్మోహన్ రెడ్డి తన రాజ్యాంగ వ్యతిరేక విధానాల ద్వారా అమరావతి నుండి రాజధానిని అంగుళం కూడా కదిలించలేరని రైతులకు భరోసా ఇవ్వటం… ఈరోజు జరిగిన ప్రధాన కార్యక్రమం.
ఈ కార్యక్రమంలో కందుకూరు మాజీ శాసనసభ్యులు దివి శివరాం గారి దంపతులు, కందుకూరు తెలుగుదేశం యువ నేత ఇంటూరి రాజేష్ గారు, అమరావతి రైతు జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ గారు పాల్గొన్నారు.

కొలికపూడి శ్రీనివాస రావు

LEAVE A RESPONSE