-ముదిరాజ్ లంటే చిన్న చూపు
-ఈటెల భార్య ముదిరాజ్ లను చిన్న కులంగా సంభోదించింది
-ఇది ముది రాజ్ లకు అవమానం కాదా?
– ఒకప్పుడు ఇల్లు సరిగా లేని ఈటెల ఇపుడు వంద కోట్ల ఇల్లు ఎలా కట్టుకున్నారు?
– ఐదెకరాల గడీ ఎలా కట్టుకున్నారు?
– పది పదిహేను కోట్ల రూపాయల కార్లు ఈటెల కు ఎలా వచ్చాయి?
– ఈటెల కోళ్ళ ఫార్మ్ లలో కోళ్లు ఏమైనా బంగారు గుడ్లు పెట్టాయా?
– ఈటెల రాజేందర్ పేరు ను చీటర్ రాజేందర్ గా మార్చేస్తున్నా
ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి
ఈటెల దంపతుల ప్రెస్ మీట్లో అన్నీ అబద్దాలే ..వాటిని ఖండిస్తున్నా.హుజూరాబాద్ లో అమరవీరుల స్థూపాన్ని మునిసిపాలిటీ తీర్మానం మేరకే రోడ్డు విస్తరణ లో భాగంగా కూల్చారు. దాంతో నాకు సంబంధం లేదు. ఆ తీర్మానాన్ని ఎమ్మెల్యేగా ఉన్న ఈటెల కు కూడా పంపారు .ఆయన ఆమోదించారు. పాత అమర వీరుల స్థూపానికి శిలాఫలకమే లేదు .దానిపై ఈటెల పేరు ఉండే ప్రశ్నే ఉత్పన్నం కాదు.
కొత్త అమరవీరుల స్థూపాన్ని బ్రహ్మాడంగా కట్టుకున్నాం .దీనిపై కావాలనే ఈటెల వివాదం రేపుతున్నారు. 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈటెల ను హత్య చేసేందుకు నేను ప్లాన్ చేశానని నిరాధార ఆరోపణలు చేస్తున్నారు .ఇదో పెద్ద జోక్. హుజూరాబాద్ లో హత్యారాజకీయాలు చేసేది ఈటెల రాజేందర్ అని చాలా సార్లు రుజువు అయింది.
ఉద్యమ కారుడు బాలరాజు ను చంపించింది ఈటెల రాజేందర్ కాదా?ప్రవీణ్ కుమార్ ను పోలీసులతో టార్చర్ పెట్టించి గుండెపోటు తో చనిపోవడానికి ఈటెల కారణం కాదా? ఈటెల కు మించి హత్యారాజకీయాలు చేసే వారు ఎవరైనా ఉంటారా పోలీసులను ఎక్కువగా వాడుకుని ప్రత్యర్థులను వేధించే వాడిగా ఈటెల పేరు తెచ్చుకున్నారు.
2018 లో ఈటెల నన్ను చంపించేందుకు కుట్ర చేయలేదా ..ఆయన మనుషులు నా కారు అద్దాలు ద్వంసం చేశారు. ఓడిపోతున్నా అని తెలిసి ఈటెల నన్ను అంతమొందించేందుకు కుట్ర పన్నారనే అనుమానం కలుగుతోంది. నన్ను హత్యచేసే ఉద్దేశం పెట్టుకుని తన హత్యకు కుట్ర పన్నారని ఈటెల బట్ట కాల్చి మీద వేస్తున్నారు.
ఈటెల భార్య ముదిరాజ్ లను చిన్న కులంగా సంభోదించింది ..ఇది ముది రాజ్ లకు అవమానం కాదా? ఎంత చిన్న చూపు ఉంటే మాత్రం చిన్న కులం అనే పదం వాడుతుంది .తక్షణమే క్షమాపణ చెప్పాలి. ముదిరాజ్ లంటే చిన్న చూపు కనుకే ఈటెల భార్య తన కోడలిగా ,అల్లుడిగా ముదిరాజ్ లను తెచ్చుకోలేదు.
ఈటెల ను ఓడించేందుకే నేను రాజకీయాలకు వచ్చా ..ఓడించేదాకా విశ్రమించను. నా మీద వచ్చిన ఆరోపణల పై హుజూరా బాద్ లో బహిరంగ చర్చకు సిద్ధం ..ఈటెల సిద్ధమా? ఒకప్పుడు ఇల్లు సరిగా లేని ఈటెల ఇపుడు వంద కోట్ల ఇల్లు ఎలా కట్టుకున్నారు? ఐదెకరాల గడీ ఎలా కట్టుకున్నారు? పది పదిహేను కోట్ల రూపాయల కార్లు ఈటెల కు ఎలా వచ్చాయి? ఈటెల కోళ్ళ ఫార్మ్ లలో కోళ్లు ఏమైనా బంగారు గుడ్లు పెట్టాయా? దళితుల ,బీసీ ల గిరిజనుల భూములు లాక్కున్నది ఈటెల కాదా?
నేను ఈటెల రాజేందర్ పేరు ను చీటర్ రాజేందర్ గా మార్చేస్తున్నా ..అదే పేరు తో పిలుస్తా. బీసీ లను చిన్న కులాలు గా సంభోదించిన ఈటెల కుటుంబం గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెనుకబడిన వర్గాలు ఆలోచించాలి. హుజూరాబాద్ లోని 106 గ్రామ పంచాయతీలు ,రెండు మున్సిపాలిటీ ల్లో ముదిరాజ్ లకు ఈటెల చేసింది ఏమీ లేదు ..నేను ముదిరాజ్ ల గుళ్ళ కు ఆర్థిక సాయం చేస్తున్నా.
ఈ సారి ఈటెల ఓడిపోవడం ఖాయం అని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈటెల ఓడిపోతున్నా అని తెలిసి ఆగం ఆగం అవుతున్నాడు. అన్నీ పార్టీల నేతలతో చీటర్ రాజేంద్ర సంప్రదింపులు జరుపుతున్నారు ..ఇదే ఆయన ఓడిపోతున్నారనడానికి నిదర్శనం.