– ఏపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ధదాస్
ఉదయం 11 గంటలకు ఏపీకి ఊపిరి పోసే నిర్ణయం కేంద్రం తీసుకుంది.
ఏపీ ప్రజలు ఎగిరి గంతేశారు. కేంద్ర హోంశాఖ అజెండాలో 8వ పాయింట్‌గా…
ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోం శాఖ చేర్చింది. 17వ తేదీన చర్చలకు అంతా సిద్ధం చేసింది.
11, 12, 1, 2, 3,4, 5, 6, సాయంత్రం 7 గంటలు… 8 గంటల్లోనే లేఖలోంచి ప్రత్యేక హోదా మాయమైంది.
సాయంత్రం 7 గంటలకు కేంద్రం నుంచి మరో లేఖ.
ఈ లేఖలో ప్రత్యేక హోదా అనే పదాలు మాయం అయ్యాయి.
ఎందుకు..? ఎలా? ఎవరు చేశారు ఈ పని?
కేంద్ర హోంశాఖనే స్వయంగా .. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టిందా..? లేదా..కేంద్రాన్ని ఎవరైనా చీకటి శక్తులు ప్రభావితం చేశారా..?
ఇలా అయితే..ఏపీని ఆదుకునేది ఎవరు..?
కేంద్రమే సవతి తల్లి ప్రేమ చూపిస్తే…
ఏపీ ప్రజలు ఏం కావాలి..?
మా హక్కును అడగడం కూడా తప్పేనా..?
ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి….
పార్లమెంట్ లో ఇచ్చిన మాటను..
కేంద్రం ఎందుకు నెరవేర్చుకోలేక పోతుంది.
మొన్ననే కదా మోదీ లోక్ సభలో మాట్లాడుతూ..
విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందని మాట్లాడింది..
మోదీగారి స్పీచ్‌ను దేశం మొత్తం చూసింది కదా..?
అయినా..ఏపీ అంటే మీకు సాయం చేయాలని..
ఎందుకు అనిపించడం లేదు..?
ఏపీ ప్రజలు అడుగుతుంది..
కేంద్రం ఇస్తానని చెప్పిన దాన్నే..
మీరు ఇస్తామని మాట ఇచ్చింది కూడా..
ఇవ్వకపోగా.. ఉదయం ఓ లెటర్..సాయంత్రం ఓ లెటర్‌తో ..
ఈ ఆటలేంటీ..?
దయచేసి..
ఏపీకి హోదా ఇవ్వండి..
రాష్ట్రాన్ని బతికించండి.