– ఈడీ ఆఫీసు ముందు మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: తెలంగాణ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింప చేయడానికి తీసుకొచ్చిన ఈ కార్ రేస్ ఈవెంట్ లో ఏదో అవినీతి జరిగిందని ఇంత అల్లకల్లోలం చేయాల్సిన అవసరం ఏముందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. దేశంలో బ్యాంకులకు లక్షల కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన వారిని పట్టుకోకుండా, హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో నిల బెట్టడానికిచేసిన ఈ మంచి కార్యక్రమానికి కేటీఆర్ ని ఈడి విచారించడం కరెక్టేనా? అయినా ఈడీ విచారణలో ముందు ముందు ముందు అన్ని విషయాలు బయటకు వస్తాయని, బ్యాంకు ట్రాన్సాక్షన్ ద్వారానే లావాదేవీలు జరిగినా, ఈ రేస్ డబ్బులను వారి అకౌంట్ల నుండి ఎందుకు ప్రభుత్వం ఇప్పటివరకు రికవరీ చేయట్లేదని ఆయన ప్రశ్నించారు.
మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉందని, చట్టం మీద గౌరవం ఉందని అంతిమంగా న్యాయం గెలుస్తుందని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. బి ఆర్ ఎస్ కార్యకర్తలు ఎవరు కూడా గొడవలు చేయొద్దని, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని బిఆర్ఎస్ కార్యకర్తలకు తెలిపారు.