రాష్ట్రంలో వడ్లు కొనడం చేతకాని ప్రభుత్వం ఎందుకు? ముఖ్యమంత్రి ఎందుకు?

-సీఎం కేసీఆర్ తప్పుడు సంతకం..రైతుల పాలిట మరణ శాసనం!
– వడ్లు కొనేందుకు..ఇంత నిర్లక్ష్యం ఎందుకు కేసీఆర్?
– కొనుగోలు కేంద్రాలలో రైతులు పడిగాపులు పడుతున్న పట్టించుకోరా?
– వడ్లు కొనడం చేతకాని ప్రభుత్వం ఎందుకు..ఈ యంత్రాంగం ఎందుకు?
– వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల

కేంద్ర ప్రభుత్వంతో ఢిల్లీలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని చెప్పి కేసీఆర్ చేసిన తప్పుడు సంతకం రాష్ట్రంలోని రైతుల పాలిట మరణ శాసనం అయ్యిందని వై యస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై యస్ షర్మిల ఆరోపించారు.శనివారం మెదక్ జిల్లా కేంద్రంలోని మెదక్ మార్కెట్ యార్డ్ ను వై యస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై యస్ షర్మిల సందర్శించి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై,మద్దతు ధరపై రైతులతో చర్చించారు.

ధాన్యం కొనుగోలుపై రైతులు షర్మిలతో వారి బాధను చెప్పుకున్నారు.15 రోజుల నుంచి ధాన్యం తో పడిగాపులు కాస్తున్నామని అయినా ఎవ్వరు పట్టించుకోవడం లేదని,ఎప్పుడు కొంటరో తెలియడం లేదని షర్మిల ముందు కర్షకులు వాపోయారు.వర్షానికి తడిచి ధాన్యం చెడిపోతున్నా కాంట పెట్టడం లేదని
అధికారులు ఎవరు ఇక్కడకు రావడం లేదని గోడు వెళ్లబోసుకున్నారు.వైఎస్సార్ హయాంలో వ్యవసాయం పండుగగా ఉండేదని,ఇప్పుడు పెట్టిన పెట్టుబడికి కూడా గిట్టుబాటు కావడం లేదని తెలిపారు. జిల్లా మార్కెటింగ్ అధికారిని కలిసేందుకు వైఎస్ షర్మిల ఛాంబర్ కు వెళ్లగా గత 10 రోజులుగా అధికారి సెలవులో ఉన్నాడని సిబ్బంది చెప్పడంతో

రైతులు మార్కెట్ లో 15 రోజులు గా పడిగాపులు కాస్తుంటే మీరు లీవ్ లో ఉంటారా అంటూ అధికారిపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వై యస్ షర్మిల మాట్లాడుతూ పాదయాత్ర ను సైతం పక్కన పెట్టి ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు బయట పెట్టడానికి మెదక్ జిల్లా కేంద్రానికి వచ్చానని అన్నారు.
కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వడ్లు 20 రోజులుగా వర్షానికి తడిచి..ఎండకు ఎండుతున్నాయని తెలిపారు.

ఇవ్వాళ మేము వస్తున్నాం అని తెలిసి రైతులకు బస్తాలు( సంచులు) ఇచ్చారటన్నారు.మెదక్ మార్కెట్ యార్డులో పనిచేస్తుంది అధికారుల లేక దొంగలా అని ప్రశ్నించారు. ఒక్కడంటే ఒకడు టైపిస్ట్ ఉండటం దారుణంగా ఉందన్నారు. గత 20 రోజులుగా ఇల్లు వాకిలి వదిలేసి రైతులు పడిగాపులు కాస్తున్న ప్రభుత్వం పట్టించుకోక పోవడం విడ్డురంగా ఉందన్నారు.మెదక్ జిల్లాలో ప్రతి కిలోమీటర్ కి ఒక కల్లం ఉందని వాటినిండా వడ్లు ఉన్నాయన్నారు.

వాటిని కొనే నాథుడు లేడు, అడిగే నాథుడే లేడని మండిపడ్డారు. రైతులు పండించిన పంటలకు కొనుగోలు చేసేందుకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు కేసీఆర్..?అని షర్మిల ప్రశ్నించారు. కొంటాం అని చెప్పి నెలరోజులు అయ్యింది,ఎందుకు కొనడం లేదో సీఎం కేసీఆర్ ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి దొంగ హామీలు ఇచ్చిన మాదిరిగా ఇది కూడా అబద్దమేనా అని ఎద్దేవా చేశారు.ఢిల్లీకి పోయి కొండంత రాగం తీశారు కదా..? తర్వాత మెడలు వంచుకొని వచ్చి కొంటాం అని ఎందుకు చెప్పారో సమాధానం ఇయ్యలన్నారు. రాష్ట్రంలో వడ్లు కొనడం చేతకాని ప్రభుత్వం ఎందుకు.. ముఖ్యమంత్రి ఎందుకు..ఈ యంత్రాంగం ఎందుకని విమర్శించారు.

సీఎం చెప్పిన ఒక్క మాట వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు 17 లక్షల ఎకరాలు పొలాలు బీడు గా పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తప్పు చేసింది కేసీఆర్ కాబట్టి..ప్రతి ఎకరాకు 30 వేల నష్టపరిహారం రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.రుణమాఫీ అలాగే ఉందని వడ్డి మీద వడ్డీ పడుతుందన్నారు.

5 వేలు రైతు బందు ఇచ్చి..రైతులు కార్లలో తిరుగుతున్నారని తెరాస నేతలు గొప్పలు చెప్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రైతు ద్రోహిగా చరిత్ర లో మిగిలిపోతరని అన్నారు. మద్దతు ధర ఉన్న పంటకు కూడా మద్దతు ధర ఇవ్వక పోతే ఎలా అని ప్రశ్నించారు.

వరి 35 లక్షల ఎకరాల్లో వేశారు.. కనీసం ఆ వడ్లను అయినా కొనాలని సూచించారు.65 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని లెక్కలు చెప్తున్నారు…ఇప్పటి వరకు ఎన్ని లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారో అధికారిక స్టేట్ మెంట్ విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు.ప్రతి రోజు ఎంత ధాన్యం కొనుగోలు చేస్తున్నారో స్టేట్మెంట్ ఇవ్వాలన్నారు.రైతుల పక్షాన ఏమైనా చిత్త శుద్ది ఉంటే
ప్రతి కళ్ళం లో వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వై యస్ ఆర్ టి పి జిల్లా అధ్యక్షులు వనపర్తి వెంకటేశం,
సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గౌరెడ్డి శ్రీధర్ రెడ్డి,సిద్దిపేట జిల్లా అధ్యక్షులు రామలింగారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, సత్యవతి, సంజీవ్ రావ్,గ్రేటర్ హైదరాబాద్ ఇంచార్జీ వాడుక రాజగోపాల్,ప్రచార కమిటీ అధ్యక్షులు నీలం రమేష్ తో పాటు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply