– ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఎవరి కి మద్దతు ఇస్తుంది?
– బీఆర్ఎస్ కేనా? లేక కాంగ్రెస్‌కేనా?
– 2014లో రెండో స్థానానికి చేరిన ఎంఐఎం పార్టీ, ఇప్పుడు ఎందుకు పక్కకు తప్పుకుంటోంది?
– జూబ్లీహిల్స్‌లో అర్జెంటుగా ఖబర్‌స్థాన్ నిర్మించాలనే ప్రణాళిక కూడా ఈ రాజకీయ ఒప్పందానికి భాగమే
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా తెలంగాణలో కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ క్రీడ ఆడుతున్నాయి. దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఎంఐఎం పార్టీ అక్కడికి వెళ్లి పోటీ చేస్తుంది. ఇదే నవంబర్ 11న బీహార్ లో జరగనున్న ఎన్నికల్లో కూడా ఎంఐఎం పార్టీ 30 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది.
2020లో బీహార్ ఎన్నికల్లో 20 సీట్లలో పోటీ చేసింది. తమిళనాడులో 2021లో 3 సీట్లలో, వెస్ట్ బెంగాల్లో 6 సీట్లలో, ఉత్తరప్రదేశ్‌లో 2022లో 95 సీట్లలో, ఉత్తరాఖండ్‌లో 4 సీట్లలో, రాజస్థాన్‌లో 10 సీట్లలో, మధ్యప్రదేశ్‌లో 4 సీట్లలో, మహారాష్ట్రలో 16 సీట్లలో పోటీ చేసి ఒక సీటు గెలుచుకుంది. జార్ఖండ్‌లో ఒక సీటులో పోటీ చేసింది కానీ గెలవలేదు.
ఇటీవల ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కూడా 2 సీట్లలో పోటీ చేసింది. అంటే దేశమంతా ఎన్నికలు వస్తే ఎంఐఎం పార్టీ ఎక్కడైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మన భాగ్యనగరంలో, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగబోతోంది. ఇక్కడ మాత్రం ఎంఐఎం పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదు? ఇదే ప్రజలు ఆలోచించాల్సిన ప్రశ్న.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం పార్టీ పోటీ చేసి 41,656 ఓట్లు సాధించింది, రెండో స్థానంలో నిలిచింది.
అప్పుడు తెలుగుదేశం పార్టీ 50,898 ఓట్లతో గెలిచింది. కాంగ్రెస్ మూడో స్థానంలో, టీఆర్ఎస్ నాలుగో స్థానంలో నిలిచాయి.
తరువాతి 2018, 2023 ఎన్నికల్లో కూడా ఎంఐఎం పోటీ చేసింది. కానీ ఇప్పుడు, 2024 నవంబరులో జరగబోయే ఈ ఉపఎన్నికలో మాత్రం ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టడం లేదు? దీని వెనక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉంది. ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఎవరి కి మద్దతు ఇస్తుంది? బీఆర్ఎస్ కేనా? లేక కాంగ్రెస్‌కేనా? ఈ ప్రశ్నకు సమాధానం ప్రజలే ఆలోచించాలి.
2014లో రెండో స్థానానికి చేరిన ఎంఐఎం పార్టీ, ఇప్పుడు ఎందుకు పక్కకు తప్పుకుంటోంది? ఎవరితో కుమ్మక్కైంది? ఎవరికి లాభం కలిగేలా ఈ నిర్ణయం తీసుకుంది? డిసెంబరులో జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి మేయర్ పదవి ఇవ్వడమే ఈ మొత్తం ఒప్పందం వెనుక ఉన్న అసలు కారణం.
కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీల మధ్య లోపాధికారిక ఒప్పందం జరిగి, జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం సూచించిన వ్యక్తినే కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టబోతున్నారు అన్నది నగ్న సత్యం. రేపు కాంగ్రెస్ అభ్యర్థి అధికారికంగా ప్రకటించిన తర్వాత, ఆ అభ్యర్థి నిజంగా కాంగ్రెస్‌దా, ఎంఐఎందా అన్నది ప్రజలందరికీ స్పష్టమవుతుంది.
భారతీయ జనతా పార్టీ గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో 48 స్థానాలు గెలిచింది. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో బీజేపీ గెలిస్తే, మేయర్ పదవి కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికే వస్తుందని తెలుసుకుని, కాంగ్రెస్–ఎంఐఎం పార్టీలు భయంతో, రాజకీయ లాభంతో ఒకటయ్యాయి. ఈ కుట్ర వెనక మరో ఉద్దేశ్యం కూడా ఉంది.. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం ఒత్తిడికి లోనై, ఖబరస్తాన్ నిర్మాణాలపై వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది.
జూబ్లీహిల్స్‌లో అర్జెంటుగా ఖబర్‌స్థాన్ నిర్మించాలనే ప్రణాళిక కూడా ఈ రాజకీయ ఒప్పందానికి భాగమే. అందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో జరిగేది సాధారణ ఎన్నిక కాదు – ఇది కాంగ్రెస్–ఎంఐఎం కుమ్మక్కు పాలిటిక్స్‌కు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయ పోరాటం.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంలో ఈ రోజు ఒక ముఖ్యమైన ప్రశ్నను ప్రజల ముందు ఉంచాలనుకుంటున్నాను.
ఎవరిని అపీజ్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రాత్రికి రాత్రే ఖబర్స్తాన్లకు సంబంధించిన జీవోలు తీసుకొస్తుంది?
రాత్రిపూటే కబర్స్తాన్ నిర్మాణాలకు టెండర్లు, పోలీస్ బందోబస్తులు, సీసీటీవీలు ఎందుకు ఏర్పాటు చేస్తోంది?
ఇది ఎవరినో తృప్తిపరచడానికి చేస్తున్న రాజకీయ డ్రామా కాదా? ఇది ప్రజలు ఆలోచించాలి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్లు అత్యంత విద్యావంతులు, విజ్ఞులు — కాబట్టి ఈ రాజకీయ ఆటను మీరు చక్కగా గుర్తించగలరు.
2014లో రెండో స్థానంలో నిలిచిన ఎంఐఎం పార్టీ — ఈసారి ఎందుకు పోటీ చేయడం లేదు?
ఎంఐఎం పార్టీ బీహార్‌లో 30 సీట్లలో, ఉత్తరప్రదేశ్‌లో 95 సీట్లలో, తమిళనాడులో, ఉత్తరాఖండ్‌లో, మహారాష్ట్రలో, జార్ఖండ్‌లో పోటీ చేస్తుంది.
అయితే తన పుట్టిన నగరమైన భాగ్యనగరంలో మాత్రం అభ్యర్థిని ఎందుకు పెట్టడం లేదు? క్యాండిడేట్ లేడా? లేక డీల్ జరిగిందా? ఈ ప్రశ్నలకు సమాధానం కాంగ్రెస్–ఎంఐఎం పార్టీల గుట్టు చెబుతుంది.
2014లో జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం రెండో స్థానంలో వచ్చింది. తర్వాత 2023 ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. అయితే ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గింది? ఎవరికి లాభం చేకూరేలా ఈ నిర్ణయం తీసుకుంది?
జవాబు ఒక్కటే — కాంగ్రెస్ పార్టీతో లోపాధికారిక రాజకీయ ఒప్పందం జరిగింది.
ఇప్పటికే ఎంఐఎంలో పనిచేసిన నాయకులే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులుగా రంగంలోకి వస్తున్నారు. అంటే కాంగ్రెస్–ఎంఐఎం ఒకే తాను ముక్కలు. జూబ్లీహిల్స్‌లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపుని అడ్డుకోవడమే ఈ కుట్ర వెనక అసలు ఉద్దేశ్యం.అదే కాకుండా ఖబర్‌స్తాన్ నిర్మాణాలు, భూముల కేటాయింపులు కూడా ఈ రాజకీయ ఒప్పందంలో భాగమే.
నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశమంతా సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే సిద్ధాంతంతో పనిచేస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఓట్ల కోసమే ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను.. మీ స్వంత నియోజకవర్గంలో స్మశానానికి స్థలం ఇవ్వలేకపోయిన మీరు, ఎందుకు ఆగమేఘాల మీద ఖబర్స్తాన్లకు స్థలం కేటాయిస్తున్నారో ప్రజలకు చెప్పండి. ఎవరికి బానిసలా పనిచేస్తున్నారు?
ఒకప్పుడు బైంసా ఎంఐఎం మేయర్ ఉన్నప్పుడు హిందూ ప్రాంతాలకు రోడ్లు రాలేదు, నీళ్లు రాలేదు, అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు అదే పరిస్థితి భాగ్యనగరానికి రావొచ్చని నేను ప్రజలను అప్రమత్తం చేస్తున్నాను. రేపు పొరపాటున జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తే, ఆ ఓటు వాస్తవానికి ఎంఐఎం అభ్యర్థికే పడుతుందనే విషయం ఓటర్లు గుర్తుంచుకోవాలి.
జూబ్లీహిల్స్ ఓటర్లు మేధావులు, ఐటీ ప్రొఫెషనల్స్, విద్యావంతులు. మీ ఒక్క ఓటు ఈ నగర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాంగ్రెస్–ఎంఐఎం కలిసి ఈ నగరాన్ని ఎటు దారి తిప్పబోతున్నాయో ఒకసారి ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ నగరాన్ని సమానత్వం, అభివృద్ధి, జాతీయత దారిలో నడిపించగలదు. ప్రజలు ఈ కుట్రను గుర్తించి, జూబ్లీహిల్స్‌లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని విజయం సాధించేలా మద్దతు తెలపాలని కోరుతున్నాను.