-ఒక గెలుపు విజయం ఇస్తుంది…ఒక గెలుపు కుంగదీస్తుంది
-తప్పుడు పనులు చేసిన జగన్ కు మొన్నటి ఎన్నికలు గుణపాఠం
-పోలవరం ముంపు బాధితులకు డబ్బులు ఇవ్వలేదు
-మహేంద్ర తనయ ఆఫ్ షోర్ ప్రాజెక్టును జగన్ పూర్తి చెయ్యలేదు
-ఒంటిమిట్ట శ్రీరాముడి పెళ్లికి ముఖ్యమంత్రి ఎందుకు వెళ్లలేదు?
-ప్రజా జీవితానికి జగన్ అనర్హుడు
-క్యాండెట్ ఎవరు అనేది కాదు…జెండా గెలవాలి అని చూడండి
-డిల్లీ మెడలు వంచుతా అని చెప్పిన ముఖ్యమంత్రి డిల్లీ ఎందుకు వెళుతున్నాడు?
-టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
విశాఖలో జరిగిన పార్టీ జోన్ 1 సమావేశంలో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గ ఇంచార్జ్ లు. పార్టీ సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..
• విశాఖ జోన్ సమావేశం సక్సెస్ అయ్యింది. ఉత్సాహంగా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
• ఈ స్పందన చూస్తే అర్థం అవుతుంది…వచ్చే ఎన్నికల్లో గెలిచేది తెలుగు దేశం పార్టీనే
• మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చింది శాంపిల్ గెలుపు మాత్రమే. వచ్చే ఎన్నికల్లో పెద్ద విజయం ఖాయం
• ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం 20 రోజుల ముందు అభ్యర్థిని ప్రకటించినా ప్రజలు మద్దతు పలికి గెలిపించారు.
• ఒక గెలుపు విజయం ఇస్తుంది…ఒక గెలుపు కుంగదీస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు పార్టీకీ జోష్ ను ఇచ్చింది
• వైసీపీ అంటున్నట్లు వై నాట్ 175 కాదు…ఇప్పుడు చెపుతున్నా వై నాట్ పులివెందుల
• ఎప్పుడు కూడా మనిషి అనేవాడు భూమి మీద నడవాలి..కానీ జగన్ ఆకాశంలో నడిచాడు. పరదాల చాటున నడిచాడు. నాకు అడ్డం లేదు అనుకున్నాడు. అడ్డదారులు తొక్కాడు.
• తెలుగు దేశంతో పెట్టుకున్న జగన్ ను చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలుపుతారు.
• పార్టీ ఎమ్మెల్యేలను జగన్ నిన్నటి వరకు హీనంగా చూశాడు..ఇప్పుడు వారికి గౌరవం ఇస్తాను అంటున్నాడు
• మనకు గత ఎన్నికల్లో 23 సీట్లు వస్తే ఇది దేవుడి స్క్రిప్ట్ అని హేళన చేశాడు. అందుకే దేవుడి ఆ స్క్రిప్ట్ తిరగరాశాడు.
• 23వ సంవత్సరం…23 వ తేదీ 23 ఓట్లతో మన ఎమ్మెల్సీ గెలిచారు. ఇదీ దేవుడి స్క్రిప్ట్
• రాజకీయ పార్టీలపై కేసులు పెట్టడం, శుక్రవారం వస్తే ప్రజల ఆస్తుల మీదకు ప్రొక్లైనర్లు పంపడం చేశాడు. తప్పుడు పనులు చేసిన జగన్ కు మొన్నటి ఎన్నికలు గుణపాఠం
• మొన్నటి వరకు 80 మంది ఎమ్మెల్యే లను తీసేస్తాను అన్నాడు…ఇప్పుడు బాబ్బాబు అంటున్నాడు. జగన్ కు వెన్నెముకలో వణుకు పుట్టింది.
• ఎప్పుడు ఎన్నికలు పెట్టినా గెలిచే పార్టీ టీడీపీ అని తెలిసిపోయింది. అందుకే జగన్ లో వణుకు.
• మనల్ని అవహేళన చేసిన వారికి మైండ్ బ్లాక్ అయ్యింది.
• మొన్న జరిగిన ఎన్నికల్లో వచ్చిన తీర్పుకు కూడా జగన్ వక్రభాష్యం చెప్పాడు.
• ఓటమిని ఒప్పుకోని మనస్తత్వం ఉన్న వ్యక్తి జగన్.
• ప్రజలను బటన్ బ్యాచ్ అని జగన్ ప్రజలను అవమానించారు.
• ప్రజల డబ్బులు ప్రజలకు పంచి లబ్దిదారులను బటన్ బ్యాచ్ అని అన్నాడు.
• బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంతో ప్రజల్లో చైతన్యం తెచ్చాం.
• జగన్ ఇక ఏ ఎన్నికల్లో గెలవడు….ప్రజా జీవితానికి జగన్ అనర్హుడు
• తెలుగు దేశం దేశంలో చక్రం తిప్పిన పార్టీ. నాడు దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసిన ఘనత ఉన్న పార్టీ టీడీపీ. ఒక ప్రాంతీయ పార్టీ సాధించిన ఘనత అది
• తెలుగు దేశం పార్టీ లేకుండా చేయడం నీవల్ల కాదు.
• ఒంటిమిట్ట శ్రీరాముడి పెళ్లికి ముఖ్యమంత్రి ఎందుకు వెళ్లలేదు?
• నాకు నచ్చిన నగరం విశాఖ పట్నం. నీతి నిజాయితీ ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర.
• ఇప్పుడు ఆ ఉత్తరాంధ్ర ప్రజలే ఎన్నికల్లో కర్రు కాల్చి జగన్ కు వాత పెట్టారు
• హుద్ హుద్ వచ్చినప్పుడు ఇక్కడే మకాం వేసి సాయం అందేలా చేశా. తిత్లీ వస్తే…ఆ ప్రాంతం కోలుకున్న తరువాతనే అక్కడ నుంచి వెళ్లాను.
• నాలుగేళ్లు అయ్యింది….ఈ జగన్ ఉత్తరాంధ్రకు ఏం చేశాడు చెప్పగలడా?
• ఒక్క పని చేయని జగన్ ను ఉత్తరాంధ్ర ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించాలి
• టీడీపీ గెలిచి ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం పూర్తి అయ్యేయి.
• వంశధార నాగావళి అనుసంధానం పూర్తి అయ్యి ఉంటే ఈ మూడు జిల్లాల్లో నీటి ఎద్దడి లేకుండా ఉండేది.• ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ పై 1600 కోట్లు ఖర్చు పెడితే…ఈ ప్రభుత్వం కనీసం 400 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు
• నాడు తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ ఇప్పుడు దేశంలో పర్ క్యాపిటా ఇన్ కంలో టాప్ లో చేరింది.
• తెలంగాణ అలా ముందుకు వెళుతుంటే…ఎపిలో మాత్రం అప్పుల్లో మునిగిపోయింది.
• జగన్ ప్రభుత్వం ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా నాశనం చేసింది.
• రాష్ట్రానికే తమానికం అయిన గీతం విద్యాసంస్థను కూల్చడానికి జగన్ ప్రొక్లెయిన్ తీసుకుని వెళ్లాడు
• విశాఖలో ఐఐఎం పెట్టాం, ట్రైబల్ యూనివర్సిటీ కేటాయించాం. కానీ ఈ సిఎం రంగులు వేసుకోవడం తప్ప ఏమీ చేయడం లేదు
• మనం నాటిన చెట్లకు రంగులేసుకున్న చీప్ నేతలు వైసీపీ నేతలు
• రిషికొండ కు గుండు కోట్టేశారు ఈ వైసీపీ నేతలు.
• రిషికొండకు మనం వెళతాం అని ప్రభుత్వం భయపడుతుంది. మనం వెళ్లకుండా అడ్డుపడుతుంది. రఘరామ రెడ్డి అనే ఐపిఎస్ అధికారి ఆదేశాలతో అడ్డంకులు సృష్టించారు. వీళ్లు మూల్యం చెల్లిస్తారు.
• నాడు భోగాపురం విమాశ్రయం కోసం 97 శాతం భూ సేకరణ పూర్తి చేశాం. నాలుగేళ్లు అయ్యింది జగన్ ఒక్క ఇటుక వెయ్యలేదు.
• మళ్లీ టీడీపీ వస్తుంది….భోగాపురం పూర్తి చేస్తుంది.
• నాడు విశాఖలో మెడ్ టెక్ జోన్ తీసుకువచ్చాం. ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ కంపెనీ నీ తెస్తే దాన్నీ ఈ ప్రభుత్వం తరిమేసింది.
• విశాఖ ఒక సుందరమైన నగరం. దీన్ని ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్ గా చేయాలని ప్రయత్నం చేశాం.
• విశాఖలో 5 ఏళ్లలో మూడు సార్లు సిఐఐ సదస్సులు పెట్టాం. 16 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నాం.
• వైసీపీ ఈ నాలుగేళ్లలో ఒక్క చిన్న కార్యక్రమం కూడా చేయని చెత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం
• పోలవరం ముంపు బాధితులకు డబ్బులు ఇవ్వలేదు, మహేంద్ర తనయ ఆఫ్ షోర్ ప్రాజెక్టును జగన్ పూర్తి చెయ్యలేదు.
• ఆశోక్ గజపతి రాజు కుటుంబం ప్రజలకు భూములు ఇచ్చారు. మన్సాస్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేశారు. అలాంటి వ్యక్తిని సింహాచలం ట్రస్ట్ చైర్మన్ పోస్టునుంచి దించేశారు. ఆశోక్ గజపతి రాజును అవమానించారు. అవినీతి ఆరోపణలు చేశారు. అనేక అడ్డంకులు సృష్టించారు.
• ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3 ద్వారా స్థానిక గిరుజనులకే ఉద్యోగాలు అనే ఉత్తర్వు ఇప్పుడు పోయింది. దీనిపై వచ్చిన న్యాయపరమైన సమస్యల్లో ప్రభుత్వం పోరాడ లేదు.
• నాడు గిరిజన ప్రాంతాల్లో బైక్ అంబులెన్స్ లు కూడా పెట్టాం. ఇప్పుడు అవన్నీ అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో అడవిలోనే కాన్పులు జరుగుతున్నాయి.
• ఏజెన్సీ ఏరియాలో వివిధ ఆంక్షలలో ప్రభుత్వ పథకాలు గిరిజనులు అందకుండా కొత్త జీవో తీసుకువచ్చారు. 10 ఎకరాల పొలం ఉండకూడదు…..ఆటో ఉంటే కూడా సంక్షేమ పథకం రాదు అనే నిబంధనలతో ఇబ్బందులు పెట్టారు.
• ఏజెన్సీ నుంచి దొంగ దారిన లేటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వి తీసుకువెళుతున్నారు.
• రాష్ట్రంలో మద్య పాన నిషేదం చేస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు
• రాష్ట్రంలో నాణ్యత లేని మద్యం, నెంబర్ 2 మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి
• పేద వర్గాలను జలగల్లా పీలుస్తున్న సిఎం జగన్
• నాడు మద్య పాన నిషేదం చేస్తాను అని ఇప్పుడు జగన్ మాట మార్చాడా లేదా?
• జగన్ ది నోరా…లేక…ఏమనాలి?
• వివేకా హత్య జరిగితే నారాసుర రక్త చరిత్ర అని మనపై ఆరోపణలు చేశాడు
• ఇప్పుడు గూగుల్ టేకవుట్ ద్వారా మొత్తం బండారం బయట పడింది.
• ఇప్పుడు రాష్ట్రంలో ఇసుక దొరుకుతుందా….రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా నడిపిస్తున్నారు.
• జిల్లాకు నెలకు రూ.25 కోట్లు టార్గెట్ పెట్టి ఇసుకపై అవినీతికి పాల్పడుతున్నారు.
• ఒక్క విశాఖపట్నంలోనే రూ. 40 వేల కోట్లు ఆస్తులు వైసీపీ నేతలు రాయించుకున్నారు.
• బెదిరించి, గన్ పెట్టి ప్రజల ఆస్తులు రాయించుకున్నారు.
• కార్తీక వనం ఏమయ్యింది….ప్రేమ సమాజం భూములు ఏమయ్యాయి…దసపల్లా భూములుఏమయ్యి….హైగ్రీవ భూములు ఏమయ్యాయి.
• విశాఖలో రూ. 40 వేల కోట్ల విలువైన భూములు వైసీపీ నేతలు కొట్టేశారు.• రేపు తెలుగు దేశం వచ్చిన తరువాత సిట్ ఏర్పాటు చేసి లాక్కున్న భూములు అన్నీ తిరిగి ఇప్పిస్తాం.
• జగన్ రెడ్డీ నీ బంధువు అనీల్ రెడ్డికి విశాఖలో ఏంపని…ఇక్కడ ఓవ్యక్తికి చెందిన 50 ఎకరాల భూమి కొట్టేశాడు.
• 14 ఏళ్లు సిఎంగా ఉన్నాను నేను…కానీ విశాఖలో చిన్న ఇల్లు కట్టుకోలేదు. విశాఖలో మా హయాంలో ఎప్పుడూ భూ కబ్జాలు లేవు. జగన్ ఇక్కడి ఆస్తులు అన్ని కావాలి.
• 22 ఎ పేరుతో భూములను కాజేస్తున్నారు. ఆ నిబంధన పెట్టి సెటిల్మెంట్లు చేసుకున్నారు.
• ధర్మాన ప్రసాద రావు….బొత్స ఏం మాట్లాడుతారో అర్థం అవుతుందా….
• మన దగ్గర కార్పొరేటర్ గాపని చేసిన ఒకాయన ఏం మాట్లాడుతాడు…పెట్టుబడులు అంటే కోడి గుడ్డు అంటాడు
• రాష్ట్రంలో నేడు గంజాయి కల్చర్, గన్ కల్చర్ వచ్చింది అంటే మనం సిగ్గు పడాలి.
• తెలుగు దేశం పార్టీ వెన్నెముక బిసిలు. ఆలాంటి బిసిలు ఉండే ప్రాంతం ఉత్తరాంధ్ర.
• నిజాయితీ పరులు ఉండే ప్రాంతం ఉత్తరాంధ్ర. నాడు దేశంలో ఒక్క యూనిట్ విద్యుత్ చౌర్యం లేకుండా రికార్డు సృష్టించిన ప్రాంతం ఉత్తరాంధ్ర.
• రాష్ట్రంలో నిత్యావసరాలు పెరిగాయి. అన్ని పన్నులు పెరిగాయి. విద్యుత్ చార్జీలు పదే పదే పెంచుతున్నారు. దీనిపై చేపట్టిన నిరసనలను విజయవంతం చేయండి
• పెట్రోల్ డీజిల్ ధరలు అన్ని రాష్ట్రాల కంటే ఎపిలోనే ఎక్కువ
• ఆర్టీసీ రేట్లు, ఇంటిపన్నులు పెంచారు….చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం
• ఇప్పుడు రాష్ట్రంలో కొత్త తరహా మద్యం బ్రాండ్స్ వచ్చాయి. బూమ్ బూమ్ అనే బీర్లు వచ్చాయి. ఇవన్నీ ఏంటో తెలీదు. నాణ్యత లేని మద్యం అమ్మి ప్రజల ఆరోగ్యాలు నాశనం చేస్తున్నారు
• రాష్ట్రంలో 10 లక్షల కోట్ల అప్పులు చేశారు. పన్నులు వేశారు. ఒక్క రోడ్డు వేయలేదు. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. ఒక్క పరిశ్రమ తేలేదు. మరి ఆ నిధులు అన్నీ ఏమయ్యాయి. రోజుకు రూ. 475 కోట్ల అప్పులు చేస్తున్న ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం
• నాలుగేళ్లలో జగన్ రాష్ట్రంలో నాలుగు ఇళ్లు కట్టాడు.మనం కట్టిన టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు ఇవ్వలేదు.
• లోకేష్ యువగళంలో సెల్ఫీ చాలెంజ్ విసురుతున్నాడు. కార్యకర్తలు కూడా మీ గ్రామంలో మనం చేసిన పనిపై సెల్ఫీ చాలెంజ్ విసరండి. జగన్ కు ట్యాగ్ చేయండి. సమస్యలపైనా సెల్ఫీ చాలెంజ్ తో ప్రశ్నించండి
• దేశంలో రిచ్చెస్ట్ సిఎంగా ఉన్న జగన్….తాను పేదల మనిషి అంటున్నాడు….వర్గ పోరు అని కొత్త మాటలు చెపుతున్నాడు.
• ఊరు ఊరుకూ ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి పేదల వ్యక్తా…..పేదలకు ఒక్క ఇల్లు కట్టని వ్యక్తి పేదల వ్యక్తా
• రాష్ట్రంలో రైతు బజార్ లు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన సిఎం జగన్
• నాడు విశాఖ ఉక్కు విషయంలో పోరాడి సమస్యను పరిష్కరించాం. నాడు ప్రైవేటీ కరణకు అడ్డుపడ్డాం.
• డిల్లీ మెడలు వంచుతా అని చెప్పిన ముఖ్యమంత్రి డిల్లీ ఎందుకు వెళుతున్నాడు. ప్రత్యేక హోదా వచ్చిందా…..గిరిజన యూనివర్సిటీ ప్రారంభం అయ్యిందా….పోలవరం పూర్తి అయ్యిందా….రైల్వే జోన్ డిమాండ్ పూర్తిగా నెరవేరిందా….సిఎం డిల్లీ ఎందుకు వెళుతున్నాడు?
• జగన్ మా భవిష్యత్ అని ఇప్పుడు స్టిక్కర్లు వేస్తారట. జగన్ మన భవిష్యత్ కాదు. జగనే మన దరిద్రం. మనకు శాపం.
• జగన్ కు ఎప్పుడూ విశాఖపై ప్రేమ లేదు. విశాఖ భూములు, ఆస్తులపై ప్రేమ
• ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ గెలిచే అవకాశమే లేదు. ఈ ప్రభుత్వ ఎక్సైపైరీ టైం వచ్చింది
• మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ మైండ్ బ్లాక్ అయ్యి…ఇప్పుడు ఎమ్మెల్యేలను గౌరవిస్తా అంటున్నాడు.
• ఈ నాలుగేళ్లు తెలుగు దేశం పార్టీ కోసం పోరాడిన మీకు శిరసు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా
• పట్టబద్రుల ఎన్నికల్లో తిరుగుబాటు…..వచ్చే ఎన్నికల్లో ప్రజా తిరుగుబాటు అవుతుంది.
• మేం 175 పోటీ చేస్తామా లేదా అనేది మీకు ఎందుకు చెప్పాలి. మేం 175లో వైసీపీని ఓడిస్తాం. పులివెందులలో కూడా జగన్ ను ఓడిస్తాం.
• అచ్చెన్నాయుడు తో మొదలు పెట్టి అందరిపై తప్పుడు కేసులు పెట్టారు. ఎన్నికేసులు పెట్టినా క్యాడర్, లీడర్లు భయపడలేదు. ఎన్నికేసులు పెట్టినా పార్టీ పోరాటం ఆగదు.
• తెలుగు దేశం పార్టీలో నేతలు అందరినీ కలుపుకుని పోవాలి. కొందరు పార్టీలో విభేదాలు సృష్టించాలని చూస్తున్నారు.
• విభేదాలు సృష్టించిన నేతలకు పదవులు రావు, పార్టీలో గ్రూపులు పెట్టిన వారికి పదవులు రావు.
• పార్టీలో త్యాగాలు చేసిన వారికి, పనిచేసిన వారికి పదవులు వస్తాయి.
• నాలుగేళ్లు పోరాడారు….మీ త్యాగాలు మరిపోం. అయితే పార్టీ బలోపేతం కోసం బయట వాళ్ల వస్తే పార్టీలో చేర్చుకోండి
• మొదటి ప్రాధాన్యం పార్టీలో ముందు నుంచి ఉన్నవారికే…ఆ తరువాతనే పార్టీలో చేరే వారికి ప్రాధాన్యం.
• వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇస్తాం. ఈ సారి ముందుగానే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. ఆమేరక ప్రయత్నం చేస్తున్నా
• క్యాండెట్ ఎవరు అనేది కాదు…జెండా గెలవాలి అని చూడండి.