Suryaa.co.in

Telangana

ఒక్క ప్రాజెక్టు కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయావ్?

-రూ.28 వేల కోట్లు ఖర్చు చేస్తే ఒక్క ప్రాజెక్టు కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయావ్?
-పాలమూరు-రంగారెడ్డి, లక్ష్మీదేవిపల్లె, ఆర్డీఎస్ ఆధునీకరణ పనులేమయ్యాయ్
– రియల్ ఎస్టేట్ పేరుతో టీఆర్ఎస్ నేతల వెంచర్ల దోపిడీ
-కేసీఆర్ ఫ్యామిలీ మాదిరిగానే రంగారెడ్డి జిల్లాలోనూ ఫ్యామిలీ ప్యాకేజీ దోపిడీ సాగుతోంది
-వీధి దీపాలకు పంచాయతీలకు కేంద్రం నిధులిస్తే నచ్చిన సంస్థకు పనులు అప్పగించాలంటూ దుర్మార్గపు సర్క్యులర్ జారీ
-దళిత బిడ్డ నాగరాజును నడిరోడ్డుపై ముస్లిం హత్య చేస్తే స్పందించలేని దుస్థితి ఎందుకు?
-ఇచ్చిన హామీలెందుకు అమలు చేయలేదో టీఆర్ఎస్ నేతలను నిలదీయండి
-బీజేపీ అధికారంలోకి వస్తే లక్ష్మీదేవిపల్లె పనులను పూర్తి చేసి సాగునీరందిస్తాం
-రంగారెడ్డి జిల్లా కేశంపేట ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ ఫైర్…

ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో సాగు నీటి ప్రాజెక్టుల కోసం రూ.28 వేల కోట్లు ఖర్చు పెట్టామంటూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ‘‘28 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినని చెప్పినవ్ కదా… అరే బట్టేబాజ్.. ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తే లక్ష్మీదేవి పల్లి, పాలమూరు-రంగారెడ్డి, ఆర్డీఎస్ ఆధునీకరణ పనులను ఎందుకు పూర్తి చేయలేదు?’’అని ప్రశ్నించారు.

ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయల కమీషన్లు దండుకోవడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని కేసీఆర్ ఫ్యామిలీ పేరుతో దోచుకుంటుంటే… రంగారెడ్డి జిల్లాలోనూ ఫ్యామిలీ ప్యాకేజీ దోపిడీ కొనసాగుతోందన్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో టీఆర్ఎస్ నేతలు వెంచర్ల దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు. వీధి దీపాల కోసం కేంద్రం గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తే… రాష్ట్ర వ్యాప్తంగా తనకు నచ్చిన ఒక సంస్థకే వీధి దీపాల మెయింటెనెన్స్ అప్పగించాలంటూ కేసీఆర్ ఫ్రభుత్వం దుర్మార్గపు జీవో చేసిందన్నారు.

దళిత బిడ్డ నాగరాజును నడిరోడ్డుపై ముస్లిం వ్యక్తులు హత్య చేస్తే స్పందించని దుస్థితిలో ఎందుకు ఉన్నామో ఆలోచించాలని కోరారు. ఎంఐఎం చేతిలో బందీగా కేసీఆర్ మారారని… హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. త్వరలోనే పాతబస్తీని కైవసం చేసుకుని కొత్త బస్తీగా తీర్చిదిద్దుతామని… గొల్లకొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించి తీరుతామని ఉద్ఘాటించారు.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో 27వ రోజు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా సాయంత్రం పొద్దుపోయాక కేశంపేట మండల కేంద్రానికి విచ్చేసిన బండి సంజయ్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీ ఎత్తున కాగడాలు, పెద్ద పెద్ద లాంతర్లతో సంజయ్ కు స్వాగతం పలికారు. ఆయనపై పూల వర్షం కురిపించారు. బాణాసంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు. ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కేశంపేటకు తరలివచ్చిన భారీ జన సందోహాన్ని ఉద్దేశించి బండి సంజయ్ ఉద్దేశించి ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు….
కేశంపేట సహా రంగారెడ్డి జిల్లాలో రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయి. నేను పాదయాత్ర చేస్తుంటే టీఆర్ఎస్ నేతలు మోకాళ్ళ యాత్ర చేయాలంటున్నరు. ప్రజల కోసం పొర్లు దండాల యాత్ర చేసేందుకైనా సిద్ధం. మీ అయ్యను మందు తాగొద్దని చెప్పు.

రియల్ ఎస్టేట్ వ్యాపారులే మమ్మల్ని విమర్శిస్తారు. వెంచర్ల శాఖ కోసం మీ ప్రభుత్వంలో రూ.100 కోట్లు అని అంటున్నారు. వీళ్లకు వ్యవసాయం ముఖ్యం కాదు…రియల్ ఎస్టేట్ వ్యాపారమే ముఖ్యం.రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం ఫ్యామిలీ ప్యాకేజ్ లా దోచుకుంటున్నారు. ఇక్కడ కూడా టీఆర్ఎస్ నేతలు ఫ్యామిలీ ప్యాకేజ్ లా దోచుకుంటున్నారు

లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ను పూర్తి చేయలేదు. కేసీఆర్ కుర్చీ గురించే ఆలోచిస్తాడు తప్ప, ఇక్కడి ప్రజల గురించి ఆలోచించడు. అయ్య తాగుతుంటే… కొడుకు ఉర్లమీద పడి పిచ్చి కుక్కలా మొరుగుతుండు… ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు 28 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినని చెబుతుండు…. అరే బట్టేబాజ్.. మరి లక్ష్మీదేవి పల్లి, పాలమూరు-రంగారెడ్డి, ఆర్డీఎస్ ఆధునీకరణ పనులను ఎందుకు పూర్తి చేయలేదు? ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దోచుకోవడమే

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 200 కి.మీల దూరం నుండి ఫాంహౌజ్ కు నీళ్లు తెచ్చుకునేందుకు రూ.1.2 లక్షల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అవసరమయ్యే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులను ఎందుకు పూర్తి చేయలేదు? కమిషన్ లకు కక్కుర్తి పడే మూర్ఖుడు కేసీఆర్.

మోడీ తెలంగాణ కు లక్షా 40వేల ఇండ్లు ఇస్తే… కేశంపేట్ లో కేసీఆర్ ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చాడో చెప్పాలి. పేదలకు డబుల్ బెడ్రూం ఇవ్వని కేసీఆర్… తాను మాత్రం రూ.800 కోట్లతో 100 రూములు ఇండ్లు కట్టుకున్నాడు.నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడుగానీ ఇంట్లో మాత్రం 5 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. 25 లక్షల జీతం తీసుకుంటున్నారు.

మోడీ ఫ్రీగా ఇచ్చే బియ్యాన్ని… గుంట నక్కలా అమ్ముకుంటున్నాడు. ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోడీదే. కేంద్రం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతోంది. ఉదయ్ స్కీం కింద గ్రామాలకు ఎల్ఈడీ, పోల్స్ కు కేంద్రం నిధులు మంజూరు చేస్తే… ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు నచ్చిన సంస్థకే రాష్ట్రం మొత్తం మెయింటెనెన్స్ పనులు అప్పగించాలని సర్క్యూలర్లు జారీ చేసి ఏకగ్రీవ తీర్మానం చేసి పంపాలంటూ గ్రామ పంచాయతీలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా?

అందరినీ మోసం చేస్తున్న మూర్ఖుడు కేసీఆర్. రాష్ట్రంలో గడీల రాజ్యం నడుస్తోంది. పేడోళ్ల బలిదానం తో ఏర్పడ్డ తెలంగాణ లో పెద్దోడు రాజ్యమేలుతున్నాడు. కేశంపేట్ అభివృద్ధికి ఎన్ని నిధులు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయండి. చర్చకు మేము సిద్ధం. సొంత ఆస్తులు పెంచుకోడానికే పాలిస్తున్నారు.
ఇక్కడి రోడ్ల అభివృద్ధి కి కేంద్రం అత్యధిక నిధులు ఇచ్చింది. చేవచచ్చిన నాయకులను ఎలా గెలిపించారు? ఫార్మ్ హౌస్ లో ఉన్న సీఎం ను బయటికి గుంజుకొచ్చిన పార్టీ బీజేపీ.

టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేయబోతున్నాయి. కాంగ్రెస్ కు ఓటు వేస్తే.. అది వెళ్ళేది టీఆర్ఎస్ కే. ఎంఐఎం ను చంకలో పెట్టుకుని తిరుగుతున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ.నాగరాజు అనే దళిత యువకుడిని హత్య చేసినా… ప్రభుత్వం స్పందించడం లేదు. సమాజం కూడా స్పందించలేని దుస్తితిలో ఎందుకు ఉందో ఆలోచించాలి.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ను వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం. తెలంగాణ లో కాషాయ జెండాకు తప్ప పచ్చ జెండాకు స్థానం లేదు.

తెలంగాణ తల్లి గడీల్లో బంధీ అయింది.తెలంగాణ తల్లిని బంధ విముక్తి రాలిని చేయడానికే యాత్ర చేస్తున్నాం. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు 27 రోజులుగా పాదయాత్ర చేస్తున్నాం.31 రోజుల పాటు దిగ్విజయంగా పాదయాత్ర కొనసాగిస్తాం… trs కు గుణపాఠం చెబుతాం. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా తెలంగాణ లో మార్పు రాబోతోంది. ఒక్కసారి మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి.ఈనెల 14న అమిత్ షా తుక్కుగూడకు వస్తున్నారు. 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి, చరిత్ర సృష్టించబోతున్నాం.

LEAVE A RESPONSE