Suryaa.co.in

Telangana

కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతా

– మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

హైదరాబాద్: కాళేశ్వరం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతానని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అయితే ఇంత వరకు ఎలాంటి నోటీసులు తనకు అందలేదని, తనకు నోటీసులు పంపిన విషయం మీడియా ద్వారా తెలుసుకున్నానని వెల్లడించారు.

‘‘ ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది. నీ ఇష్టం వచ్చిన విచారణ చేసుకో. నేనేమీ భయపడ. మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటా. అయితే నీ చిట్టా మా దగ్గర ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉంది అది గుర్తుపెట్టుకో. ఈ చిల్లర బెదిరింపులకు నేను భయపడేవాడని కాదు’’ అని సీఎం రేవంత్‌రెడ్డినుద్దేశించి వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE