– ఫినాయిల్ తో కడగాల్సివస్తే రేవంత్ నోటిని కడగాలి
– బీసీ బిల్లు ఇపుడు ఎక్కడ ఉందో చెప్పాలి
– వైఎస్ చనిపోయాక డీ ఎస్ ను ఎందుకు సీఎం చేయలేదు ?
– బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్ రావు
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత ఆద్వర్యం లో నిన్న జ్యోతిరావు ఫూలే విగ్రహ సాధన దీక్ష విజయవంతంగా జరిగింది. దీక్ష జయప్రదం తో కాంగ్రెస్ లోని రేవంత్ బ్యాచ్ కు కళ్ళు కుట్టాయి. ఎమ్మెల్సీ కవిత పై ఇస్టమొచ్చినట్టు ఆరోపణలు చేయించారు .వాటిని ఖండిస్తున్నాం.
జ్యోతి రావు ఫూలే అందరికీ ఆదర్శం .గురువు లాంటి వారు. జ్యోతి రావు ఫూలే అంటే ఇష్టం లేని వారే ఆయన విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తారు. ఇందిరా పార్కు దీక్షా స్థలాన్ని కొందరు ఫినాయిల్ తో కడిగారు. ఇది జ్యోతి రావు ఫూలే ను అవమానపరచడమే. కాంగ్రెస్ పార్టీ జ్యోతి రావు ఫూలే కు క్షమాపణ చెప్పాలి.
ఫినాయిల్ తో కడగాల్సివస్తే రేవంత్ నోటిని కడగాలి .కాంగ్రెస్ ను కడగాలి. చామల కిరణ్ కుమార్ రెడ్డి గతం లో కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆయన కూడా మాట్లాడుతున్నాడు. కొందరు బీసీ నేతలు రేవంత్ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. బీసీ సంఘం నేత శ్రీనివాస్ గౌడ్ బలహీన వర్గాలకు వ్యతిరేకి అయిన రేవంత్ వంత పాడుతున్నారు. కులదురహంకారి రేవంత్ ను బీసీ నేతలు సమర్థిస్తారా ?
కవిత ఉనికి కోసం దీక్షలు చేయాల్సిన అవసరం లేదు.అధికారం లో ఉన్న వారే ఉనికి కోసం పాకులాడుతారు. ఈ నెల 11 న ఫూలే జయంతి కల్లా అసెంబ్లీ లో విగ్రహ ఏర్పాటు కు కాంగ్రెస్ నేతలు కృషి చేయాలి. రేవంత్ సెక్యూరిటీ లేకుండా గ్రామాలకు వెళితే గోచీ ఊడగొడతారు.
ఇంతకాలం కవిత కు ఫూలే గుర్తు రాలేదా అంటున్నారు. మరి కాంగ్రెస్ కు ఎందుకు గుర్తుకు రాలేదు ? రేవంత్ బీసీ లకోసం ఢిల్లీ లో దొంగ దీక్ష చేశారు. అసలు బీసీ బిల్లు ఇపుడు ఎక్కడ ఉందో చెప్పాలి. మోడీ తో రేవంత్ కుమ్మకై ఢిల్లీ లో బీసీ కార్యక్రమం పెట్టారు.
చేతనైతే కాంగ్రెస్ నేతలు ఫూలే విగ్రహ ఏర్పాటు కోసం పోరాడాలి తప్ప పిచ్చి విమర్శలు చేయకూడదు. జ్యోతి రావు ఫూలే విగ్రహ ఏర్పాటు కోసం కవిత పోరాటం కొనసాగుతుంది. బీసీ రిజర్వేషన్ల కోసం రేవంత్ రెడ్డి అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకెళ్లలేదు ?
ఓటుకు నోటు దొంగ రేవంత్ కు బీసీ సంఘాల పేరిట కొందరు మద్దతు ఇవ్వడమేమిటి ? కేసీఆర్ బీసీలకు చేసినంత మరెవ్వరూ చేయలేదు. గురుకులాలు పెట్టింది ఎవరు కేసీఆర్ కాదా ? బీసీ లకు కేసీఆర్ చేసింది క్షేమం ..కాంగ్రెస్ చేసింది ద్రోహం.
బీసీ లకు గౌరవం పెంచింది కేసీఆర్. కొందరు తోడేళ్ళ గుంపు లాగా బీసీ ఉద్యమాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అసెంబ్లీ లో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టించిన ఘనత కేసీఆర్ ది. ఫూలే విగ్రహాన్ని కూడా కవిత సాధిస్తారు. కవిత పై విమర్శలు చేస్తే కబడ్ధార్.
ఎంపీ కిరణ్ రాహుల్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు: బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె .కిషోర్ గౌడ్
ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గతం లో రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి కి కవిత ను విమర్శించే అర్హత లేదు. బీసీ నాయకులను కాంగ్రెస్ ఎందుకు ముఖ్యమంత్రులను చేయలేదు?
వైఎస్ చనిపోయాక డీ ఎస్ ను ఎందుకు సీఎం చేయలేదు? కాంగ్రెస్ పార్టీ కేంద్రం లో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదు?ట్యాంక్ బండ్ పై జ్యోతి రావు ఫూలే విగ్రహ ఏర్పాటు కోసం కేసీఆర్ జీవో ఇచ్చారు. ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎవరు వద్దన్నారు? కవిత పై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదు
రేవంత్ రెడ్డిదిప్రజా కంటక పాలన: సుమిత్ర తనోబా …
కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ ..తీరు మాత్రం గాడ్సే ది.
బీసీ లకు బీసీ లే నాయకత్వం వహించాలి అని కొందరు వింతగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ని ఓ విదేశీయురాలే స్థాపించారు అని కాంగ్రెస్ నేతలు గుర్తు పెట్టుకోవాలి. కవిత పై లిక్కర్ కేసు బీజేపీ రాజకీయ దురుద్దేశం తో పెట్టినదే. ఒక్క పైసా కూడా ఆ కేసు లో కవిత దగ్గర దొరక లేదు.
రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు .ప్రజా కంటక పాలన. రేవంత్ చేసేది గూండాగిరి ..హింస ను ప్రేరేపిస్తూ నిన్న గుజరాత్ లో నూలు వడుకుతున్నారు. కవిత పై విమర్శలు మాని విగ్రహ ఏర్పాటుకు బీసీ సంఘాల నేతలు ప్రయత్నించాలి. ప్రెస్ మీట్ లో ఆలకుంట హరి ,నరేష్ కూడా పాల్గొన్నారు.