Suryaa.co.in

Andhra Pradesh Telangana

బాబు నీటి దోపిడి

– చంద్రబాబు చేతిలోకి సాగర్
– అంటే తెలంగాణ చేతి నుంచి ఆంధ్రా చేతికి ఆ ప్రాజెక్టును ఇవ్వడమే
– సాగు నీటి మంత్రి ఉత్తమ్ కు సోయి లేదు
– నీళ్ల మంత్రి కాదు.. కన్నీళ్ల మంత్రి
– రాష్ట్రం లో పరోక్షంగా చంద్రబాబు పాలన
– తెలంగాణ నీళ్ల ను దొంగలించుకుపోతున్నారు
– సాగర్ ను ఆంధ్రా సీ ఆర్ పి ఎఫ్ అప్పగించడాన్ని ఆపాలి
– నిర్ణయం మార్చుకోకపోతే రైతుల ఆందోళన బాట
– మాజీ మంత్రి జి .జగదీష్ రెడ్డి

హైదరాబాద్ : ఎన్నికలప్పుడు కేసీఆర్ చేసిన హెచ్చరికలు ఒక్కొక్కటి నిజమవుతున్నాయి. రాష్ట్రం లో కేసీఆర్ పథకాలు వెనక్కి పోతున్నాయి. నదీ జలాల్లో తెలంగాణ హక్కులు హరించుకుపోతున్నాయి. పదేళ్ల కేసీఆర్ పాలన లో కృష్ణా గోదావరి జలాల్లో మనకున్న వాటాను పూర్తిగా వినియోగించుకున్నాం.

ఇపుడు తెలంగాణ నీళ్ల ను దొంగలించుకుపోతున్నారు. చంద్రబాబు ఏపీ సీఎం అయ్యాక ఈ ధోరణి పెరిగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్ల పై పట్టింపు లేదు. చంద్రబాబు తన చేయాలనుకున్న నీ టి దోపిడిని చేసేస్తున్నారు. నాగార్జున సాగర్ లో ములుగు సీ ఆర్ పి ఎఫ్ బెటాలియన్ పోయి విశాఖ సీ ఆర్ పి ఎఫ్ బెటాలియన్ వచ్చింది. సాగర్ పూర్తిగా చంద్రబాబు చేతిలోకి వెళ్లిపోయింది.

కేసీఆర్ సీఎం ఉన్నన్ని రోజులు సీ ఆర్ పి ఎఫ్ బలగాలను సాగర్ కు రానివ్వలేదు. కేసీఆర్ కృష్ణా ప్రాజెక్టులను కే ఆర్ ఎం బి కి తాకట్టు పెట్టే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ వితండ వాదం చేసింది. లక్ష మంది తో కేసీఆర్ సభ పెట్టేసే సరికి కాంగ్రెస్ ప్రభుత్వం తోక ముడిచి, కృష్ణా ప్రాజెక్టులను కే ఆర్ ఎం బి కి అప్పగించమని అసెంబ్లీ లో తీర్మానం చేసింది.

అసెంబ్లీ లో తీర్మానం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మారలేదు. తెలంగాణ నిధులు ఢిల్లీ కి తెలంగాణ నీళ్లు ఆంధ్రకు అన్నట్టు పరిస్థితి తయారైంది. చంద్రబాబు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వణుకుతుందో అర్థం కావడం లేదు. వయా చంద్రబాబు ఈ ప్రభుత్వం మోడీకి దగ్గరైంది.

సీ ఆర్ పి ఎఫ్ కు సాగర్ ను అప్పజెప్పడం అంటే తెలంగాణ చేతి నుంచి ఆంధ్రా చేతికి ఆ ప్రాజెక్టును ఇవ్వడమే. సాగు నీటి మంత్రి ఉత్తమ్ కు సోయి లేదు. దోచుకుందాం దాచుకుందాం అనే పని లో సీఎం మంత్రులు బిజీ గా ఉన్నారు. రాష్ట్రం లో పరోక్షంగా చంద్రబాబు పాలన సాగుతోంది. నీళ్ల పై ముఖ్యమంత్రికి శ్రద్దలేదు .ఢిల్లీకి మూటలు పంపడం పైనే సీఎం 24 గంటలు బిజీగా ఉన్నారు.

మళ్ళీ సమైక్య పాలన రోజులు వస్తున్నాయి. పరిస్థితులు ఇలానే ఉంటే హైదరాబాద్ కు తాగు నీళ్లు కూడా రావు. కేసీఆర్ పాలన లో రెండు పంటలకు నీళ్లు ఇచ్చాం. ఇపుడు తాగునీళ్లు ఇవ్వలేని పరిస్థితి. ఉత్తమ్ సాగు నీళ్ల మంత్రి కాదు.. కన్నీళ్ల మంత్రి అయ్యారు. ఉత్తమ్ నియోజవర్గం లోనే రైతులు సాగునీళ్ళు రాక కంటతడి పెడుతున్నారు.

బడే భాయ్ తో బాగుండి చోటే భాయ్ ఏమి సాధించారు ? కేసీఆర్ మోడీ తో బాగాలేక రాష్ట్రానికి ఏం సాధించలేకపోయారు అని రేవంత్ అన్నారు. ఇపుడు బాగుండి ఏం సాధించారు ? సాగర్ పై 2023 కున్న స్థితిని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సాగర్ ను ఆంధ్రా సీ ఆర్ పి ఎఫ్ అప్పగించడాన్ని ఆపాలి.నిర్ణయం మార్చుకోకపోతే రైతులు ఎక్కడికక్కడ ఆందోళన బాట పడతారు. కాళేశ్వరం ను ఎండబెట్టి రైతులను ఇబ్బందుల్లోకి నెట్టిన ప్రభుత్వం ఇది.

తెలంగాణ రైతాంగాన్ని నీరు గార్చే కుట్రకు రాష్ట్ర ప్రభుత్వం తెర లేపింది. ఏ ఐ ని నమ్ముకోవడం కంటే, ఎనుముల ఇంటలిజెన్స్ ను వాడుకుంటే రేవంత్ కు మంచిది. ఏ ఐ వీడియో ల పేరు తో రాష్ట్ర ప్రభుత్వం హెచ్ సీ యూ వాస్తవాలను దాచే ప్రయత్నం చేస్తోంది. కేసులకు భయపడే పార్టీ బీ ఆర్ ఎస్ ది కాదు. కోర్టులంటే ఈ సీఎం కు లెక్కలేదు. బీ ఆర్ ఎస్ కార్యకర్తలపై ఇక్కడి పోలీసులతో కాకుంటే సీఐఏ ,ముసాద్ సంస్థలతో విచారణ జరిపించుకున్నా అభ్యంతరం లేదు.

మంత్రివర్గ విస్తరణ జరిగితే తన పదవికి ముప్పు అని రేవంత్ రెడ్డే దాన్ని ఆపుతున్నారు. ఎలాగూ కాంగ్రెస్ మళ్ళీ రాష్ట్రం అధికారం లోకి వచ్చేది లేదు అని కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు. విద్యా శాఖను సమర్ధంగా నిర్వహించలేని అసమర్ధుడు రేవంత్ రెడ్డి. సోయి లేక పాలన చేతగాక, గురుకులాల్లో విద్యార్థుల మరణాలకు రేవంత్ కారణమవుతున్నారు
ప్రెస్ మీట్ లో మాజీ ఎంపీ లింగయ్య యాదవ్ ,ఒంటెద్దు నరసింహ రెడ్డి ,కె .కిషోర్ గౌడ్ ,తుంగ బాలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE