– రేవంత్ రెడ్డి బీజేపీ కోవర్టు
– అంబేద్కర్ రాజ్యాంగం పోయి ఇందిర ఎమర్జెన్సీ రాజ్యాంగం
– ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటికి కేసులా ?
– పింక్ బుక్ లో అందరి పేర్లు రాసుకుంటున్నాం
– మాజీ ఎమ్మెల్యే ఏ.జీవన్ రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్రం లో రేవంత్ పాలన కొనసాగుతుందా ? నియంత పాలన కొనసాగుతుందా ? అంబేద్కర్ రాజ్యాంగం పోయి ఇందిర ఎమర్జెన్సీ రాజ్యాంగం వచ్చిందా ?.జై తెలంగాణ అంటే జైలు పాలు చేస్తున్నారు. నిజం చెబితే నిర్బంధాలా ?
రాష్ట్రం లో ప్రజాస్వామ్యం అరెస్టు అయింది. కేసీఆర్ ది జనహిత పాలన అయితే రేవంత్ ది నియంత పాలన. ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటికి కేసులా ? రేవంత్ అరాచకాలను పింక్ బుక్ లో నమోదు చేసుకుంటున్నాం.
మీనాక్షి నటరాజన్ షాడో సీఎం అయితే రేవంత్ రెడ్డి డమ్మీ సీఎం అయ్యారు. ఫ్లెక్సీలు కడితే కూడా కేసులు నమోదు చేస్తున్నారు. తెలంగాణ కు కేసీఆర్ సర్ నేమ్ గా మారితే రేవంత్ కేసుల తెలంగాణ గా మార్చారు హరీష్ రావు ,కే టీ ఆర్ ,పల్లా రాజేశ్వర్ రెడ్డి ,పాడి కౌశిక్ రెడ్డి ఇలా ఎవరిని కేసులు పెట్టకుండా వదిలిపెట్టారు. ఎంత మందిని జైల్లో పెడతారు ?బీ ఆర్ ఎస్ 65 లక్షల మంది సైన్యాన్ని జైల్లో పెడితే జైళ్లు సరిపోతాయా ?
రేవంత్ రెడ్డి బీజేపీ కోవర్టు గా మారారు అందుకే బీహార్ ఎన్నికల వసూలు కు రేవంత్ మీద నమ్మకం లేక హై కమాండ్ మీనాక్షి నటరాజన్ ను హైదరాబాద్ పంపింది. రాష్ట్రంలో ఢిల్లీ పాలన నడుస్తోంది. బీ ఆర్ ఎస్ నేతల పై కేసులకు టార్గెట్లు పెడుతున్నారు. కేసులు పెట్టని పోలీస్ అధికారులను వేధిస్తున్నారు.
మళ్ళీ వచ్చేది బీ ఆర్ ఎస్ ప్రభుత్వమే. వంద సీట్లతో కేసీఆర్ యే మళ్ళీ సీఎం కాబోతున్నారు. మిమ్మల్ని వేధించిన వారిని ఎవ్వర్నీ వదిలిపెట్టం. పింక్ బుక్ లో అందరి పేర్లు రాసుకుంటున్నాం. కేసులు ఇలాగే ఉంటే …ఏప్రిల్ 27 మా సభ తరవాత సీఎం ,మంత్రులు రోడ్లపై తిరిగే పరిస్థితి ఉండదు. నాపై కూడా 42 కేసులు నమోదు అయ్యాయి.
తెలంగాణ లో రాహుల్ చేతిలో ఉన్న రాజ్యాంగం అమలు కావడం లేదు. కేసీఆర్ పాలనలో మూడు పువ్వులు ,ఆరు కాయలు గా అభివృద్ధి ఉంటే, రేవంత్ పాలన మూడు కేసులు ఆరు అరెస్టులు అన్నట్టు సాగుతోంది. హామీలు అమలు చేయడం లేదు కానీ కేసులు లెక్కలేనన్నీ పెడుతున్నారు.
రేవంత్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వదిలి సచివాలయం నుంచి పాలన సాగించండి మీనాక్షి నటరాజన్ ను సచివాలయం నుంచి పంపించేయండి. సోషల్ మీడియా ను రేవంత్ రెడ్డి దుర్వినియోగం చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారు ఇప్పటికైనా బీ ఆర్ ఎస్ పై వేధింపులు ఆపండి ..పాలన పై దృష్టి పెట్టి ప్రజల కిచ్చిన హామీల అమలు చేయండి.