Suryaa.co.in

Telangana

అసమర్ధ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

– బి.ఆర్.ఎస్ పార్టీకి రాజకీయం ఒక టాస్క్
– ఇతర పార్టీలకు వ్యాపారం
– ఎల్లారెడ్డి నియోజకవర్గం నగరి (సదాశివ నగర్ ) మండలంలో BRS జరిగిన రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

కామారెడ్డి: ఈ నెల 27 న చలో వరంగల్ సభకు కామారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామం నుండి అందరూ వచ్చి సభను విజయవంతం చేయాలి.కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం పురోగమనం.రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ తిరోగమనం. కెసిఆర్ గత 10 ఏండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయం వృద్ధి రేటులో దేశంలోనే 1 వ స్థానంలో ఉంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు 11 వ స్థాయికి దిగజారింది.

జీ ఎస్ డి పి వృద్ధి రేటులో కెసిఅర్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం 3 స్థానంలో ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో 14 స్థానానికి పడిపోయింది. రాష్ట్రాన్ని నడిపించ లేని అసమర్ధ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ గత 10 ఏండ్లలో చేసిన అనేక అభివృద్ధి పనులను కేంద్ర ప్రభుత్వం,అనేక రాష్ట్రాలు అనుసరించాయి. కేసీఆర్ పాలనలో ఎకరం భూమి విలువ ఎంత ఉండే ? ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎంత ఉంది ?.. ఇదే రాష్ట్ర అభివృద్ధి కి నిదర్శనం.

10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన నాయకుడు కేసీఆర్.కాంగ్రెస్ పాలనలో మళ్ళీ ఆనాటి పాత రోజులు తిరిగి వస్తున్నాయి. కెసిఆర్ ప్రభుత్వ హయంలో రైతులకు నాట్ల అప్పుడు రైతు బందు వేస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఓట్ల అప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలు,420 హామీలు 100 రోజుల్లో అమలు చేస్తాం అని 500 రోజులు దాటినా అమలు చేయలేదు.

రేవంత్ రెడ్డి రాష్ట్రంలో భూములు అమ్మడం లేదా దోచుకొని డబ్బులు సంపాదించుకునే పనిలో తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదు. పార్టీ ఏర్పడి 24 వసంతాలు పూర్తి చేసి 25 సంవత్సరం లోకి అడుగుపెడుతున్నాం. సంవత్సర కాలం పాటు పార్టీ రాజతోత్సవాలు జరుపుకుంటాం . తెలిసినోడు తెలువనోడు,లేచినోడు లెవ్వనోడు ప్రతి ఒక్కడు త కేసీఆర్ మీద బి.ఆర్.ఎస్ మీద పడి ఎడిచేటోళ్లు తయారయ్యారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు గూబ గుయ్యుమనేలా సమాధానం చెప్పడానికి పెట్టుకున్న సభ వరంగల్ సభ. బి.ఆర్.ఎస్ పార్టీకి రాజకీయం ఒక టాస్క్..ఇతర పార్టీలకు వ్యాపారం. కేంద్ర ప్రభుత్వం కూడా మొన్నటి బడ్జెట్ లో తెలంగాణ ను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.కేంద్రం పై కూడా మనం పోరాడాలి. మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ ఇతర నియోజకవర్గ మరియు మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE