– బీఆర్ఎస్ తో సంబంధం లేదు. ఆ పార్టీ గురించి అడగకండి
– కవిత ఇండిపెండెంట్.. నా వెనుక ఎవరు లేరు
– దగాపడ్డ ఉద్యమకారుల్లో నేను కూడా బాధితురాలినే
– గతంలో కన్నా కూడా ఇప్పుడే ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది
– నీళ్లు, నిధులు, నియామాకాల విషయంలో రేవంత్ రెడ్డి అన్యాయం
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
మహబూబ్ నగర్: కవిత ఇండిపెండెంట్. నా వెనుక ఎవరు లేరు. నా ముందు ప్రజలు ఉన్నారు. కొత్తగా వచ్చిన వారిపై ఆరోపణలు, అనుమానాలు, అవమానాలు ఉంటాయి. కాంగ్రెస్ వాళ్లు నేను బీజేపీ బీ టీమ్ అని, బీజేపీ వాళ్లు కాంగ్రెస్ బీ టీమ్ అని అంటారు. బీఆర్ఎస్ వాళ్లు ఏదేదో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయితే నా నడక ద్వారా నా స్టాండ్ ఏంటో ప్రజలకు అర్థమవుతుంది. అందుకు కొంత సమయం పడుతుంది.
నీళ్లు, నిధులు, నియామకాలు విషయంలో రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రెండున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చారు. అయినా ఆరు గ్యారంటీలు అమలు చేయటం లేదు. జాగృతి తరఫున షాడో కేబినెట్ వేస్తాం. కేబినెట్ లో ఉన్న వారిని నీడలా వెంటాడుతాం.
దగాపడ్డ ఉద్యమకారుల్లో నేను కూడా బాధితురాలినే. ఆడబిడ్డలు అని చెప్పరు. గుంభనంగా అభివృద్ధి జరగాలని ఎన్నో విషయాలను బయటకు చెప్పలేదు. గతంలో కన్నా కూడా ఇప్పుడే ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. గతంలో కొన్ని పనులు చేయించలేకపోయాను.
అమరవీరులందరికీ న్యాయం జరగలేదు. అందుకే అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇప్పించాలని పోరాటం చేస్తున్నా.
బతుకమ్మ ఎత్తుకొని మొత్తం ప్రపంచానికి పరిచయం చేశాను. అలాంటి కమిట్ మెంట్ తో పనిచేస్తాను. నా రాజీనామా యాక్సెప్ట్ చేయండి నేను అడుగుతూనే ఉన్నా. కాంగ్రెస్ వాళ్లకు ఏం రాజకీయం ఉందో? నా రాజీనామా యాక్సెప్ట్ చేస్తే, పార్టీ మారిన ఎమ్మెల్యేల రాజీనామాలు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందేమో? నేను లోకల్ బాడీ ఎమ్మెల్సీ ని. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో కూడా తెలియదు. నాకు బీఆర్ఎస్ తో సంబంధం లేదు. బీఆర్ఎస్ ద్వారా వచ్చిన రాజీనామా యాక్సెప్ట్ చేయమని కోరుతున్నా.
అది సామాజిక తెలంగాణ ద్వారానే సాధ్యమవుతుంది. అందుకోసమే నా ప్రయత్నం. ఐతే ఈ 10 ఏళ్లు ఏం చేశారన్న ప్రశ్న కూడా వస్తుంది. అందరికీ ఆహారం, నీళ్లు, పెన్షన్లు ఇలా కేసీఆర్ కొంత మంచి చేశారు. గతంలో రేవంత్ రెడ్డి ఇక్కడకు ప్రచారానికి వచ్చినప్పుడు , అప్పటి మంత్రి లక్ష్మారెడ్డిని కట్టేస్తేనే కరెంట్ వస్తుందని అన్నారు. మరి ఇప్పుడు సీఎం ను కట్టేస్తేనే మహబూబ్ నగర్ కు మంచి జరుగుతుందా?
రామారెడ్డిలోని గురుకులంలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే కనీసం పట్టించుకోవటం లేదు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలు, హాస్పిటల్స్ ను కూడా ఈ ప్రభుత్వం మెయింటెన్ చేయలేకపోతోంది. బీసీలకు 42 శాతం వాటా రావద్దా? అగ్ర వర్ణాల్లోనూ రాజకీయంగా ప్రాతినిధ్యం లేని వైశ్యులు ఉన్నారు. ముస్లింలు, లంబాడాలు లేని మొదటి కేబినెట్ ఇది.
ఇప్పటికీ మహబూబ్ నగర్ లో మూడు రోజులకొకసారి నీళ్లు వస్తాయా? అది బీఆర్ఎస్ తప్పా, కేసీఆర్ తప్పా అనేది ఇక్కడ చర్చ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తప్పులను సవరించండి. ఇక్కడి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీయో, బీజేపీయో తెలియటం లేదు.
నారాయణ పేట్- కొడంగల్ ప్రాజెక్ట్ కూడా కట్టుకోండి. కానీ 80 శాతం పనులు పూర్తైన ప్రాజెక్ట్ ను పూర్తి చేయండి. లేదంటే ఏపీ ప్రభుత్వం మన నీళ్లను తీసుకెళ్తుంది. ఇప్పటికే కృష్ణా బేసిన్ నీళ్లను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి నీళ్ల కోసం బనకచర్ల కూడా కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే ప్రయత్నం కూడా జరుగుతుంది. అదే జరిగితే కృష్ణా ప్రాజెక్ట్ ల కాల్వల్లో క్రికెట్ ఆడుకోవాల్సిందే. చుక్క నీరు రాదని మహబూబ్ నగర్ ప్రజలకు చెబుతున్నా. దీన్ని ఆపే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేయాలి.
దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ అన్నారు. కానీ 2014 లోనే కేసీఆర్ సీఎం అభ్యర్థి అని చెప్పి ఎన్నికలకు వెళ్లారు. అయినా బీఆర్ఎస్ తో నాకు సంబంధం లేదు. ఆ పార్టీ గురించి అడగకండి. ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీ లో అంబేడ్కర్ విగ్రహం, బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగా చేసుకున్నాం. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేరు. అందుకే ఆయనకు తెలంగాణ తల్లి గురించి తెలియదు. మేము పాత తెలంగాణ తల్లినే గౌరవించుకుంటాం.