అమెరికా నూతన అధ్యక్షుడు నిర్ణయాలతో భారత పట్టణాలకు మహర్ధశ?
ప్రవాస భారతీయులు స్వదేశీ పెట్టుబడుల పై ఆసక్తి చూపుతున్నారా?
(ఏ.బాబు)
అగ్రరాజ్యం అమెరికా సరికొత్త పంథా లో వెళుతుంది. ట్రంప్ అధికారంలోకి రాగానే ప్రపంచ దేశాల్లో అలజడి మొదలైంది…కానీ ట్రంప్ నిర్ణయాలు మనకు ఆశాజనకంగా మారనున్నాయి. అమెరికా ఇప్పుడు ప్రపంచ పోలీస్! వాళ్ళు చెప్పిందే వేదం. పశ్చిమాసియా లో యుద్ధం తీవ్రంగా ఉన్నాకూడా ముఖ్యంగా చమురు, సహజవాయువు దిగుమతి లో భారత్ పట్ల గల్ఫ్ దేశాలు సానుభూతి వైఖరి అవలంభించడం వల్ల చమురు ధరలు పెరగలేదు! పెరిగినా కూడా భారత ప్రభుత్వం పరోక్ష పన్నుల రూపంలో సామాన్యుడిపై ధర కనబడకుండా చేసింది.
ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉన్న కోటి మంది భారతీయులు యుద్ధ భయాలతో స్వదేశీ బాట పడుతున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం పోయిన వాళ్ళు వారి సొంత గ్రామాల్లో ఒకటో రెండో ఎకరాలు కొన్నారు. గుడిసెల ఇళ్ల నుండి కాంక్రీట్ ఇళ్లు కట్టుకున్నారు. అక్కడ సంపాదించిన డబ్బుతో పిల్లలకు ఇంజనీరింగ్ కోర్సులు చదివించారు. ఇప్పుడు అమెరికా మారుతున్న ప్రపంచంలో వాళ్ళు స్టార్టప్ కంపెనీలో ఉద్యోగాలు కోసం వేచి చూస్తున్నారు!
ఇక చుట్టూ ముస్లిం దేశాలలో నిరంతర యుద్దాలు చేస్తున్న ఇజ్రాయిల్ కూడా బాగా అలసి పోయింది. వాళ్లకు ఇప్పుడు భారత్ ఇంజనీరింగ్ విద్యార్థుల ఆర్టిఫీషియల్ ఇంజనీరింగ్ స్కిల్స్ కావాలి. ఎందుకంటే అక్కడ ప్రతి పౌరుడు యుద్ధ భూమిలో ఉన్నారు. కాబట్టి మన స్టూడెంట్ ల నుండి సరికొత్త పరిజ్ఞానం కావాలి అంటే మన భారత మెట్రోపాలిటీ సిటీలో సరికొత్త కార్యాలయాలు తెరవ బోతున్నారు.
ఇప్పుడు అమెరికా దేశం ఇక కలల రాజ్యాంగ మారనుందా? అమెరికా వెళ్ళడానికి కొత్తగా హెచ్ 1 బీ విసాలు ఇక ఎండ మావులే! ట్రంప్ తీసుకున్న నిర్ణయం చాలా మందికి భయం కొలుపుతున్న కూడా…ఒక తెలియని విషయం ఏమిటంటే భారత ఐటీ కంపెనీలు త్వరగా పుంజుకొనున్నాయి. దానికి కారణం అమెరికా వలస వాద విధానం వల్ల మొదటగా హెచ్ వన్ బీ విసాల దరఖాస్తులు కఠినం కానున్నాయి.
ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) అర్హత పరీక్షలో భారత నుండీ ఇప్పటి వరకు అమెరికా లక్ష మందిని ఇండియా నుండి తీసుకునేది! ఇప్పుడు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు కూడా అమెరికా వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. ఇదీ అమెరికా వ్యూహమే. ఎందుకంటే ఇంటలిజెన్స్ పేరిట అమెరికా లో వేలాది డాలర్ల లు ఇచ్చి ఉద్యోగ నియామకాల కన్నా ఇండియా లో అంతకన్నా తక్కువ వేతనాలు తో భారతీయ విద్యార్థుల ప్రతిభను క్యాష్ చేసుకునే అవకాశాలు అమెరికా చేస్తుంది. గత ట్రంప్ పరిపాలనలో తిరస్కరణ రేట్లు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 24 శాతానికి కి చేరుకున్నందున, హెచ్1బీ అప్లికేషన్లు కఠినమైన పరిశీలనను ఎదుర్కోవాలి.. భారత ఐటీ కంపెనీలు రిపబ్లికన్ విజయాన్ని సంబరాలు చేసుకున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారని స్పష్టత రావడంతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా , హెచ్‌సీఎల్, విప్రో తో పాటు అమెరికా ఔట్ సోర్సింగ్ ప్రాజెక్టులు కైవసం చేసుకొని తక్కువ వేతనాల తో భారతీయ టెక్ జాబర్స్ కు ఉపాధి కల్పించే అవకాశాలు ఇక్కడ మెరుగు అవుతాయి! ఇవన్నీ రెండేళ్ల తరువాత మనకు ఫలితాలనిస్తాయి.
బలమైన డాలర్ భారతీయ ఔట్ సోర్సింగ్ పరిశ్రమకు ప్రయోజనం చేకూరుస్తుంది. మెజారిటీ ఐటీ సేవల కంపెనీలు యూఎస్‌ను కీలక వ్యాపార మార్కెట్గా అందజేయనున్నాయి. తద్వారా ఐటీ రంగం వారి నిర్వహణ ఖర్చులు భారతీయ రూపాల్లో ఉన్నప్పటికీ యూఎస్ కరెన్సీలో వారి ఆదాయంలో అధిక భాగాన్ని పొందుతుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కొత్త సవరణలు అమలు కావడానికి మరో మూడు నెలలు పడుతుంది. ట్రంప్ నిర్ణయం అమలైతే బడ్జెట్ ఒత్తిళ్లను తగ్గించడానికి, యూఎస్ కంపెనీల టెక్ ఖర్చులను విస్తరించడానికి, తద్వారా యూఎస్‌లో నమోదు చేసుకున్న భారతీయ స్టార్టప్లకు, టెక్నాలజీ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది..
చైనాకు ప్రత్యామ్నాయం
చైనాపై డొనాల్డ్ ట్రంప్ కఠినమైన వైఖరి అవలంబిస్తే భారతదేశానికి యూఎస్ నిధుల ప్రవాహం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఏఐతో పాటు సెమీకండక్టర్ల వంటి అధునాతన సాంకేతికతలపై యూఎస్ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గత పదేళ్లుగా అమెరికా లో నివసిస్తున్న వాళ్ళు కూడా ట్రంప్ నిర్ణయాలతో ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. లేదా పట్టణాల్లో, గ్రామాల్లో భూమి లేదా ప్లాట్స్ తీసుకోవడానిక్ త్వరలో ముందుకు రానున్నారు.
ఇప్పటివరకు అమెరికాలో పది కోట్లు (ఇండియా కరెన్సీ) పెట్టి ఇల్లు తీసుకున్న ఉద్యోగులు ఇప్పుడు అక్కడ ఆస్తులు అమ్మేసి హైదరాబాద్ ,విశాఖపట్నం, విజయవాడ అమరావతిలో త్వరలో ఇళ్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది…హైదరాబాద్, వైజాగ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటే ఈ డబ్బులు గ్రామాల్లో భూముల కొనుగోళ్లు పెరుగుతాయి. అలాగే జిల్లా ల్లో కూడా త్వరలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోబోతుంది.