Suryaa.co.in

Andhra Pradesh

ఏపీఐఐసీ కాలనీలోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తా

-4వ డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్

తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఏపీఐఐసీ కాలనీలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు.

తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ ఏపీఐఐసీ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మంగళవారం ఉదయం పర్యటించారు. అనంతరం కోగంటి రామయ్య కళ్యాణమండపంలో స్థానిక పెద్దలతో సమావేశమై స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ 2014-19 మధ్య కాలంలో కొద్దిపాటి వర్షానికే వర్షం నీరు నిల్వ ఉండేవని, ఆ సమస్యను పరిష్కరించడానికి అనేక ప్రయోగాలు చేశామన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కార్పోరేషన్ ఇ.ఇ.గా ఉన్న ధనుంజయ్ చోరవతో సంప్ నిర్మాణం చేయడంతో సమస్యను కొంత వరకు పరిష్కరించగలిగామన్నారు. కాలనీలో అపార్ట్మెంట్ల సంఖ్య పెరగడంతో ఈ సమస్య మళ్ళీ ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు.

గుంటతిప్ప డ్రైయిన్ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు తీసుకువస్తున్నామని అందువల్ల ఈ సమస్య పూర్త స్థాయిలో పరిష్కారం అవుతుందన్నారు. ఏపీఐఐసీ సంస్థ కింద ఈ ప్రాంతలో కొన్ని స్థలాలు ఉండటం, అక్కడక్కడ ఇళ్ళు ఉండటం వల్ల కొంత సమస్య ఉందన్నారు.

ఈ అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తానని చెప్పారు. ఏపీఐఐసీ ఛైర్మన్, కార్యదర్శి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సహాకారంతో ఈ సమస్యను అతి త్వరలోనే పరిష్కరిస్తానని చెప్పారు. 2014-19 మధ్య కాలంలో ఈ సమస్యపై పనిచేశామని, అందువల్ల ఆఫైల్స్ను బయటకు తీసి వెంటనే పరిష్కరించేలా చూస్తామనని చెప్పారు. మున్సిపల్ శాఖా మంత్రి పి. నారాయణ ఏ సమస్యను చెప్పినా పరిష్కరించేలా చూస్తున్నారని అన్నారు.

పటమట సి.ఐ పవన్ కిషోర్ మాట్లాడుతూ తాను నూతనంగా బాధ్యతలు తీసుకోవడం జరిగిందని, తన పరిధిలోని లా అండ్ ఆర్డర్కు సంబంధించి ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అలాగే యువత ఎక్కువగా డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారని, దానిపై కాలనీల పెద్దలు కూడా శ్రద్ద తీసుకుంటే డ్రగ్స్ ను నియంత్రించి యువతను బాగు చేసుకుందామన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, ముమ్మనేని ప్రసాద్, కాలనీ ప్రెసిడెంట్ పాతూరి సాంబశివరావు, గొల్లపూడి నాగేశ్వరరావు, రెడ్డి రాంబారావు, అయ్యప్ప రెడ్డి, డి. వి. కృష్ణారావు, బాయిన వెంకట్రావు, గద్దె రమేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE