ఆత్మహత్యల్లో అగ్రస్థానంలో నిలిపినందుకు మీకు 175 స్థానాలు వస్తాయా ముఖ్యమంత్రి గారు?

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, 7లక్షలకోట్ల అప్పులుచేసి, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు, రైతుల ఆత్మహత్యల్లో అగ్రస్థానంలో నిలిపినందుకు మీకు 175 స్థానాలు వస్తాయా ముఖ్యమంత్రి గారు?:రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి
• వచ్చేఎన్నికలకు అవసరమైన వనరులన్నీ తాను అందిస్తాను, ఎన్నికల్లో పోరాడండి..గెలవండని తనపార్టీ వారికి ముఖ్యమంత్రిచెప్పడం చూస్తే, దోపిడీసొమ్ముతో వచ్చేఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆయనపడుతున్న తాపత్రయం కనిపిస్తోంది : సూర్యప్రకాశ్

ఒక్కఛాన్స్ అనినమ్మించి కల్లబొల్లిమాటలు, అమలుచేయడంచేతగాని వాగ్దానాలతో ప్రజలను వంచించి అధికారంలోకివచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఈమూడేళ్లలో ప్రజలకు ఏం ఒరగబెట్టాడని, రాష్ట్రాన్ని ఏంఉద్ధరించాడని వచ్చేఎన్నికల్లో మొత్తంగా 175 స్థానాలు గెలుస్తా నంటున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి నిలదీశారు.

గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో టీడీపీ అధికారప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా వారి మాటల్లోనే మీకోసం…!
నిన్న జరిగిన తనపార్టీ ఎమ్మెల్యేలు, నేతల సమావేశంలో ముఖ్యమంత్రి మాటలు వింటే, ఉట్టికి ఎగరలేనమ్మ..ఆకాశానికి ఎగురుతానన్నట్టుగా ఉన్నాయి. మూడేళ్లలో, ప్రజలను ఏంఉద్ధరించాడని, ఏం ఊడబీకాడని ఈ ముఖ్యమంత్రి వచ్చేఎన్నికల్లో 175స్థానాలు గెలుస్తానంటున్నాడు. జగన్ రెడ్డి గ్రాఫ్ 60శాతంపెరిగితే, ఎమ్మెల్యేలగ్రాఫ్ 40శాతం అంతకంటే తక్కువకు పడిపోయిందా? గ్రాఫ్ ల సంగతి అటుంచండి, ముఖ్యమంత్రిగారు.. వచ్చేఎన్నికల్లో మీపార్టీతరుపున పోటీచేసే ఎమ్యెల్యేఅభ్యర్థులంతా తమకు బీఫామ్ ఇవ్వకుండా ఉంటేచాలని దేవుణ్ణి వేడుకుంటున్నారు. అది గమనించకుండా..మీరు 175కి, 175 స్థానాలు గెలుస్తాం..కుప్పంలో కూడా గెలుస్తామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తే ఎలా?

జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా, ఆఖరికి తలకిందులుగా తపస్సుచేసినా, 2024 ఎన్నికల్లో 17స్థానాల్లో గెలవడమే పెద్దగొప్ప. కచ్చితంగాచెప్పగలం. అవసరమైతే రాసిస్తాంకూడా. చంద్రబాబునాయుడిగారి హయాంలో అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే 2,3 స్థానాల్లోఉన్న రాష్ట్రాన్ని 19వస్థానానికి, అంతకంటే దిగువకు దిగజార్చినందుకు ఈ ముఖ్యమంత్రికి మరలా 175 స్థానాలొస్తాయా? ఒక్కఛాన్స్ అనినమ్మి గెలిపించిన ప్రజల్ని సర్వనాశనంచేసినందుకు, విద్యుత్ ఛార్జీలు,ఆర్టీసీఛార్జీలు, పెట్రోల్ డీజిల్ , నిత్యావసరాల ధరలు పెంచి, ఆస్తిపన్ను, చెత్తపన్ను, వాహనాలపన్ను.. రోడ్లసెస్సుపేరుతో ప్రజల్ని పీక్కుతింటున్నందుకు మీకు 175సీట్లువస్తాయా? వైసీపీనేతలకు, తనపై విద్వేషంతోతనపార్టీవారిని బుజ్జగించడానికి, వారికి ఏవో పదవులుఇవ్వడానికే జగన్మోహన్ రెడ్డి జిల్లాలను విడగొట్టాడు.

జిల్లాలు.. అభివృద్ధిపరిషత్ లంటూ ఎవరి అభివృద్ధిని ఈ ముఖ్యమంత్రి కాంక్షిస్తున్నాడో ఆయనమాటల్లోనే అర్థమైంది. ప్రభుత్వఖజానా వట్టిపోయేలా చేసి, రాష్ట్రాన్ని అప్పులఊబిలోకి నెట్టేసి, ప్రజలను కోలుకోలేనవిధంగా అప్పులభారంతో కుంగదీసి, మొత్తంగా 7లక్షలకోట్ల అప్పులు చేసినందుకు ఈ ముఖ్యమంత్రికి వచ్చేఎన్నికల్లో 175సీట్లు వస్తాయా? ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీతాలు, పించన్లకోసం రోడ్లపైకి వచ్చేలాచేసినందుకు, సీపీఎస్ పేరుతో వారిని మోసగించినందుకు వైసీపీకి 175 సీట్లువస్తాయా?

రైతులు, మహిళలు అవేదనతో, ఈ ముఖ్యమంత్రి వారికి చేస్తున్న అన్యాయంతో ఆక్రందనలు పెడుతున్నందుకు, రాష్ట్రంలోని పరిశ్రమలన్నీ పొరుగురాష్ట్రాలకు పారిపోయేలాచేసినందుకు ఈ ముఖ్యమంత్రికి ప్రజలు 175 స్థానాలు ఇవ్వాలా? మహిళలపై అఘాయిత్యాల్లో, రైతుఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపినందుకు వైసీపీ ప్రభుత్వానికి 175 సీట్లు ఇవ్వాలా? ముఖ్యమంత్రి గారు .. మీపార్టీ 175 స్థానాల్లో గెలవడం సంగతిదేవుడెరుగు.. రాష్ట్రంమరోశ్రీలంక కాకుండా ఉంటేచాలని ప్రజలంతా అనుకుంటు న్నారు. ఆ విషయం మీరెందుకుగుర్తించడంలేదు? జగన్మోహన్ రెడ్డి ఇంకారెండేళ్లు ముఖ్యమంత్రిగాఉంటే, ఏపీ మరోశ్రీలంకలా మారి, తాము తిండికోసం, గుక్కెడునీటికోసం రోడ్లపైకి రావాల్సి వస్తుందేమోనని జనమంతా భయంతో చచ్చిబతుకుతున్నారని తెలుసు కోండి.

మద్దిపట్ల సూర్యప్రకాశ్ (టీడీపీ అధికారప్రతినిధి) :
ముఖ్యమంత్రి తనమనసులోని భయాన్ని, తనఅసమర్థతను తనపార్టీవారి ముందు కనిపించకుండా నిన్నజరిగిన సమావేశంలో బాగాకవర్ చేశారు.. తనపార్టీనాయకులకు ధైర్యంచెప్పడానికి, మునిగిపోతున్న తనపార్టీని,కనుమరుగైపోతున్న తనప్రతిష్టను కప్పిపుచ్చేక్రమంలోనే రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలన్నీ స్వీప్ చేస్తామని చెప్పుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో కంటే సినీరంగంలో ఉండుంటే, తన నటనా ప్రాభవంతో మంచిపేరుప్రఖ్యాతులు పొందేవాడు. తననటనతో భారతదేశానికి ఆస్కార్ అవార్డ్ రాలేదన్న లోటుప్రజలకు లేకుండా చేసిఉండేవాడు. తనపార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందంటున్న ముఖ్యమంత్రి, 175 స్థానాలు ఎలాగెలుస్తానంటున్నాడో ఆయనేచెప్పాలి. తనపై, తన ప్రభుత్వంపై ఉన్నవ్యతిరేకతకు ఎమ్మెల్యేలను బలిచేయాలని ముఖ్యమంత్రి అనుకుంటుంటే, ముఖ్యమంత్రిపై ఉన్నవ్యతిరేకతతో తమపుట్టికూడా మునుగుతుందేమో అన్న ఆందోళన వైసీపీఎమ్మెల్యేల్లో ఉంది. ఈ విధంగా ఎవరికివారు….వారిలోని భయాందోళనలు ప్రజలకు తెలియకుండా చేయడంకోసం చిత్రవిచిత్రమైన విన్యాసాలుచేస్తున్నారు.

Leave a Reply