Suryaa.co.in

Andhra Pradesh

మోదీ, చంద్రబాబు, పవన్‌తోనే పంచాయతీలకు దశ తిరిగింది

– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
– సీఎంను కలిసిన ‘ముప్పాళ్ళ’ నేతలు

వెలగపూడి : కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వచ్చాక మళ్లీ పంచాయతీలకు నిధులు రావడం… అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ను తంగిరాల సౌమ్య, చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామ పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కోటి రూపాయల అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రం నుంచి వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబర్చిన నాలుగు గ్రామ పంచాయితీలను ఎంపిక చేయగా అందులో ముప్పాళ్ల ఒకటి.

జాతీయ స్థాయిలో ముప్పాళ్ల గ్రామాన్ని సామాజిక న్యాయం, సోషల్ సెక్యూరిటీ పంచాయతీ విభాగంలో అవార్డుకు ఎంపిక చేసి ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కారాన్ని ముప్పాళ్ల గ్రామ సర్పంచ్ కుసుమరాజు వీరమ్మ అందుకున్న విషయాన్ని ముఖ్యమంత్రి కి తెలియపరిచి పురస్కారాన్ని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ మేరకు సౌమ్య, నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు.

LEAVE A RESPONSE