Suryaa.co.in

Andhra Pradesh

జగన్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు?

-విశాఖ నగరాన్ని క్రైమ్ క్యాపిటల్ గా మార్చేశారు
-తెలుగుదేశం – జనసేన పార్టీలది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్
– విశాఖ నార్త్ శంఖారావం సభలో టిడిపి ఇన్చార్జి గంటా శ్రీనివాసరావు

అన్న ఎన్టీఆర్ టిడిపిని స్థాపించినపుడు అందరూ అవహేళన చేశారు. తర్వాత ఆయన సత్తాను ప్రపంచానికి చాటారు. భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల సంక్షేమనిధిని లోకేష్ టిడిపి కేడర్ కోసం ప్రవేశపెట్టారు.లోకేష్ పార్టీని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. రాబోయే రోజుల్లో సమర్థవంతంగా పార్టీని నడిపించే నాయకుడు మాకు ఉన్నాడని నిరూపించారు.

ఎన్నికల మ్యాచ్ లో లాస్ట్ 3 ఓవర్లు మాత్రమే కాదు… లాస్ట్ బాల్ కూడా ఎంతో కీలకమైనది. 2019 ఎన్నికల్లో ఒక్కచాన్స్ అని జగన్ అడగడంతో జనం మోసపోయారు, 151మంది ఎమ్మెల్యేలుంటే అసెంబ్లీలో కోరంలేక వాయిదా వేసే పరిస్థితి నెలకొంది.

జగన్ డిల్లీ వెళ్లితే కేవలం ముగ్గురే ఎంపిలు ఆయన వెంటనే ఉన్నారు. ప్రజలేకాదు, ఎమ్మెల్యేలు, ఎంపిల నమ్మకాన్ని కూడా జగన్ కోల్పోయారు. త్వరలో జగన్ కు బైబై చెప్పాల్సిన చారిత్రాత్మక అవసరం రాష్ట్రానికి ఉంది. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ పాలన ప్రారంభించారు, ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చివేయడం దేశచరిత్రలో ఇదే ప్రథమం.

900కి మంది పైగా హామీలు ఇచ్చి, 15శాతం కూడా నెరవేర్చలేదు, మద్యనిషేధం చేశాకే ఓట్లు అడుగుతామని చెప్పిన జగన్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు విశాఖ ఒకప్ప్డుడు సిటీ ఆఫ్ డెస్టినీ, 2014-19 హుద్ హుద్ సమయంలో చంద్రబాబు ఇక్కడే ఉంటే పరిపాలన అంటే ఎలా ఉండాలో చూపించారు.

నేడు జగన్మోహన్ రెడ్డి పాలనలో విశాఖ నగరాన్ని క్రైమ్ క్యాపిటల్ గా మార్చేశారు. మధురవాడలో ఓ అపార్ట్ మెంట్ లో ఎమ్మార్వో రమణయ్య దారుణంగా చంపేశారు. ఇటువంటి అరాచకపాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం – జనసేన పార్టీలది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్, వైసిపిని రాష్ట్రం నుంచి తరిమేయడానికి కలసివచ్చిన పవన్ కళ్యాణ్ కు అభినందనలు.

LEAVE A RESPONSE