Suryaa.co.in

Andhra Pradesh Political News

సాక్షి ఆఫీస్ ‘స్వీయ అగ్నిహోత్రావధానం!

(భూమా బాబు)

ఆహా! సాక్షి ఆఫీస్ ‘స్వీయ అగ్నిహోత్రావధానం’ – ఏలూరులో కొత్త డైవర్షన్ థియరీ!

మన రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఓ సరికొత్త ‘ట్రెండ్’ పుట్టుకొచ్చింది. అదేంటంటే, “అవాంఛిత వ్యాఖ్యలు చేసి ప్రజాగ్రహం పెల్లుబికితే, మన ఆఫీసుకి నిప్పు పెట్టేయండి!” దీన్నే మనం ‘విస్మృతి క్రియా సిద్ధాంతం’ అనొచ్చు.

తాజాగా ఏలూరులో సాక్షి కార్యాలయానికి జరిగిన ‘అగ్ని సేవ’ ఈ సిద్ధాంతానికి తాజా ఉదాహరణ. ఎవరు చేశారు? అబ్బో! అదే కదా అసలు ట్విస్ట్!సీసీటీవీ ఫుటేజ్ అదృష్టవశాత్తూ, అద్భుతవశాత్తూ, అత్యద్భుతవశాత్తూ… మాయమైపోయింది!

ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఓ ఇంజినీరింగ్ అద్భుతం. బహుశా, ఇది కొత్త టెక్నాలజీ అయి ఉంటుంది: “ఆటోమేటిక్ ఫుటేజ్ డిస్ఇంటిగ్రేషన్ సిస్టమ్”. ప్రమాద సమయంలో మాత్రమే డియాక్టివేట్ అయ్యే ఈ పొలిటికల్ టెక్నాలజీకి నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే!

కానీ, ఈ ‘అగ్ని సేవ’కు ముందు ఏం జరిగిందో గుర్తుందా? అమరావతి మహిళలపై సాక్షి మీడియా చర్చలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇక్కడే మన కొత్తగా ఏర్పాటైన “తాడేపల్లి క్రిమినల్ డైవర్షన్ టాక్టిక్స్” వారి మేధస్సు మెరిసింది. లాజిక్ ఎంత సింపులో చూడండి:
సమస్య: అవాంఛిత వ్యాఖ్యలు మీడియా రచ్చ ప్రజల కోపం.

పరిష్కారం: మన మీడియా ఆఫీసుకు నిప్పు పెట్టండి! (ఇది ఎక్కడో విన్నట్టు లేదా?

లిక్కర్ ఎంక్వైరీ స్టార్ట్ అవ్వంగానే డైవర్షన్ కోసం తాడేపల్లిలో ప్యాలెస్ ఎదురుగా అగ్నిహోత్రావధానం… ఛ! అది కూడా ఒక మిస్టరీనే కదా! అక్కడ కూడా ఫుటేజ్… మాయమే!).

ఫలితం: మీడియా, ప్రజల దృష్టి అంతా అగ్ని ప్రమాదం, ఫుటేజ్ మాయం మీదకు మళ్లుతుంది. అసలు వ్యాఖ్యల గురించి, లిక్కర్ స్కామ్ గురించి ఎవరు పట్టించుకుంటారు? జీనియస్!

ఇక, ఈ ‘అగ్ని సేవ’ జరిగినప్పుడే ఇంకేం జరుగుతోంది?

కూటమి ప్రభుత్వం తమ ఏడాది పాలనలో జరిగిన ‘అభివృద్ధి, సంక్షేమ పండుగలు’ నిర్వహించాలనుకుంటోంది. ఈ పండుగకు అడ్డు పడాలనుకుంటే ఏం చేయాలి? సరిగ్గా సాక్షి కార్యాలయానికే నిప్పు పెట్టాలి! “మీ పండుగ మాకు నచ్చలేదు, కాబట్టి మా ఆఫీసునే కాల్చేస్తున్నాం!” అన్నట్టుగా ఉంది ఈ నిరసన! ఇది కొత్త రకమైన ‘ప్రొటెస్ట్’ అనుకోవాలేమో.

ముగింపు: ఏలూరు ఘటన కేవలం ఓ ‘అగ్ని ప్రమాదం’ కాదు. ఇది ఒక మాస్టర్క్లాస్, ఓ రాజకీయ ఆర్ట్ ఫారమ్. సీసీటీవీ ఫుటేజ్ మాయం కావడం ఇందులో హైలైట్. ఇదంతా ఓ పెద్ద ‘డైవర్షన్ డ్రామా’ కాదని అనుకోవడం పెద్ద మూర్ఖత్వం.

మరోవైపు, తెలుగుదేశం పార్టీ వారి ‘అభివృద్ధి పండుగలు’ ఎలా ఉంటాయో చూడాలని ఉంది. ఏదో ఒక పార్టీ అభివృద్ధి చేస్తోంది – కొందరు రాష్ట్రాన్ని, మరికొందరు… ప్రజావేదిక కూల్చి.కాల్చిన అగ్నిమాపక నైపుణ్యాలను!

LEAVE A RESPONSE