– బ్రహ్మర్షి ప్రిన్సిపాల్ పై చర్యలకు ఆదేశం
– నివేదిక కోరుతూ చిత్తూరు కలెక్టర్ కు లేఖ
అమరావతి: చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన పదో తరగతి విద్యార్ధిని ఆత్మహత్య ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ గా స్పందించింది. కేసును సుమోటోగా స్వీకరించింది. కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ శుక్రవారం చిత్తూరు ఎస్పీతో మాట్లాడారు. ఘటన పూర్వాపరాలను ఆరాతీశారు. మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి ఈ కేసుకు సంబంధించి స్థానిక పోలీసు అధికారులతో మాట్లాడారు. ఆమె అందించిన ప్రాథమిక సమాచారం మేరకు.. కేసులో ఆరోపణలెదుర్కొంటున్న బ్రహ్మర్షి స్కూల్ ప్రిన్సిపాల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. అదేవిధంగా ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను కోరుతూ చిత్తూరు జిల్లా కలెక్టర్ కు మహిళా కమిషన్ నుంచి లేఖ రాశారు.