Suryaa.co.in

Telangana

పనిచేస్తున్న గెస్ట్, పార్ట్‌టైం ఉద్యోగులను కొనసాగించాలి

– అంధకారంలోకి బిసి,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ ల గురుకుల విద్యార్థుల భవిష్యత్తు
– మాజీ మంత్రి కొప్పుల

హైదరాబాద్ : గౌలిదొడ్డి గురుకులం మళ్ళీ శిథిలావస్థకు చేరుకోనున్నది. ఒకనాడు కూడా ముఖ్యమంత్రి గురుకుల పాఠశాలలో అడుగుపెట్టలేదు.తెలంగాణ సంక్షేమ గురుకుల పాఠశాలలో నిన్న దాదాపు 2000 మంది పార్ట్ టైం ఉద్యోగులు తొలగించడం పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించారు.

గురుకుల విద్యార్థులు కలుషిత ఆహారంతో మ‌ర‌ణాల సంఘటన మరువకు ముందే, గురుకులాల్లో ఆర్సీవోలు గెస్ట్‌, పార్ట్‌టైం ఫ్యాకల్టీల ఎంపికలో అవినీతి దందా బయటపడిందని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,500-3,000 ఖాళీలు పాతవారికి అవకాశం ఇవ్వకుండా మళ్లీ కొత్తవారితో భర్తీ అంటూ ఒక్కో అభ్యర్థి నుంచి 50 వేల నుంచి లక్ష వరకు వసూళ్లు చేస్తుంటే రేవంత్ రెడ్డి సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు.

తెలంగాణ సంక్షేమ గురుకుల పాఠశాలలో నిన్న దాదాపు 2 వేల మంది పార్ట్ టైం ఉద్యోగులు తొలగించారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల దాదాపు రెండు లక్షల మంది ఎస్సీ విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందన్నారు.

మొత్తంగా అన్ని సొసైటీల్లో అన్ని క్యాడర్లలో 2,500 నుంచి 3,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే వారికి చెల్లించాల్సిన 3 నెలల జీవితాల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు చెల్లించాలన్నారు.

రేవంత్ రెడ్డి సర్కారు వల్ల 38 ప్రతిభా పాఠశాలలు (సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్) లు, 24 క్రీడా అకాడమీలు మ్యూజిక్ స్కూల్, సైనిక్ స్కూల్, మహిళా సైనిక్ స్కూల్ కళాశాల, న్యాయ కళాశాల 35 ఒకేషనల్ కళాశాలలో ఇవన్నీ మూతపడే ప్రమాదం ఉందని అన్నారు. ఇక గౌలిదొడ్డి గురుకులం మళ్ళీ శిథిలావస్థకు చేరుకోనున్నది.

ఈ ముఖ్యమంత్రి గురుకుల పాఠశాలలో ఒకనాడు కూడా అడుగుపెట్టలేదని ఎద్దేవా చేశారు. పాఠశాల మొదలయ్యి మూడు నెలలైనా పిల్లలకు యూనిఫామ్, మాట్రీస్లు, బూట్లు నైట్ డ్రెస్ లు, ఇవ్వలేదు.

LEAVE A RESPONSE