Suryaa.co.in

Features Sports

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా – లైంగిక ఆరోపణలు!

రాజకీయం చేయాలంటే సమస్య లకి కొదువ ఉండదు! అందులోనూ క్రీడా రాజకీయాలు మాత్రం ఎప్పుడూ లైంగిక వేధింపులు, పక్షపాతం, నిధుల దుర్వినియోగం లాంటివాటి మీద తిరుగుతూ ఉంటాయి కానీ వీటి మీద పెద్దగా దృష్టి పెట్టలేదు ఏ ప్రభుత్వమూ! ఇది దశాబ్దాలుగా ఉంటూ వస్తున్న సమస్య!
అసలు లైంగిక వేధింపులు లేని రంగం ఎక్కడ ఉంది ప్రపంచవ్యాప్తంగా?

ఇప్పుడు ఢిల్లీ లోని జంతర్ మంతర్ దగ్గర WRF[Wrestling Federation of India] కి సంబంధించి కొంతమంది మహిళా రెజ్లర్లు మాకు న్యాయం కావాలి, మోడీ రాజీనామ చేయాలి, బ్రిజ్ భూషణ్ సింగ్ రాజీనామా చేయాలి లాంటి డిమాండ్లతో ప్రదర్శన చేస్తున్నారు!

మొదట వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ అనే ఇద్దరు మహిళా రెజ్లర్లు జనవరి 18, 2023 లో ఈ వివాదానికి నాంది పలికారు! ఇప్పుడు దీనిని తారాస్థాయికి తీసుకొచ్చారు!
ఆరోపణలు ఏమిటి?
1. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ లని లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు రెజ్లింగ్ కోచ్!
2. ఎప్పుడు జరిగింది ఇది? 2106 లో ట!
3. ఈ లైంగిక వేధింపులతో కోచ్ తో పాటు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ కూడా వేధింపులకి పాల్పడ్డాడా? నేరుగా లేదు కానీ అతని ప్రమేయం ఉంది!
4. ఇలా లైంగిక వేధింపుల బారిన పడ్డ వాళ్ళు ఎంత మంది వరకు ఉండవచ్చు? 600 నుండి 1000 దాకా బాలికలు, మహిళలు ఉండవచ్చు!
ఈ ప్రశ్నలు వేసింది మహిళా జర్నలిస్ట్ బుర్ఖా దత్! జవాబులు చెప్పింది వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ అనే మహిళా రెజ్లర్లు!

మరి సాక్షి మాలిక్ పెళ్ళి 2017 లో జరిగినప్పుడు WFI ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ని తానే స్వయంగా వెళ్ళి శుభలేఖ ఇచ్చి ఎందుకు ఆహ్వానించినట్లు? ఆ పెళ్ళికి బ్రిజ్ భూషణ్ వెళ్ళి శుభాకాంక్షలు చెప్పి విందు ఆరగించి వచ్చాడు కదా? తన మీద లైంగిక వేధింపులు జరిగింది 2015-2016 లో అయితే సంవత్సరం తరువాత జరిగిన తన పెళ్ళికి ఎందుకు ఆహ్వానించింది?

జవాబులు లేని ప్రశ్నలు!
1. లైంగిక వేధింపులు జరిగినప్పుడే ఎందుకు పోలీసు కంప్లైంట్ ఇవ్వలేదు?
2. 2016 లో జరిగితే 2023 లో ఎందుకు ధర్నా కి దిగారు?
3. లైంగిక వేధింపులు జరిగినట్లు ఎవన్నా ఆధారాలు ఉన్నాయా?
4. ఒక వేళ పోలీసులు కంప్లైంట్ తీసుకోవడానికి నిరాకరించినా లేదా కంప్లయింట్ తీసుకొని FIR రిజిస్టర్ చేయకపోయినా సంబంధిత మెజిస్ట్రేట్ కోర్టు లో ఎందుకు ఫిర్యాదు చేయలేదు? మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేస్తే వెంటనే కంప్లయింట్ తీసుకొని FIR నమోదు చేయమని మెజిస్ట్రేట్ సంబంధిత పోలీసులకి ఆదేశాలు ఇస్తారు కానీ ఆ పని ఎందుకు చేయలేదు?
5. అసలు ఈ విషయం అనేది ధర్నా చేయతగ్గ అంశమే కాదు అటువంటప్పుడు ఎందుకు ధర్నా చేస్తున్నట్లు?
6. గత మార్చి నెలలో సుప్రీం కోర్టు సుమోటో గా కేసుని తీసుకొని విచారణకి ఆదేశించింది నిజం కాదా?
7. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతున్నా కూడా ధర్నా చేయడంలో ఉన్న విషయం ఏమిటి?
8. అంటే సుప్రీం కోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న దర్యాప్తు మీద నమ్మకం లేదా?
9. పోనీ ఇదే వినేష్ ఫోగాట్ రెజ్లర్ కి అక్క[కజిన్]అయిన గీతా ఫోగాట్ కి హర్యానా ప్రభుత్వం DSP రాంక్ పోలీసు అధికారిగా నియమించింది. అలాగే గీత ఫోగాట్ DSP గా అధికారం చెలాయిస్తున్నది అటువంటప్పుడు సదరు వినేష్ ఫోగాట్ హర్యానాలోనే తన అక్క[కజిన్] ద్వారా కేసు రిజిస్టర్ చేయించాల్సి ఉండింది కానీ ఆ పని ఎందుకు చేయలేదు? గీతా ఫోగాట్ ఒకప్పుడు రెజ్లర్ కూడా!
చాలా ప్రశ్నలు ఉన్నాయి కానీ సమాధానాలే లేవు.

అసలు విషయం ఏమిటంటే….
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లో ఎక్కువగా హర్యానా వాళ్ళకే అవకాశాలు వస్తున్నాయి! హర్యానా వాళ్ళతో పోలిస్తే ఉత్తర ప్రదేశ్, బీహార్ రెజ్లర్స కి అవకాశం ఉండడం లేదు కాబట్టి 2024లో జరగబోయే ఎంపిక కోసం ఈసారి ఉత్తర ప్రదేశ్ మరియు బీహార్ ల నుండి రెజ్లింగ్ అభ్యర్ధులకి అవకాశాలు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. దాంతో తమకి అవకాశాలు ఉండవు అని గ్రహించిన వీళ్ళు తలా తోకా లేని అంశాన్ని తీసుకొని అంతర్జాతీయంగా భారతదేశ పరువుని గంగలో కలపడానికి నిర్ణయించుకున్నారు.

మహిళా రెజ్లర్ తన పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీడియా సాక్షిగా బ్రిజ్ భూషణ్ నా తండ్రి సమానుడు కాబట్టి మొదటి శుభలేఖ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పింది.

64 ఏళ్ల బ్రిజ్ భూషణ్ శరణ్ 1000 మందిని లైంగిక వేధింపులకి గురి చేశాడు అనే ఆరోపణ ఎలా చేయగలిగారు? 1000 మందిని పక్కన పెట్టేయండి కనీసం వినేష్ ఫోగట్ కానీ సాక్షి మాలిక్ ల దగ్గర కానీ కనీస ఆధారాలు ఉన్నాయా బ్రిజ్ భూషణ్ తమని లైంగికంగా వేధించినట్లు? పోనీ నేరుగా బ్రిజ్ భూషణ్ పాత్ర లేదని మాట మార్చి తమ కోచ్ తమని లైంగికంగా వేధించాడు అని ఆరోపిస్తూ దానికి WFI ప్రెసిడెంట్ అయిన బ్రిజ్ భూషణ్ మద్దతు ఉంది అని ఆరోపిస్తున్నారు అంటే నమ్మేది ఎలా?

ఇప్పుడు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతున్నది. కోర్టుకి సాక్ష్యాలు కావాలి కానీ ఆరోపణలు కావు. ఒకవేళ సుప్రీం కోర్టులో సాక్ష్యాలు ఇవ్వలేకపోతే? ఇప్పటికే బ్రిజ్ భూషణ్ ప్రెస్ మీట్ లో చెప్పేశాడు నా మీద చేస్తున్న ఆరోపణలని ఋజువు చేయలేకపోతే నేను పరువు నష్టం దావా వేస్తాను ఖచ్చితంగా అంటూ!

2024 లో జరగబోయే ఎంపికలలో హర్యానా రెజ్లర్స్ ని ఎందుకు పక్కన పెట్టాలనే ఆలోచన వచ్చింది? పూర్తిగా హర్యానా వాళ్ళని పక్కన పెట్టె ఆలోచన ఏమీలేదు. ఎవరికి ప్రతిభ ఉందో వాళ్ళనే ఎంపిక చేస్తారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ అనే ఇద్దరు మహిళా రెజ్లర్స ట్రాక్ రికార్డ్ అంత బాగాలేదు.
1. వినేష్ ఫోగాట్ అసలు నేషనల్ రెజ్లింగ్ ఫెడరేషన్ నిర్వహించే ట్రైనింగ్ కాంప్ కి హాజరు కాలేదు. ఏ రెజ్లర్ అయినా జాతీయ రెజ్లింగ్ ట్రైనింగ్ కాంప్ లో మొదట శిక్షణ తీసుకున్న తరువాతే జాతీయ,అంతర్జాతీయ వేదికల మీద పోటీలకి హాజరు అవుతారు కానీ వినేష్ ఫోగాట్ మాత్రం అలాంటి శిక్షణ తీసుకోకుండానే పాల్గొంది ఎలా?
2. వినేష్ ఫోగాట్ కి శిక్షణ ఇవ్వడం కోసం మన దేశపు కోచ్ ని నియమిస్తే నాకు యూరోపియన్ కోచ్ కావాలి అని పట్టు బట్టి మరీ విదేశీ కోచ్ అందులోనూ యూరోపియన్ కోచ్ ని కావాలని అడిగినది అధికారులు నియమించారు కూడా.
3. తీరా ఒలింపిక్ క్రీడల కోసం వెళితే అక్కడ తన ఒక్కదానికే విడిగా రూమ్ కావాలి అని పట్టు పట్టింది. Ok. అనవసరంగా విదేశాలలో గొడవ ఎందుకని విడిగా రూమ్ ఇచ్చారు అధికారులు.
4. కానీ తన రూమ్ చుట్టుపక్కల భారతీయ క్రీడాకారులకి రూమ్ లు ఇవ్వవద్దనీ పట్టు బట్టింది! అంటే ఒలింపిక్ క్రీడా గ్రామమ్ లో తాను ఉండే రూమ్ కి దగ్గరలో భారతీయులు ఎవరూ ఉండకూడదు అన్న మాట! దేనికంటారు?
5. ఒలింపిక్స్ ప్రారంభం లో వివిధ దేశాల క్రీడాకారులు తమ దేశ జాతీయ పతాకాన్ని పట్టుకొని మార్చ్ చేయడం రివాజు. అలాగే ఒక్కో దేశ క్రీడాకారులకి ప్రత్యేకమయిన డ్రెస్ కోడ్ ఉంటుంది, కానీ వినేష్ ఫోగాట్ మాత్రం తన తోటి క్రీడాకారులు అందరూ భారతదేశపు డ్రెస్ కోడ్ ప్రకారం వస్తే తాను ఒక్కతే తనకిష్టం అయిన డ్రెస్ వేసుకొని మార్చ్ లో పాల్గొంది! నిబంధనలు ఉల్లంఘించినా అధికారులు చూసీ చూడనట్లు వదిలేశారు!
6. ఒలింపిక్స్ సన్నాహక శిబిరానికి ఈ ఇద్దరు రెజ్లర్లు కూడా ఫైవ్ స్టార్ సౌకర్యాలు కావాలని పట్టుపట్టేవాళ్ళు! అధికారులు పోనీలే ఏదో ఒక పతకం సాధించకపోతారా అని వాళ్ళు అడిగినవి సమకూర్చారు!
7. ఇక ఒలింపిక్స్ కానీ కామన్ వెల్త్ గేమ్స్ కి కానీ విదేశాలకి వెళ్లాల్సి వస్తే మిగతా క్రీడాకారులకి ఎకానమీ క్లాస్ లో టికెట్స్ బుక్ చేస్తే వీళ్ళు మాత్రం తమకి ఫస్ట్ క్లాస్ లో టికెట్స్ బుక్ చేయమని డిమాండ్ చేసేవాళ్ళు. ఎకానమీ లో కూర్చొని ప్రయాణం చేస్తే కండరాలు పట్టేస్తాయి అని కారణం చెప్పేవారు. కానీ అదే విమానం మిగతా మహిళా రెజ్లర్లు మాత్రం ఎకానమీ క్లాస్ లో ప్రయాణం చేస్తే వీళ్ళు మాత్రం ఫస్ట్ క్లాస్ లో దర్జాగా ప్రయాణం చేసేవాళ్ళు.
8. తీరా ఫస్ట్ రౌండ్ లోనె మట్టి కరిచేవాళ్ళు! అప్పుడు వీళ్ళు చెప్పే కారణాలు ఏమిటో తెలుసా? కాలికి అయిన గాయం ఇంకా మానలేదు, భుజ కండరం పట్టేసింది అని. మరి ఫిట్నెస్ లేనప్పుడు ఎందుకు పోటీలకి వెళ్ళినట్లు?
9. 2024 లో వినేష్ ఫోగాట్ ని, సాక్షి మాలిక్ ని పక్కన పెట్టి మిగతా వాళ్ళకి అవకాశాలు ఇవ్వబోతున్నారు అని తెలుసుకొని WFI ప్రెసిడెంట్ ని రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు అంతే కానీ లైంగిక వేధింపులు మన్ను మశానం కానే కాదు.
10. సాక్షి మాలిక్ కావొచ్చు మరియు వినేష్ ఫోగాట్ లకి కావొచ్చు ఇచ్చిన VIP సౌకర్యాలు ఎలాంటివి అంటే ధ్యాన్ చంద్ కి కానీ P.T.ఉష లాంటి వారికి కలలో కూడా ఊహించడానికి కష్టమయినవి.
11. విదేశాలలో విదేశీ శిక్షకుల దగ్గర శిక్షణ, VIP ట్రీట్మెంట్, ప్రత్యేక సౌకర్యాలు, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం లాంటివి ఉండవు ఇక మీదట ఎందుకంటే తుది జట్టులో వీళ్ళు ఉండరు కనుక. ఇవన్నీ కోల్పోబోతున్నాము అనే బాధ బ్రిజ్ భూషణ్ ని రాజీనామా కోరేట్లు చేస్తున్నది.
12. గత జనవరి నెలలో ధర్నా కి దిగినప్పుడు తాము కేవలం న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాము కానీ ఎలాంటి రాజకీయం లేదని విలేఖరుల ముందు చెప్పారు కానీ..
13. ఇప్పుడేమో ప్రియాంక వాద్రా, పప్పు యాదవ్,కేజ్రీవాల్ లు పరామర్శించ డానికి వస్తే మీ అవసరం లేదని చెప్పలేకపోయారు ఎందుకు? అసలు టూల్ కిట్ లో భాగంగానే ఇది జరుగుతున్నది.
14. ముందు నానా యాగీ చేసి అంతర్జాతీయ మీడియా దృష్టిని తమ వైపు తిప్పుకొని ఆపై కోర్టులో తిట్లు తింటారనీ తెలిసే చేస్తున్నారు.

ఈ వివాదంలోకి మోడీజీ ని లాగడం వెనుక ఏముందో అందరికీ తెలిసిన విషయమే!
దేనికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాని ప్రకారమే జరుగుతాయి తప్పితే ధర్నాలు చేసినంత మాత్రాన రాజీనామాలు చేయరు ఎవరూ! పోలీస్ ఫిర్యాదు లేదా నేరుగా మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు చేయవచ్చు కానీ అలా చేయలేదు వీళ్ళు అంటేనే అర్ధం అవుతుంది ఉద్దేశ్యం ఏమిటో!

( రచయిత ప్రస్తావించిన అభిప్రాయాలతో సూర్య వెబ్‌సైట్‌కు సంబంధం లేదు. అది రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని గమనించగలరు)

– పార్ధసారధి పోట్లూరి

LEAVE A RESPONSE