-పదవీ బాధ్యతలు స్వీకరించిన నూతన అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి వై. మధుసూదన్ రెడ్డి
పచ్చదనం పెంపే లక్ష్యంగా తమ కార్యాచరణ రూపొందిస్తామని రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి వై.మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో నూతన పీసీసీఎఫ్ గా బాధ్యత లు స్వీకరించారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ…
నిజాయితీతో , అంకిత భావంతో పనిచేయడం ముఖ్య విధి అని సిబ్బందికి సూచించారు. అటవీ శాఖతో పాటు వివిధ శాఖలలో తాను పనిచేసిన అనుభవం తో అటవీ శాఖను అగ్రస్థానంలో నిలబెట్టడానికి పాటు పడతానన్నారు. పచ్చదనం పెంచటంతో పాటు అటవీ సంపదను కాపాడడం, వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అడవుల సంరక్షణ పట్ల, అటవీ సంపదను కాపాడడం విషయంలో కూడా తమకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలు, సహకారం తో ముందుకు పోతామని ఆయన వివరించారు. మైదాన ప్రాంతాలలో విరివిగా మొక్కలు నాటటం తో పాటు వాటి పరిరక్షణ బాధ్యత కూడా తమ సిబ్బంది తీసుకుంటారన్నారు. అదేవిధంగా వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. అటవీ సంపదను కాపాడడం, సిబ్బంది సంక్షేమం తదితర కార్యక్రమాలు శాఖాపరంగా వరుస క్రమంలో జరుగుతాయని ఆయన వివరించారు. క్రమశిక్షణ, నిజాయితీ, అంకిత భావం ఏ వ్యక్తినైనా ఉన్నత స్థాయిలో నిలబెడతాయని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ లు ఆర్పీ ఖజూరియా, ఏ.కే.ఝా,ఏకాభిప్రాయం నాయక్, అడిషనల్ పీసీసీఎఫ్ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా బదిలీ పై వెళుతున్న పీసీసీఎఫ్ ఎన్. ప్రతీప్ కుమార్ సేవ లను కొనియాడుతూ ఆయనను ఘనంగా సత్కరించారు.