Suryaa.co.in

Andhra Pradesh

పార్టీ నుంచి ఎమ్మెల్సీ అనంత‌బాబు సస్పెన్ష‌న్‌

డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ అనంత బాబును వైసీపీ స‌స్పెండ్ చేసింది. ఈ మేర‌కు ఆ పార్టీ బుధ‌వారం సాయంత్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఏపీలో క‌ల‌క‌లం రేపిన సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో అరెస్టయిన అనంత‌బాబు ప్ర‌స్తుతం జ్యుడిషియ‌ల్ రిమాండ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఈ హ‌త్య కేసులో త‌న త‌ప్పిదాన్ని అనంత‌బాబు ఒప్పుకున్న‌ట్లుగా వార్త‌లు వినిపించాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా… న్యాయ‌మూర్తి ఆయ‌న‌కు జ్యుడిషియ‌ల్ రిమాండ్ విధించారు. సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య‌పై విప‌క్షాలు ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్న నేపథ్యంలో అనంత‌బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

LEAVE A RESPONSE