Suryaa.co.in

Andhra Pradesh

అసెంబ్లీలో వైసీపీ-టీడీపీ ‘స్క్రీన్‌’ సమరం

– స్కిల్‌పై వైసీపీకి స్క్రీన్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చే చాన్స్‌
– తమకూ ఇవ్వాలని పట్టుపట్టనున్న టీడీపీ
– చంద్రబాబు అరెస్టు పై అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యేల చర్చ
– అసెంబ్లీకి వెళ్లాలని టీడీపీ నిర్ణయం
– ఇసుక, లిక్కర్‌ అక్రమాల ప్రస్తావన
– పంచాయితీకి నిధుల బకాయిలపై సమరం
– వెంకటాయపాలెం నుంచి టీడీపీ ఎమ్మెల్యేల నిరసన పాదయాత్ర
( మార్తి సుబ్రహ్మణ్యం)

తన పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత అసెంబ్లీకి హాజరుకావాలా? వద్దా? అన్న అంశంపై, టీడీపీ శాసనసభాపక్షం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు సభకు హాజరయి, ప్రజాసమస్యలు చాటాలని నిర్ణయించింది. ఆ ప్రకారంగా పార్టీ ఎమ్మెల్యేంతా వెంకటాయపాలెం లోని ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి, అసెంబ్లీ వరకూ నిరసన పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు.

కాగా అసెంబ్లీ సమావేశాల్లో స్క్రీన్‌ సమరం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విపక్ష నేత చంద్రబాబునాయుడుకు సంబంధించిన అవినీతి అంశాలను సభలో స్క్రీన్‌ ద్వారా వివరించాలని వైసీపీ యోచిస్తోంది. ఆ సందర్భంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌, అవుటర్‌ రింగ్‌రోడ్డు అవినీతి అంశాలను ప్రస్తావించనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే సర్కారుపై ఈ అంశంలో ఎదురుదాడి చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఆయా అంశాలపై అధికారపార్టీకి ఒకవేళ స్పీకర్‌ అనుమతి ఇస్తే.. వాటికి సమాధానాలు ఇచ్చేందుకు తమకూ అవకాశం ఇవ్వాలని టీడీపీ డిమాండ్‌ చేయనుంని. అసెంబ్లీ అందరి ఆసక్తి కాబట్టి, అందరికీ హక్కు ఉంటుందని టీడీపీ వాదిస్తోంది. ఒకవేళ స్పీకర్‌ అనుమతించకపోతే, బయట వాటిని ప్రదర్శించాలని టీడీపీ భావిస్తోంది.

కాగా ఇసుక కుంభకోణం, అక్రమ మద్యం రవాణా, పంచాయతీలకు నిధుల బకాయి వంటి కీలక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీపీ శాసనసభాపక్షం నిర్ణయించింది.

LEAVE A RESPONSE