-ఇదో శాడిస్టు ప్రభుత్వం
-ఇంటికి పంపించాల్సిన బాధ్యత ప్రజలదే
-సంక్షేమ పాలన అంతా బూటకపు ప్రచారమే
-చాక్లెట్ ఇచ్చి నక్లెస్ కొట్టేస్తున్న జగన్ సర్కారు
-వచ్చేది టీడీపీ-జన సేన ప్రభుత్వమే
-సత్తెనపల్లి పట్టణం 26వ వార్డు లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి కన్నా
-సత్తెనపల్లి పట్టణం 26వ వార్డు లో అట్టహాసంగా భారీ ర్యాలీతో స్వాగతం పలికిన పట్టణ కార్యకర్తలు
– ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన మాజీ మంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి : ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా కార్య సిద్ధి విగ్నేశ్వరుని ఆలయంలో పూజలు చేసి అనంతరం మహిళలు హారతులతో ఘన స్వాగతంపలికారు కన్నా గారు వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థించారు
కన్నా మాట్లాడుతూ…..మహాశక్తి పేరుతో ప్రకటించిన పథకం ద్వారా తల్లికి వందనం కింద బిడ్డలను చదివించేందుకు ఒక్కొక్కరికి 15000 ఇవ్వనున్నారు.ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు.సాగు భారమై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారికి అండగా ఉండేందుకు సంవత్సరానికి ₹20,000 ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు. 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని, ఇంటింటికి ఉచితంగా రక్షిత తాగునీటి కల్పించనున్నారు. పేదరికం రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలని వీరందరినీ నట్టేట ముంచాడని బీసీలకు 27 సంక్షేమ పథకాలు రద్దుచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో 10% రిజర్వేషన్లు తక్కువ చేసిన ఘనత కూడా ఈ సైకో జగన్ కే చెందుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తమను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రజల బాలు పలికి ఢిల్లీ వెళ్ళిన వైకాపా ఎంపీలు హోదా సాధన మరిచిపోయి నేరాలు అసభ్యకరమైన పనులు చేస్తూ దేశవ్యాప్తంగా మన రాష్ట్రం పరువు తీసేస్తున్నారని విమర్శించారు.
ఒక నిరుద్యోగి జీవితంలో ఐదేళ్లు అంటే ఎంతో విలువైన కాలమని తన తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని ఐదేళ్లలో వేలకోట్ల అక్రమంగా సంపాదించారని నేల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ఊరించి కనీసం ఒక్క నియామక ప్రక్రియ కూడా పూర్తి చేయకుండా యువత జీవితాలతో ఆడుకుంటున్నాడని పరిపాలన రాజధాని చేస్తామని విశాఖను కబ్జా చేశాడని విమర్శించారు.
ఇసుక ధరల్ని అందనంత ఎత్తులో ఉంచాడని ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నాడని ధ్వజమెత్తారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని త్వరలోనే ఈ రాక్షస ప్రభుత్వానికి చరమగీతం పాడాలని ఈ సైకోని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమేయాలని అభ్యర్థించారు.