శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ప్రారంభం

Spread the love

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా మంచి కార్యక్రమానికి మళ్లీ ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. దేశంలో తొలిసారిగా అత్యంత శాస్త్రీయ పద్దతిలో సమగ్ర భూసర్వే తొలి దశలో 51 గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశామన్నారు. 11,501 గ్రామాల్లో డిసెంబర్‌ 2022 నాటికి రీసర్వే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి 37 గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. భవిష్యత్‌లో వివాదాలకు తావు లేకుండా సమగ్ర సర్వే చేపట్టామన్నారు. మీ ఆస్తులు లావాదేవీలు మీ గ్రామంలో కనిపించే విధంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చన్నారు. ఇటువంటి మంచి సంస్కరణ నేటి నుంచి అమల్లోకి తెస్తున్నామని సీఎం అన్నారు.

‘‘భూములకు సంబంధించి ట్యాంపరింగ్‌ జరుగుతోందన్న ఫిర్యాదులు వచ్చాయి. పట్టాదారు పాస్‌ బుక్‌లకు ఆశించినంత లాభం జరగలేదు. భూమికి చెందిన నిర్ధిష్టమైన హద్దులు, హక్కులు ఇప్పటివరకు లేవు. కేవలం 90 శాతం కేసులు సివిల్‌ వివాదాలకు సంబంధించినవే.. శాస్త్రీయ పద్దతుల్లో భూములకు నిర్థిష్టంగా

మార్కింగ్‌ చేసి ప్రతి ఒక్కరికీ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ ఇస్తే ల్యాండ్‌ వివాదాలకు చెక్‌ పెట్టొచ్చు. 2023 కల్లా సమగ్ర రీ సర్వే చేసి యూనిక్‌ ఐడీ కార్డ్‌, డేటా అప్‌డేట్‌ ఇస్టాం. తొలి దశలో 51 గ్రామాల్లోని.. 29,563 ఎకరాల భూముల రీసర్వే చేశాం. ఎమ్మార్వోల ద్వారా భూ యజమానుల అభ్యంతరాలను పరిష్కారం చేశాం. ప్రతి భూ కమతానికి ఉచితంగా భూ రక్ష హద్దు రాళ్లు ఇస్తామని’’ సీఎం పేర్కొన్నారు.

శ్రీకాకుళం జిల్లా కలక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాసనసభాపతి శ్రీ తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రి శ్రీ డాక్టర్ సీదిరి అప్పలరాజు, జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాటకర్, జాయింట్ కలెక్టర్ శ్రీమతి విజయసునిత, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply