Suryaa.co.in

Andhra Pradesh

వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌

– వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు
– వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం
– మంగళవారం క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌
– రైతన్నల లోగిళ్ళలో ముందే వచ్చిన దీపావళి కాంతులు, ఒకే రోజు మూడు పథకాల ద్వారా రైతన్నలకు లబ్ది
వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం, వైఎస్సార్‌ యంత్ర సేవా పథకాల క్రింద రూ. 2,191 కోట్ల లబ్ది…ఇదివరకే ఆగష్టులో రెండో విడత వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ క్రింద జమ చేసిన సాయం రూ. 977 కోట్లు పోను, మిగిలిన మొత్తం రూ. 1,214 కోట్లు నేడే బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం
వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌
కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా చెప్పిన మాట మేరకు ఇస్తానన్న సమయానికే వైఎస్సార్‌ రైతు భరోసా క్రింద వరుసగా మూడో ఏడాది కూడా అక్టోబర్‌లో ఇవ్వనున్న రెండవ విడతగా 50.37 లక్షల మంది రైతన్నలకు రూ. 2,052 కోట్ల లబ్ది
దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసా క్రింద ఏటా రూ. 13,500 రైతు భరోసా సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం
ఇప్పుడు అందిస్తున్న సాయం రూ. 2,052 కోట్లతో కలిపి రెండున్నర సంవత్సరాలలో ఇప్పటివరకు రైతన్నలకు జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం రైతు భరోసా సాయం రూ. 18,777 కోట్లు
చెప్పిన దాని కన్నా ముందుగా, మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా రైతన్నలకు సాయం
మ్యానిఫెస్టోలో చెప్పింది – ఏటా రూ. 12,500 – 4 సంవత్సరాలు – రూ. 50,000
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇస్తున్నది – ఏటా రూ. 13,500 – 5 సంవత్సరాలు – రూ. 67,500
రైతన్నలకు అదనంగా అందిస్తున్న మొత్తం రూ. 17,500
మొదటి విడత – ఖరీఫ్‌ పంట వేసే ముందు మే నెలలో రూ. 7,500
రెండో విడత – ఖరీఫ్‌ పంట కోత సమయం అక్టోబర్‌ నెల ముగిసేలోపు, రబీ అవసరాల కోసం రూ. 4,000
మూడో విడత – ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ జనవరి నెలలో రూ. 2,000
వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు
ఈ పథకం క్రింద 6.67 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ. 112 కోట్ల వడ్డీ రాయితీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా నేరుగా జమ.
చక్రవడ్డీల పద్మవ్యూహంలో చిక్కుకుని అన్నదాతలు అప్పుల ఊబిలో పడిపోకుండా వారికి అండగా నిలుస్తూ ఇ–క్రాప్‌ డేటా ఆధారంగా లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకుని ఏడాది లోపు సమయానికి తిరిగి చెల్లించిన రైతన్నలకు ఈ పథకం క్రింద పూర్తి వడ్డీ రాయితీని అందిస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.
గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ. 1,180 కోట్లతో పాటు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద చెల్లించిన రూ. 382 కోట్లతో సహా, ఇప్పుడు అందిస్తున్న వడ్డీ రాయితీ రూ. 112.7 కోట్లతో కలిపి ఇప్పటివరకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం క్రింద 62.78 లక్షల మంది రైతన్నలకు రూ. 1,674 కోట్ల వడ్డీ రాయితీని అందించిన ప్రభుత్వం.
వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం
వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం క్రింద 1,868 రైతు గ్రూపులకు రూ. 27.17 కోట్ల లబ్ది నేడే జమ.
సన్న, చిన్నకారు రైతులకు అద్దె ప్రాతిపదికన సాగు యంత్రాలు, పనిముట్లను అందుబాటులో ఉంచి విత్తు నుండి కోత వరకు అవసరమైన యంత్ర పరికరాల కొరతను అధిగమించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 2,134 కోట్ల వ్యయంతో వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా 10,750 గ్రామ స్ధాయి యంత్రసేవా కేంద్రాలు (కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్స్‌), వరి ఎక్కువగా సాగయ్యే ఉభయ గోదావరి మరియు కృష్ణ, గుంటూరు జిల్లాలలో మండలానికి 5 చొప్పున 1,035 కంబైన్డ్‌ హార్వెస్టర్‌తో కూడిన క్లస్టర్‌ స్ధాయి యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటు.

LEAVE A RESPONSE