– పాపం పేటీఎంలు మాత్రమే అంకితభావంతో పనిచేస్తున్నారు
వైకాపా ఆస్థాన సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్ట్‌లైన కేసరి పిస్తా నుండి ఎర్నలిస్ట్ వరకు, ప్రొఫెసర్ నుండి ముతక రవి వరకు అందరికీ జగన్ మీద అనుమానం మొదలైంది. రాజకీయం చేసే ఎవడూ ‘రఫ్ఫా రఫ్ఫా’, ‘నరుకుతాం’ అని మాట్లాడరు. మొదట ఏదో భయపెడుతున్నాడులే అని వీరు సర్దిచెప్పుకొని, శ్రద్ధగా తమ పెయిడ్ ఆర్టిస్ట్ పనులు చేసుకుపోతున్నారు. అమరావతిని ఇక మార్చలేమని తెలిసి కూడా, ఎప్పుడైతే జగన్ ‘మావిగన్’ అన్నాడో.. దానినే ప్రజలంతా ‘శభాష్’ అంటూ ఆహ్వానిస్తున్నారని, ఆయనో ‘జీనియస్’ అని సాక్షిలో అచ్చేసరికి.. సోషల్ మీడియాలోని బూతుల సునామీని చూసి ఈ ఆర్టిస్టులకంతా ఒక క్లారిటీ వచ్చింది.
జగన్ జస్ట్ టైంపాస్ రాజకీయాలు చేస్తున్నాడని వీరికి అర్థమైంది. కాంగ్రెస్ లాంటి పార్టీలను రాకుండా చూడటానికి, టెక్నికల్‌గా ప్రతిపక్ష హోదా లేకపోయినా, అసెంబ్లీకి వెళ్లకపోయినా, ప్రజల సమస్యల మీద పోరాటం చేయకపోయినా.. ఆ హోదాను మాత్రం అనుభవిస్తున్నాడు. తన టైంపాస్ రాజకీయాల కోసం మనల్ని బకరాలను చేస్తున్నాడని, ఎంత కష్టపడుతున్నా పేమెంట్ పెంచడం లేదని వీరు మేల్కొన్నారు. లాంగ్‌టర్మ్ ఇంకో 8 ఏళ్లు ఈ వైకాపా పేమెంట్లను నమ్ముకుంటే నట్టేట మునుగుతామని భావించారు. అందుకే, బాగా ధనవంతుడైన ఒకాయన కొత్త పార్టీ పెట్టి పేమెంట్స్ ఇస్తాడని భావించి, మెల్లగా ఎక్స్ట్రా టైంలో ఆయన కోసం ‘మూన్‌లైటింగ్’ జాబ్ మొదలెట్టారు.
కొత్త భిక్షగాడు పొద్దెరగనట్లుగా.. ఎటూ ప్రింట్, శాటిలైట్ మీడియా తనను పట్టించుకోదని భావించి, ఈ పెయిడ్ ఆర్టిస్టులకు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలెట్టాడు ఆ కొత్తాయన. ఈ పిస్తాగాడు ఆ డబ్బున్నోడితో చేసిన ఒక ‘హృదయ కాలేయం’ లాంటి ఇంటర్వ్యూ చూశాను.
‘ఒక పెద్ద బడా ఐటీ కంపెనీ వేలమందిని తీసేసింది కదా, మరి లోకేష్ విశాఖకు తెచ్చే కంపెనీలలో ఉద్యోగాలు శాశ్వతమా?’ అని ఒక తిక్కల క్వశ్చన్ అడిగాడు. కోస్తా తీరంలోని భూములు ఆక్రమించడానికే గూగుల్‌ను తెచ్చారని ఆ కొబ్బరి మట్టగాడు తిడుతున్నాడు. పీజీ చదువుకున్న ఈ పిస్తాగాడు పెయిడ్ ఆర్టిస్టు ఆదాయం చాలక ఇలా మూన్‌లైటింగ్ ఆదాయం చూసుకుంటున్నాడు. పాపం, మన పేటీఎంలు మాత్రం ఇప్పటికీ ఐదు రూపాయలకే అంకితభావంతో పనిచేస్తున్నారు!