(బాబు భూమా)
“నూటికో కోటికో ఒక్కరు… ఎప్పుడో ఎక్కడో పుడతారు. మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మీరే మాస్టారు..” ఇది విశ్వరూపం సినిమాలో కవి రాసిన చరణం.
త్రిమూర్తుల్లో బ్రహ్మ తప్ప సాక్షాత్తు శివుడు, మహావిష్ణువు ఇద్దరూ తమకు కావలసిన రూపాన్ని సృష్టించమని బ్రహ్మను అభ్యర్థిస్తే, విష్ణు ద్వారపాలకులు జయవిజయులు కూడా తమకు కావలసిన రూపాలను కోరారు. వారి కోరిక మేరకు బ్రహ్మ ఎన్టీఆర్ రూపంలో ఒకే ఒక్క మనిషిని సృష్టించాడు. ఆ రూపంలో రావణుడు, కలి అంశంతో దుర్యోధనుడు, కాలజ్ఞాన వీరబ్రహ్మేంద్ర స్వామి, రిక్షావాడి వరకు ఇలా అందరికీ సరిపోయేలా రూపొందించాడా అనే సందేహం నాది.
జన్మ రాహిత్య కారణాలన్నీ పూర్తి చేసి, తన జీవిత చరమాంకంలో కూడా కలియుగానికి ఇవ్వాల్సిన సందేశం మానవాళికి ఇచ్చి వెళ్ళిన కారణ జన్మ యుగపురుషుడు రామారావు.
రాష్ట్రం, దేశం, ప్రపంచంలో ఎక్కడా ఒక అమ్మ చిన్నారిని కనే 9 నెలల సమయంలోనే ఒక పార్టీ ప్రజాస్వామ్యంలో అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు.
ప్రకటిత నియంతృత్వం నుండి అప్రకటిత నియంతృత్వం వరకు పోరాడటం, దారిలోకి తెచ్చుకోవడం ఎలాగో, ఒక పార్టీని ఎలా తీర్చిదిద్దాలో, ఎలా ఉండకూడదో కూడా మార్గనిర్దేశం చేసి కోట్లాది ప్రజాస్వామ్య పార్టీ కుటుంబాన్ని ఇచ్చి వెళ్లారు రామారావు.
బ్రహ్మ రాత తెలుగోడికి అనుకూలంగా తెలుగుదేశం రూపంలో రాశాడా అని అనిపిస్తుంది ఒక్కోసారి. సరస్వతీ ప్రార్థన చేసే మన పట్ల బ్రహ్మ నుండి దేవతలు వరకు వారి రాజధాని అమరావతి నుండి మన రాజధాని అమరావతి మూలంగా దేశానికి, ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వాలనుకున్నట్లు కనిపిస్తోంది.
నగరాల మయుడిగా నాయుడిని ఎంచుకొని ఆ దేవతలు చేస్తున్న పునర్నిర్మాణంలో పులకించే అదృష్టం ఈ తరానిది. రేపటికి కూడా లోకేశుడు రక్షకుడు అనే సంకేతాలు ఇస్తున్న దేవతలకు కృతజ్ఞతలు. ఆదరిస్తున్న కోట్లాది ప్రజలకు తెలుగుదేశం 43వ ఆవిర్భావ శుభాకాంక్షలు.
చిత్రం : విశ్వరూపంలోనిది.