అవినీతి లేని కర్మయోగి అతడు!

0
22

స్వచ్ఛ భారత్ అంటే ఏడ్చావు
గంగానది ప్రక్షాళన కి ఏడ్చావు

రామ మందిరానికి ఏడ్చావు
రాఫెల్ వస్తే ఏడ్చావు

ఆర్టికల్ 370 రద్దుకి ఏడ్చావు
అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ కి ఏడ్చావు

బూట్లు చూసి ఏడ్చావు
నోట్లు రద్దు కీ ఏడ్చావు

జేబులో పెన్ను కి ఏడ్చావు
GST పన్నుకీ ఏడ్చావు

గెడ్డం చూసి ఏడ్చావు
కట్టుకున్న గుడ్డని చూసీ ఏడ్చావు

ప్లాట్ ఫాం టికెట్టు కి ఏడ్చావు
పటేల్ విగ్రహాని కీ ఏడ్చావు

తిరంగా ఎగిరితే ఏడ్చావు
త్రిబుల్ తలాక్ కీ ఏడ్చావు

నెమలిని ముట్టుకుంటే ఏడ్చావు
కెమెరా పట్టుకున్నా ఏడ్చావు

అంబానీ పై ఏడ్చావు
అమ్మకి దణ్ణం పెట్టినా ఏడ్చావు

అద్వానీ పై ఏడ్చావు
అదానీ పై కూడా ఏడ్చావు

కాశీ కారిడార్ కి ఏడ్చావు
కాశ్మీర్ లో ఇంటెర్నెట్ ఆపినా ఏడ్చావు..

చప్పట్లు అంటే ఏడ్చావు
దీపం వెలిగించినా ఏడ్చావు

రెండు వ్యాక్సిన్లు వేసుకున్నావు
రెండేళ్లు రెండు రేషన్లు మాత్రం తిన్నావు..

ఎనిమిదేళ్లుగా ఏడుస్తున్న నీ ఏడ్పుల్లో …
బాంబు గానీ , స్కామ్ గానీ వుందేమో ఒక్కసారి వెతుక్కో…
నువ్వెంత వెతికి నా అవినీతి లేని కర్మయోగి అతడు.

– చెన్ను సుబ్రమణ్యం