– అభిమాన నేత కదిలిరావడంతో చెంగాచారి భావోద్వేగం
(కృష్ణారావు)
కుప్పం/శాంతిపురం: కుప్పం నియోజకవర్గం శాంతిపురానికి చెందిన చెంగాచారి సాధారణ టిడిపి కార్యకర్త. గృహప్రవేశం నిమిత్తం కుప్పం వచ్చి గత రెండురోజులుగా బిజీబీజీగా ఉన్న రాష్ట్ర మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశాడు. చెంగాచారి బాగోగులను వాకబుచేసిన లోకేష్ మాటల్లో ఏం చేస్తుంటావని అడిగాడు. తాను తెలుగుదేశం పార్టీ వీరాభిమానినని, శాంతిపురంలో టీకొట్టు నడపుతూ జీవనం సాగిస్తున్నానని చెప్పాడు.
కుప్పం నుంచి కడప మహానాడుకు బయలుదేరిన యువనేత లోకేష్ సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా టీకొట్టు వద్దకు వెళ్లాడు. అన్నా… చాలా దూరం వెళ్లాలి… టీ ఇస్తావా అని అడిగాడు. చెంగాచారికి కొద్దిసేపు నోటమాట రాలేదు. తమ అభిమాననేత నేరుగా తమ కొట్టుకురావడంతో సంభ్రమాశ్చార్యానికి లోనయ్యాడు.
యువనేత లోకేష్ కు టీ గ్లాసు అందించాడు. వ్యాపారం ఎలా ఉందని అడగ్గా చెంగాచారి స్పందిస్తూ… సర్… నేను 1994 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటున్నా. చంద్రబాబు గారంటే అభిమానం. టిడిపికి చెందిన వాడినన్న కోపంతో గత 5ఏళ్లు నా టీ అంగడి మూయించారు.
ఎన్నికోట్లు ఇస్తే వస్తుంది ఆ అభిమానం… అందుకే ఆయన కార్యకర్త మనసెరిగిన మారాజు అయ్యాడు.