Suryaa.co.in

Andhra Pradesh

కడపలో ‘మహానాడు’ ఆలోచన లోకేష్‌దే!

కడపలో మహానాడు నిర్వహించాలన్న ఆలోచన ఎవరిది, వెనకున్న మాస్టర్ మెండ్ ఎవరు..?

కడప నడిబొడ్డులో ఈసారి టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది. ఇప్పటికే కడప నగరం టీడీపీ జెండాలతో పసుపుమయమైపోయింది. అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి కడపలోనే మహానాడుని ఎందుకు నిర్వహిస్తున్నారు. దీని వెనుక ఏదైనా కారణం ఉందా అంటే బలమైన కారణమే ఉంది. ఆ కారణం పేరే నారా లోకేష్

సరిగ్గా 3 నెలలు వెనక్కి వెళ్తే… నారా లోకేష్ , పార్టీలో చాలా కీలకమైన మరో ఇద్దరు వ్యక్తులు కారులో వెళ్తున్నారు. నాలుగో వ్యక్తిగా నేను కూడా అక్కడే ఉన్నా. ఆ సందర్భంలో నారా లోకేష్ మహానాడు ప్రస్తావన తెచ్చారు. ఈసారి మహానాడు ఎక్కడ, ఎలా నిర్వహిస్తే బావుంటుంది అని సలహా అడిగారు.

ఒకరు ఉత్తరాంధ్ర అన్నారు, ఇంకొకరు కోస్తాంధ్ర, నేను మధ్యాంధ్ర అన్నాను. కానీ నారా లోకేష్ మాత్రం కడపలో చేద్దాం అని అన్నారు. అక్కడున్న వారితో పాటు నేను కూడా షాక్. కడపలో ఈసారి ఎందుకు మహానాడు నిర్వహించాలో నారా లోకేష్ గారు చెప్పిన రీజన్స్ కు నాకు మరోసారి మైండ్ బ్లాంక్ అయ్యింది.

మలుపు తిప్పిన గెలుపు
గడచిన పాతికేళ్లలో ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి అంతంతమాత్రమే సీట్లు వచ్చేవి. మొత్తం 10 అసెంబ్లీ సీట్లకు గాను 2004, 2009, 2014లో ఒక్కచోటే గెలిచింది టీడీపీ. 2019 అయితే వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. 2024లో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. టీడీపీ 5, బీజేపీ 1, జనసేన 1 దక్కించుకున్నాయి. దీంతో ఒక్కసారిగా టీడీపీ అధినాయకత్వంలో జోష్ పెరిగింది. వైసీపీకి కంచుకోటగా ఉన్న కడప ప్రాంతంలో పాగా వేయగలిగామంటే దానికి కారణం ఇక్కడి నాయకులు, క్యాడర్. సో.. కడప క్యాడర్ ని, లీడర్ ని నిలబెట్టుకోవాలి, వాళ్లకు అండాదండగా ఉండాలని నిర్ణయించుకున్నారు నారా లోకేష్.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో రాయలసీమపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, పెద్ద ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్టులు సీమకే వస్తున్నాయి. దీంతో కడప మరియు రాయలసీమ అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందనే వాదనను ప్రజల్లోకి తీసుకువెళ్లినట్లు అవుతుంది. అల్టిమేట్ గా ఏ ప్రాంత ప్రజలు అయనా చూసేది అభివృద్ధినే. ఇన్నాళ్లు కడపను వైసీపీ ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత కడప రూపురేఖలే మారిపోయేలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో ఇక్కడి ప్రాంత ప్రజలు టీడీపీకి అండగా నిలబడేందుకు అవకాశం ఏర్పడుతుంది.

కార్యకర్తల్లో మనోధైర్యం
ఏ పార్టీ విజయానికి అయినా కార్యకర్తలే మూలం, బలం. వారి అండ లేకపోతే ఏ పార్టీ మనుగడ సాధించలేదు. దీంతో.. కడపలో ఉన్న క్యాడర్ కు ఈసారి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని అనుకుంటున్నారు లోకేష్ . అక్కడున్న క్యాడర్ కు ప్రాధాన్యత ఇస్తే.. వారు పార్టీకి అండగా నిలబడతారు. వాళ్లల్లో ఆ భరోసా రావాలంటే మహానాడు లాంటి ఈవెంట్ అద్భుతంగా సరిపోతుంది. అందుకే ఈసారి కడపలో మహానాడు అని అన్నారు నారా లోకేష్.
అప్పుడు అర్థమైంది నాకు… నారా లోకేష్ ని విజనరీ లీడర్, దమ్మున్న నాయకుడు అని ఎందుకు అంటారో…

LEAVE A RESPONSE