అవసరం లేని దస పల్లా రహదారి పేరిట 1000 కోట్ల టిడిఆర్ కుట్ర

– దశాబ్దాల నాటి ప్రభుత్వ సర్క్యూట్ హౌస్, జీవీఎంసీ వాటర్ ట్యాంకులను ప్రైవేటు ఆస్తి గా గుర్తించి మరో వేయి కోట్లు లాగే ప్రయత్నం
– వైయస్సార్ కాంగ్రెస్ ఉత్తరాంధ్ర ఇన్చార్జిలుగా వచ్చిన విజయ్ సాయి రెడ్డి , వైవి సుబ్బారెడ్డి ల భారీ స్కాం
– నిబంధనలకు పూర్తి విరుద్ధమని తెలిసినా ముందుండి కధ నడిపిస్తున్న సీఎం పేషి ధనుంజయ రెడ్డి, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ
– ప్రభుత్వం నుంచి టిడిఆర్ రూపంలో వచ్చే డబ్బుతోనే బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి భారీ స్కెచ్
– పైసా స్వంత ఖర్చులేకుండా ప్రభు త్వానికి చెందిన దస్పల్లా భూముల్లో ప్రభు త్వ డబ్బు తో ప్రైవేటు నిర్మాణాలకు ప్లాన్
– జనసేన నేత మూర్తి యాదవ్, బొలిశెట్టి సత్య సంచలన ఆరోపణ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా వచ్చిన రాజ్యసభ సభ్యుడు పి విజయసాయిరెడ్డి వేల కోట్ల విలువైన నగరం నడిబొడ్డులోని దశపల్లా హిల్స్ భూములను నిబంధనకు విరుద్ధంగా కొట్టేశారు. దానిని ఆపుతానంటూ తెరపైకి వచ్చిన తాజా ఇన్చార్జ్ వైవి సుబ్బారెడ్డి చివరకు ఆయనతో కుమ్మక్కై 2000 వేల కోట్ల రూపాయల టిడిఆర్ స్కామ్ కు తెరలేపారు.

విశాఖ నగర ప్రజలు ఎవరు అడగకుండానే దస్పల్లా హిల్స్ లో ప్రస్తుతం ఉన్న 40అడుగుల రోడ్డును 100 అడుగుల రోడ్డుగా విస్తరించి అందుకోసం వేయి కోట్ల రూపాయల పరిహారం టీ డీ ఆర్ రూపం లో ఇవ్వటానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అధికారులు సిద్ధమయ్యారు. అభివృద్ధి కంటే కుంభకోణాలకే ప్రాధాన్యాలు ఇచ్చే సీఎం పేషీ ప్రత్యేక అధికారి ధనుంజయ రెడ్డి, అవినీతి ఆరోపణలతో జైలుకెళ్లి వచ్చిన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వై శ్రీలక్ష్మి ఈ స్కాం కోసం విశాఖ అధికారులతో పదేపదే సమీక్షలు జరుపుతున్నారు.

వాడు చెప్పిందే తడవుగా నిబంధనలకు విరుద్ధంగా యువ ఐఏఎస్ అధికారి అయిన జీవీఎంసీ కమిషనర్ సాయికాంత వర్మ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రధాన రహదారుల విస్తరణకు పిసరంత ప్రయత్నం కూడా చేయని జీవీఎంసీ విజయ సాయి రెడ్డి , సుబ్బారెడ్డి ల ఒత్తిడితో ధనుంజయ రెడ్డి శ్రీ లక్ష్మీల ప్రోద్బలం తో మీద అసలు రద్దీ లేని దస్పల్ల హిల్స్ రోడ్ విస్తరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. జీవీఎంసీతో ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటుచేసి ఆ రహదారి నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించారు.

దస్పల్ల హిల్స్ లో ప్రస్తుతం ఉన్న రహదారి అలాగే ఉంటే అక్కడ ఐదు అంతస్తులకు మించి భవన నిర్మాణానికి అవకాశం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడి జీవీఎంసీతో 100 అడుగుల రహదారికి నోటిఫికేషన్ ఇప్పించారు. 100 అడుగుల రహదారి కారణంగా లబ్ధిదారుగా మారే విజయ్ సాయి రెడ్డి బృందం లబ్ధి పొందే అస్యూర్ ఎస్టేట్స్ తో ఆ విస్తరణకు సంబంధించిన భూమిని గిఫ్ట్ గా ఇప్పించి వచ్చు. అందుకు విరుద్ధంగా ప్రస్తుతం అక్కడ గజం విలువ 98 వేల రూపాయలు ఉంటే దానిని రెండు లక్షల రూపాయలకు పెంచి టి డి ఆర్ ని కొట్టేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

గతంలో జిల్లా కలెక్టర్ మల్లికార్జున సబ్ డివిజన్ చేసిన టౌన్ సర్వే రికార్డులను ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా పాత సర్వే నెంబర్లతో జీవీఎంసీ తో నోటిఫికేషన్ ఇప్పించారు. అంటే ఇందులో దశాబ్దాల నాటి సర్క్యూట్ హౌస్, జీవీఎంసీ వాటర్ ట్యాంకులను ఇతర ప్రభుత్వ ఆస్తులను ప్రవేట్ ఆస్తులు గా చూపించి టిడిఆర్ కు అర్హత సంపాదించడమే. ఈ ప్రయత్నం విశాఖ నగరానికి తీరని నష్టం చేసేదని తెలిసినా సీఎం పేషీ ఓ ఎస్ డి ధనుంజయ రెడ్డి మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి పదేపదే విశాఖ వచ్చి ఉన్నతాధికారులతో సమీక్ష లు, పనులు చేయిస్తున్నారు.

ప్రస్తుత 40 అడుగుల రోడ్డు ను మార్చడానికి జీవీఎంసీ ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యంతరాలు తెలియజేయడానికి చివరి తేదీ డిసెంబర్ 19. 100 అడుగుల రోడ్డు వస్తే, సర్క్యూట్ హౌస్ జీవీఎంసీ వాటర్ ట్యాంక్ లను ప్రైవేటు ఆస్తులుగా గుర్తిస్తే టిడిఆర్ రూపంలో విజయసాయి బృందానికి రెండు వేల కోట్ల రూపాయల వరకు లబ్ధి చేకూరుతుంది.. ఆ రెండు వేల కోట్ల రూపాయల తో చేతికి మట్టి అంటకుండా ఎస్యుర్ ఎస్టేట్స్ భవనాలను నిర్మించుకోవచ్చు.

ప్రభుత్వ భూమిని కొట్టేసి ప్రభుత్వ డబ్బుతోనే భవనాల నిర్మించి వేల కోట్ల వ్యాపారం చేయాలన్నది విజయ్ సాయి బృందం క్రిమినల్ మైండ్. దానికి ధనుంజయ రెడ్డి శ్రీలక్ష్మి, సాయి కాంత వర్మ లం భజన బృందంగా మారినంతపాడుతున్నారు. విజ్ఞులైన విశాఖ ప్రజలు ఇప్పటికైనా విజయ సాయి , సుబ్బారెడ్డి కుట్ర లను గమనించి విశాఖను వారి కబ్జా, కబంధ హస్తాల నుంచి బయట పడేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

సర్క్యూట్ హౌస్ కొండ పై ట్రాఫిక్ కూడా పెద్దగా లేనందువల్ల రహదారి విస్తరణ అవసరం లేదంటూ జీవీఎంసీ కి దరఖాస్తులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని తెలిసి , వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి వచ్చే అవకాశం లేదని గుర్తించి విజయసాయిరెడ్డి , సుబ్బారెడ్డి ల బృందం వేల కోట్ల రూపాయలు దోచుకునేందుకు చేస్తున్నా ఈ ప్రయత్నాలను తిప్పి కొట్టాల్సిందిగా కోరుతున్నాను.

అబిద్ హుస్సేన్ వంటి ఎంతో మంది నిజాయితీ పరులు పనిచేసిన విశాఖలో సాయి కాంత్ వర్మ లాంటి అవినీతి అధికారుల అడ్డగోలుగా వ్యవహరించడం విస్మయం కలిగిస్తుంది. ఎంపీ ఎం వి వి సత్యనారాయణ ప్రయోజనాల కోసం ఇప్పటికే సాయికాంత వర్మ టైకూన్ జంక్షన్ దగ్గర రహదారిని మూసి ఏకపక్ష వైఖరిని వెల్లడించారు. మురికివాడాలతోపాటు నగర శివారులోని పలు ప్రాంతాలకు వైయస్సార్ కాంగ్రెస్ నాయకుల లబ్ధికోసం వందల కోట్ల టిడిఆర్ లను ఆగమేఘాల మీద మంజూరు చేయించారు. విజయ్ సాయి బృందంతో చేతులు కలిపి శ్రీలక్ష్మి వంటి వారు జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ కొందరు అధికారులకు సిగ్గు రావటం లేదు.

విజయ్ సాయి రెడ్డి బినామీగా మారి వందల కోట్లు సంపాదించిన ఎస్ ఆర్ షాపింగ్ మాల్ అధినేత గోపీనాథ్ రెడ్డి దస్పల్లా విషయంలో అధికారులను బెదిరిస్తున్నారు. గతంలో వున్న ఉమేష్ ని తప్పించి గోపీనాథ్ రెడ్డి ద్వారానే వ్యవహారాలు చేస్తుండడం గమనార్హం. దస్పల్ల భూములు విషయం లో ఇంతకాలం గొడవపడిన యూ ఎల్ సీ సుబ్బరాజు, ముదపాక రామరాజుల మధ్య విజయ సాయి రెడ్డి సుబ్బారెడ్డిలు సయోధ్య కుదిర్చడంతో భారీ కుంభకోణానికి తెర లేచింది.

ఈ భూములు కోర్టు వివాదాల్లో ఉండగా, టౌన్ సర్వే రికార్డుల్లో రాణి సాహిబా వాద్వాని పేరు ఉండగా ఎస్యుర్ ఎస్టేట్స్ పేరిట ప్లాన్ ఇచ్చేందుకు జీవీఎంసీ కమిషనర్ సాయి వర్మ అత్యుత్సాహం చూపటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

దస్పల్ల రోడ్డు 100 అడుగుల విస్తరణ నోటిఫికేషన్ మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా జరిగింది. మాస్టర్ ప్లాన్ ను ఆర్డీపీకి విరుద్ధంగా రూపొందించారు. దస్పల్ల కుంభకోణానికి సూత్రధారి అయినయూ ఎల్ సి సుబ్బరాజు ఇంటిని మినహాయించి రహదారి విస్తరణకు ప్రతిపాదించారు. అందుకోసం మాస్టర్ ప్లాన్ రూపొందించిన చెన్నైకి చెందిన లీ అసోసియేట్ ను మేనేజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రహదారి విస్తరణ చేయాలంటే ఉన్న రహదారి మధ్య నుంచి అటు ఇటు విస్తరణ జరగాలి. అందుకు విరుద్ధంగా కే సుబ్బరాజు నివాసాన్ని మినహాయించడం అనుమానాలకు అవకాశం కల్పిస్తుంది.

విజయ సాయి ప్రతిపాదించిన వెంచర్ కి అడ్డు వచ్చాయంటూ ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న జీవీఎంసీ వాటర్ ట్యాంకులను అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయటం బదిలీ చేయటం సమర్థనీయం కాదు. సొంత ప్రయోజనాల తప్ప విశాఖ వాసుల ప్రయోజనాల పట్టని సాయి రెడ్డి సుబ్బారెడ్డి ల కారణంగా డు డూ బసవన్న లుగా మారిన అధికారులు ఈ పనులు చేస్తున్నారు. దస్పల్ల హిల్స్ లో ప్రస్తుతం ఉంటున్న వారికి భయపెట్టేందుకు నీటి సరఫరాను కూడా మధ్య మధ్యలో నిలిపివేస్తున్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ కు రెండు నెలలు మాత్రమే గడవు ఉన్నందున మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలు లోకి వస్తుంది. దీని ప్రకారం వందల వేల కోట్ల రూపాయలను నిర్ణయాలను అధికారులు తీసుకోకూడదు. విశాఖలోని ఐఏఎస్ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వీరి వ్యవహారాలపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. విజయ్ సాయి బినామీ అయిన అస్యూర్ ఎస్టేట్స్ కు మాతృ సంస్థ అయిన అరబిందో నుంచి ఈ పనుల కోసం నిధులు వస్తున్నాయి.

అరబిందో కి చెందిన శరత్ చంద్ర రెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే అరెస్టయి బెయిల్ మీద ఉన్నారు . అదే సంస్ధ విశాఖలో పెడుతున్న పెట్టుబడులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ జరిపితే మరోమారు వీరంతా అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాస్తవాలను గుర్తించి దస్పల్ల కుంభకోణాన్ని నివారించాల్సిందిగా పెద్దలకు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం.

Leave a Reply