ఐ.ఎం.ఏ – ఏ.పి రాష్ట్ర శాఖకు 11జాతీయ అవార్డులు

2021-22 సంవత్సరానికి గాను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ శాఖ ,ప్రజారోగ్య పరిరక్షణకు,వైద్యుల సంఘానికి అందించిన సేవలకు గాను జాతీయ స్థాయిలో పదకొండు (11) అవార్డులను అందుకుంది.

ఆంధ్ర ప్రదేశ్ ఐ.ఎం. ఏ రాష్ట్ర అధ్యక్షులు గా ప్రజలకు,వైద్యులకు బహుముఖ సేవలు అందించి నందుకు డాక్టర్ సి. శ్రీనివాస రాజు (ఏలూరు)కు,డాక్టర్ ఎ కే ఎన్ సిహ్న జాతీయ అవార్డును, ఐ ఎం. ఏ వైద్య విద్యా విభాగం కార్య క్రమాలలో కీలక పాత్ర పోషించి నందుకు డాక్టర్ డి.శ్రీహరి రావుకు (తిరుపతి),సి.పి .ఆర్- ప్రథమ చికత్సలో దేశ వ్యాప్తంగా ప్రజలకు,వైద్యులకు శాస్త్రీయ అవగాహన కార్య్రమాలు విస్తృతంగా నిర్వహించి నందుకు డాక్టర్ ఎస్.సి.చక్ర రావుకు,(కాకినాడ) డాక్టర్ ఏ కె ఎన్ .ఎస్.జాతీయ అవార్డులు లభించాయి.

ఆంధ్ర ప్రదేశ్ ఐ.ఎం. ఏ రాష్ట్ర కార్యదర్శిగా కోవిడ్ సమయంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ,వైద్యులకు ,వైద్యసంఘానికి అందించిన సేవలకుఐ .ఎం. ఏ జాతీయ అధ్యక్షుని ఉత్తమ రాష్ట్ర కార్యదర్శి అవార్డుని డాక్టర్ గార్లపాటి నంధకిషోర్,( గుంటూరు)డాక్టర్ ఎం.సుభాష్ చంద్ర బోస్ (విజయవాడ)లకు , కార్డియాలస్ట్ గా ఉత్తమ సేవలు అందించి నo దుకు, కార్డియాలజీ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వ హించి నందుకు రమేష్ హాస్పిటల్స్ కార్డియాలజీ విభాగం అధిపతి డాక్టర్ పి.ఎన్.ఎస్.హరిత (గుంటూరు)కు , ఐ.ఎం. ఏ గుంటూరు శాఖ కార్యదర్శి గా అందించిన సేవలకు , ఐ.ఎం. ఏ జాతీయ స్థాయిలో ప్రజలకు,వైద్యులకు అందిస్తున్న సేవల డైరెక్టరీని ప్రచు రించినందుకు గాను డాక్టర్ టి.సేవ కుమార్ (గుంటూరు)కు, అనంత పురం ఐ.ఎం. ఏ శాఖ అధ్యక్షులు గా ఉత్తమ సేవలు అందించి నందుకు డాక్టర్ జి.హేమలత (అనంతపురం) డాక్టర్ రాయపు రమేష్,(తిరుపతి) డాక్టర్ రోహిణి, (గూడూరు)డాక్టర్ పి అనిల్ కుమార్(నంద్యాల) లకుఅవార్డులు లభించాయి.

ఈ అవార్డులను ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ లో జరిగిన ఐ.ఎం. ఏ జాతీయ సదస్సులో జాతీయ అధ్యక్షులు డాక్టర్ సహజా నంద ప్రసాద్ సింగ్ చేతుల మీదుగా అందుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఐ.ఎం. ఏ. శాఖ కు పదకొండు అవార్డులు లభించినందుకు పలువురు సీనియర్ వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply